సాక్షి, అమరావతి: నవంబర్ నెలకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా 64,40,536 మంది అవ్వాతాతలు, వితంతు, దివ్యాంగ, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, వివిధ రకాల చేతి వృత్తిదారులకు రూ.1,775.33 కోట్ల మొత్తాన్ని పింఛన్లుగా ప్రభుత్వం పంపిణీ చేసింది. నాలుగు రోజులుగా వలంటీర్లే లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్ డబ్బులు పంపిణీ చేశారు. ఇప్పటికే 98.26 శాతం లబ్ధిదారులకు పంపిణీ పూర్తయిందని అధికారులు వెల్లడించారు. మిగిలిన వారి కోసం ఆదివారం సెలవు రోజు అయినా వలంటీర్ల ఆధ్వర్యంలో పింఛన్ల పంపిణీ కొనసాగుతుందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment