రైతు దీక్ష పోస్టర్ విడుదల
మే 1, 2 తేదీల్లో వైఎస్ జగన్ రైతు దీక్ష
సాక్షి, అమరావతి బ్యూరో: మద్దతు ధరలు, గిట్టుబాటు ధరలపై చంద్రబాబు ప్రభు త్వ నిర్లక్ష్యానికి , రుణమాఫీలో మోసానికి నిరసనగా మే 1, 2 తేదీల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రైతు దీక్ష చేపడుతున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ తెలిపారు.
ఆయన శుక్రవారం గుంటూరులోని పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే మొహమ్మద్ ముస్తఫా, పార్టీ నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి తదితరులతో కలసి ‘రైతు దీక్ష’ పోస్టర్ విడుదల చేశారు. రైతుల పక్షాన పోరాడేందుకే దీక్ష చేస్తున్నామని ఈ సందర్భంగా మర్రి రాజశేఖర్ వివరించారు.