raithu deeksha
-
రేపు రైతు దీక్ష చేపట్టనున్న బండి
-
కేసీఆర్ మాటల వరకే పరిమితం: ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: వైన్ షాప్‌లు తెరవడానికి ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధ రైతుల ధాన్యం కొనుగోలుపై లేదని టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఆయన మంగళవారం రైతు సంక్షేమ దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. వలస కూలీలను ఉచితంగా సొంత గ్రామాలకు తరలించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ వలస కూలీల రవాణా ఛార్జీలను భరిస్తుందని ఆయన తెలిపారు. కేసీఆర్ మాటల వరకే పరిమితం అయ్యారని, వలస కూలీలు ఎంతమంది ఉన్నారనే విషయంలో ప్రభుత్వం దగ్గర స్పష్టత లేదని ఉత్తమ్ మండిపడ్డారు. వలస కూలీలు వెళ్లిపోకుండ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. (లాక్డౌన్ ఉండగా మద్యం అమ్మకాలా?) వలస కూలీలు వెళ్లిపోతే తెలంగాణలో అభివృద్ధి కుంటుపడుతుందని ఉత్తమ్ అన్నారు. తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి రైతు దీక్ష చేపట్టామని ఆయన తెలిపారు. లాక్డౌన్ నేపథ్యంలో ప్రతీ పేద కుటుంబానికి రూ. 5 వేలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం 12 కేజీల బియ్యం విషయంలో మోసం చేసిందని ఉత్తమ్ తీవ్రంగా విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 12 కేజీల బియ్యంలో 5 కేజీలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని గుర్తు చేశారు. మరో 6 కేజీల బియ్యం రెగ్యులర్‌గా ఇస్తారని తెలిపారు. ఇక లాక్డౌన్ సమయంలో ప్రభుత్వం అదనంగా ఇచ్చింది ఒక కేజీ బియ్యం మాత్రమే అని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. -
‘వైఎస్ జగన్‌పై నింద మోపాలని చూస్తున్నారు’
-
గుంటూరులో వైఎస్ జగన్ రైతు దీక్ష
-
అవినీతికి కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు, లోకేశ్
-
గుంటూరులో రైతు దీక్ష పోస్టర్ విడుదల
-
రైతు దీక్ష పోస్టర్ విడుదల
మే 1, 2 తేదీల్లో వైఎస్ జగన్ రైతు దీక్ష సాక్షి, అమరావతి బ్యూరో: మద్దతు ధరలు, గిట్టుబాటు ధరలపై చంద్రబాబు ప్రభు త్వ నిర్లక్ష్యానికి , రుణమాఫీలో మోసానికి నిరసనగా మే 1, 2 తేదీల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతు దీక్ష చేపడుతున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ తెలిపారు. ఆయన శుక్రవారం గుంటూరులోని పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే మొహమ్మద్ ముస్తఫా, పార్టీ నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి తదితరులతో కలసి ‘రైతు దీక్ష’ పోస్టర్ విడుదల చేశారు. రైతుల పక్షాన పోరాడేందుకే దీక్ష చేస్తున్నామని ఈ సందర్భంగా మర్రి రాజశేఖర్ వివరించారు. -
రైతులకు న్యాయం జరిగే వరకూ పోరాటం ఆగదు
-
రైతు దీక్ష చేపట్టిన ధర్మాన
శ్రీకాకుళం: రైతుల సమస్యలు పట్టించుకోకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నందుకు నిరసనగా వైఎస్సార్సీపీ నేత ధర్మాన ప్రసాదరావు రైతు దీక్ష చేపట్టారు. నేటి (ఆదివారం) ఉదయం శ్రీకాకుళం పట్టణంలో రైతు దీక్షను ప్రారంభించి వారికి మద్ధతు తెలిపారు. రైతులు కన్నీరు పెడుతుంటే రాష్ట్ర సర్కార్ సంబరాలు చేసుకోవడం దారుణమని ధర్మాన విమర్శించారు. రైతులకు న్యాయం జరిగేవరకూ తమ పార్టీ పోరాడుతూనే ఉంటుందని రైతులకు భరోసా ఇచ్చారు. -
