గతి తప్పిన పాలనను ఎండగడతాం: ధర్మాన | ysrcp will fight against tdp government on pressing issues, says dharmana prasadarao | Sakshi
Sakshi News home page

గతి తప్పిన పాలనను ఎండగడతాం: ధర్మాన

Published Sat, Oct 29 2016 1:23 PM | Last Updated on Sat, Jul 6 2019 1:10 PM

గతి తప్పిన పాలనను ఎండగడతాం: ధర్మాన - Sakshi

గతి తప్పిన పాలనను ఎండగడతాం: ధర్మాన

విశాఖ : టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ  మరోసారి సమరభేరికి సిద్ధమైంది. నవంబర్‌ 6న విశాఖలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించింది. పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి ఈ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ బహిరంగ  సభ ద్వారా చంద్రబాబు మోసాలను  వైఎస్ఆర్ సీపీ  ప్రజలకు వివరించనుంది.

రాష్ట్రంలో గతి తప్పిన పాలనకు వ్యతిరేకంగా సభ నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ సీనియర్‌ నేత ధర్మాన ప్రసాదరావు వెల్లడించారు. ప్రజలందరూ ఈ పోరాటానికి మద్దతు పలకాలని ఆయన పిలుపునిచ్చారు. ధర్మాన శనివారమిక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ తెలుగుదేశం సర్కార్ వాస్తవాలను దాచిపెడుతోందని ధ్వజమెత్తారు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్దంగా రాష్ట్రంలో పరిపాలన సాగుతోందని ఆయన మండిపడ్డారు. గతి తప్పిన పాలనకు నిరసనగానే ఈ సభను నిర్వహిస్తున్నామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement