
రైతు దీక్ష చేపట్టిన ధర్మాన
శ్రీకాకుళం: రైతుల సమస్యలు పట్టించుకోకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నందుకు నిరసనగా వైఎస్సార్‌సీపీ నేత ధర్మాన ప్రసాదరావు రైతు దీక్ష చేపట్టారు. నేటి (ఆదివారం) ఉదయం శ్రీకాకుళం పట్టణంలో రైతు దీక్షను ప్రారంభించి వారికి మద్ధతు తెలిపారు. రైతులు కన్నీరు పెడుతుంటే రాష్ట్ర సర్కార్ సంబరాలు చేసుకోవడం దారుణమని ధర్మాన విమర్శించారు. రైతులకు న్యాయం జరిగేవరకూ తమ పార్టీ పోరాడుతూనే ఉంటుందని రైతులకు భరోసా ఇచ్చారు.