మైనింగ్ ఆపకుంటే దీక్షకు దిగుతా
-
మైనింగ్ ఆపకుంటే దీక్షకు దిగుతా: వైఎస్ జగన్
గుంటూరు: రైతుల కడుపుకొట్టి చెరువు మట్టితో టీడీపీ నేతలు వ్యాపారాలు చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సుద్దపల్లిలో రైతుల దీక్షకు మద్దతు తెలిపిన వైఎస్ జగన్ అక్కడే ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ మూడు రోజులుగా చేబ్రోలు మండలం సుద్దపల్లిలో రైతులు దీక్ష చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ నేతల అక్రమ క్వారీలకు వ్యతిరేకిస్తూ దీక్ష చేస్తున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని అన్నారు. ఎమ్మేల్యే నరేంద్ర వ్యాపారానికి చంద్రబాబు మద్దతిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాకింత నీకింత అంటూ కమిషన్లు తీసుకుంటున్నారని చెప్పారు. చెరువులో మైనింగ్ వెంటనే ఆపేయాలని లేదంటే తానే దీక్ష చేస్తానని వైఎస్ జగన్ హెచ్చరించారు. -
రైతులందరికీ న్యాయం జరగాలి
-
ప్రారంభమైన కోదండరామ్ రైతు దీక్ష
హైదరాబాద్: రైతుల సమస్యలపై తెలంగాణ రైతు జేఏసీ చేపట్టిన రైతు దీక్ష ఆదివారం ఉదయం 10 గంటలకు ఇందిరాపార్క్ వద్ద ప్రారంభమైంది. తెలంగాణ ఏర్పాడ్డాక తొలిసారి తెలంగాణ జేఏసీ ఛైర్మన్ కోదండరామ్ రైతు దీక్షకు దిగారు. ఆయనతో పాటు రైతు సంఘాల నాయకులు కూడా దీక్షలో పాల్గొన్నారు. రైతు సమస్యలు పరిష్కరించాలంటూ కోదండరామ్ రైతు దీక్ష చేపట్టారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం రైతు సమస్యలు పట్టించుకోవడం లేదంటూ కోదండరామ్ రైతు దీక్ష చేపట్టారు. -
రేపు ఇందిరాపార్క్ వద్ద రైతు దీక్ష
హైదరాబాద్: నగరంలోని ఇందిరాపార్క్ వద్ద రేపు (ఆదివారం) ఉదయం 10 గంటలకు రైతు దీక్ష చేపట్టనున్నారు. ఈ రైతు దీక్షలో తెలంగాణ జేఏసీ ఛైర్మన్ కోదండరామ్, రైతు సంఘాల నాయకులు తదితరులు పాల్గొననున్నారు. తెలంగాణ ఏర్పాడ్డాక తొలిసారి కోదండరామ్ దీక్షకు దిగుతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం రైతు సమస్యలు పట్టించుకోవడం లేదని కోదండరామ్ దీక్షకు దిగుతున్నట్టు సమాచారం. -
రైతు దీక్ష విజయవంతం: పొంగులేటి
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన రైతు దీక్షను విజయవంతం చేసిన అందరికీ ధన్యవాదాలని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. సోమవారం పార్టీ ప్రధాన కార్యదర్శులు గాదె నిరంజన్ రెడ్డి, కె.శివకుమార్, నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు పెద్ద పటోళ్ల సిద్ధార్థ రెడ్డి తదితరులు బంజారాహిల్స్ రోడ్ 10లోని ఎంపీ కార్యాలయంలో ఆయనను కలిశారు. ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ ఎత్తిన పిడికిలి దించొద్దు.. ఇదే స్ఫూర్తిని నాలుగేళ్ల పాటు కొనసాగించాల్సిందేనని అన్నారు. రైతులకు అండగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. దివంగత మహానేత వైఎస్సార్ పాలనను రెండు రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలు అనుక్షణం స్మరించుకుంటున్నారని తెలిపారు. ఈ విషయా న్ని గుర్తించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండవ విడత రైతు భరోసా యాత్రను అనంతపురం జిల్లాలో కొనసాగిస్తున్నారన్నారు. కష్టా ల్లో ఉన్న అన్ని జిల్లాల్లోని రైతాంగానికి భరోసా కల్పించేందుకు మరిన్ని కార్యక్రమాలు చేపట్టాల్సి ఉందని చెప్పారు. తెలంగాణలో వైఎస్సార్ సీపీ జెండా రెపరెపలాడేందుకు అందరూ కలసికట్టుగా పనిచేయాలని ఆయన పార్టీ వర్గాలకు పిలుపునిచ్చారు. -
10న కామారెడ్డిలో వైఎస్సార్సీపీ రైతు దీక్ష
ఖమ్మం అర్బన్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సారథ్యంలో ఈ నెల 10న నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో రైతు దీక్ష చేపట్టనున్నట్టు పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆకుల మూర్తి తెలిపారు. శుక్రవారం ఖమ్మంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో దీక్షకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. రైతు దీక్షలో పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతు సోదరులు పాల్గొని జయప్రదం చేయాలని మూర్తి పిలుపు నిచ్చారు. ఆకాల వర్షాల వల్ల రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో పంటలు చేతికందే దశలో నేలపాలయ్యాయన్నారు. ఇలాంటి పరిస్థితిలో రైతులకు అండగా ఉండాల్సిన పాలకులు పట్టించుకోక పోవడంతో వారు అప్పుల ఊబిలో చిక్కుకుని ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని చెప్పారు. టీఆర్ఎస్ అధికారంలొకొచ్చిన 11 నెలల్లోనే రాష్ట్రంలో 800 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారంటే పాలకులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి షర్మిలా సంపత్, జిల్లా అధికార ప్రతినిధి మందడపు వెంకటేశ్వరరావు, జిల్లా మహిళా అధ్యక్షురాలు కీసర పద్మజారెడ్డి, నగర మహిళా విభాగం అధ్యక్షురాలు కొత్త గుండ్ల శ్రీలక్ష్మి తదితరులు పాల్గొని మాట్లాడారు. -
రైతుకోసం.. ‘రైతు దీక్ష’ చేపట్టిన నేత వైఎస్ జగన్
చాపాడు: రైతులు, డ్వాక్రా రుణాల మాఫీలో ప్రభుత్వ నిర్లక్ష్యవైఖరిని ఎండగట్టేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండు రోజుల పాటు రైతు దీక్షను చేపట్టారని మైదుకూరు ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి అన్నారు. రైతులు, డ్వాక్రా మహిళల రుణాలతో పాటు ప్రజల సమస్యలపై ప్రభుత్వ తీరును నిరసిస్తూ రైతులకు మద్దతుగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, శాసనసభ ప్రతిపక్షనేత వైఎస్.జగన్మోహన్రెడ్డి పశ్చిమగోదావరి జిల్లాలోని తణుకులో చేపట్టిన ‘రైతు దీక్ష’కు శనివారం సాయంత్రం వైఎస్సార్సీపీ రాష్ట్ర క్రమ శిక్షణా కమిటీ సభ్యుడు, మైదుకూరు ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి తమ అనుచరులతో తరలివెళ్లారు. ఈ సందర్భంగా ప్రొద్దుటూరులోని తన నివాసంలో రఘురామిరెడ్డి మాట్లాడుతూ మోసపూరిత వాగ్ధానాలతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఎనిమిది నెలలుగా ప్రజల సమస్యలను పట్టించుకోవటం లేదన్నారు. వైఎస్ జగన్ దీక్షకు జిల్లా ఎంపీ, ఎమ్మెల్యేలు, నేతల మద్దతు రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను విస్మరించిన నేపథ్యంలో ప్రభుత్వం మెడలు వంచేందుకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన రెండు రోజుల రైతు దీక్షకు జిల్లాకు చెందిన వైఎస్సార్సీపీ ఎంపీ, ఎమ్మెల్యేలతో పాటు పార్టీ నేతలు నాయకులు హాజరై మద్దతు తెలిపారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, రాయచోటి, కమలాపురం, కడప, రైల్వేకోడూరు, బద్వేలు, ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్‌రెడ్డి, పి.రవీంద్రనాథరెడ్డి, అంజద్‌బాషా, కొరముట్ల శ్రీనివాసులు, జయరాములులతో పాటు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి, మాజీ ఎమ్మెల్యే డీసీ గోవిందరెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ ఆవుల విష్ణువర్ధన్‌రెడ్డి, జెడ్పీ మాజీ చైర్మన్ దేవనాథరెడ్డి, యువజన విభాగం రాష్ట్ర నాయకుడు మదన్‌మోహన్‌రెడ్డి, పలువురు జిల్లా, నియోజకవర్గ స్థాయి నాయకులు జగన్ రైతు దీక్షలో పాల్గొని తమ మద్దతు ప్రకటించారు. -
రైతు దీక్షను విమర్శించడం అనైతికం
అనంతపురం అర్బన్: రైతులు, డ్వాక్రా మహిళల పక్షాన తణుకులో వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి చేపట్టిన రైతుదీక్షను విమర్శించేస్థాయి టీడీపీ రౌడీ మూకలకు లేదని వైఎస్సార్కాంగ్రెస్పార్టీ నాయకులు ఫైర్ అయ్యారు. స్థానిక రెండో రోడ్డులోని వైఎస్సార్కాంగ్రెస్పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ క్రమశిక్షణ సంఘం సభ్యులు బి. ఎర్రిస్వామిరెడ్డి, నగర అధ్యక్షులు రంగంపేట గోపాల్‌రెడ్డి మాట్లాడారు. వైఎస్ జగన్‌పై ఉన్న ప్రజాదరణ ఓర్వలేక స్థాయి లేని నాయకులు దీక్షను విమర్శిస్తూ.. ఎక్కడ తమ పార్టీ మనుగడ కోల్పోతోందన్న భయంతో పిచ్చిగా మాట్లాడుతున్నారన్నారు. ప్రజలను మోసం చేసి చంద్రబాబుపై 420 కేసు నమోదు చేయాలన్నారు. దివంగత ముఖ్యమంత్రి పాలన చేపట్టినప్పుడు ప్రజలు ‘రామరాజ్యం చూడలేదు కానీ.. రాజన్న రాజ్యం చూశామ’ని కోట్లాది మంది ప్రజలు అన్నారన్నారు. ఆ మహానేతను విమర్శించే స్థాయి ఈ రౌడీ ముఖలకు ఉందా..? అంటూ ధ్వజమెత్తారు. ఎవరి పాలనలో ఏం అభివృద్ధి జరిగిందో బహిరంగ బ్యాలెట్‌కు సిద్ధమా..? అంటూ సవాల్ విసిరారు. చంద్రబాబుకు ప్రభుత్వంపై ఆరు మాసాలకే ప్రజావ్యతిరేకత వచ్చిందన్నారు. దీనికి నిదర్శనం పశ్చిమగోదావరి జిల్లాలో చేపట్టిన రైతుదీక్షేనన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో దాదాపు అన్ని నియోజకవర్గాలలో టీడీపీ ఎమ్మెల్యేలు గెలుపొందారన్నారు. అక్కడి ప్రజలు వేలాదిగా రైతుకు దీక్షకు తరలివెళ్లడం గమనార్హం. ఎస్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలే జయరాంనాయక్ మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి గిరిజనల సంక్షేమ కోసం గోరంట్ల మండలంలో భూములు పంచితే.. ఇప్పుడు ఆ భూములను వెనక్కిలాక్కుంటున్నారన్నారు. మహిళ విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పి. శ్రీదేవిరెడ్డి మాట్లాడుతూ ‘నారావారి మాటలు.. నీటి మూటలే’ అన్నట్లుగా ఆయన ఇచ్చిన హామీలన్నీ నీటిమూటలాగానే మిగిలిపోయాన్నారు. సమావేశంలో జిల్లా సంయుక్త కార్యదర్శి గౌస్‌మొద్దీన్, నల్లచెరువు సర్పంచ్ ఎం. రవికుమార్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.