టాటాల ఇన్వెస్టర్ మీట్ వాయిదా..
ముంబై: టాటా గ్రూప్ చైర్మన్ గా సైరస్ మిస్త్రీ ఉద్వాసన తరువాత కంపెనీలో రేగిన ప్రకంపనలు టాటాలను భారీగానే తాకుతున్నాయి. ఈ నేపథ్యంలోనే నవంబర్ 18న జరగాల్సిన ఇన్వెస్టర్ల మీట్ ను వాయిదా వేసుకుంది. దేశీయంగా, అంతర్జాతీయంగా 150 మందితో జరగాల్సిన ఈ మీట్ ను గత నెలలో రచ్చకెక్కిన బోర్డు రూం డ్రామా కారణంగా వాయివా వేసినట్టు జాతీయ మీడియా నివేదించింది.
అలాగే టాటా సన్స్ చైర్మన్ గా సైరస్ మిస్త్రీని తొలగించిన అనంతరం, ఇండియన్ హోటల్స్ లో ఆరుగురు ఇండిపెండెంట్ డైరెక్టర్లు మిస్త్రీకి మద్దతు పలకడాన్ని రతన్ టాటా తీవ్రంగా పరిగణిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయమై వారి 'స్వతంత్రత'పై విచారణ జరిపించాలని టాటాలు నిర్ణయించినట్టు సమాచారం. మిస్త్రీని తొలగించాలని తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా , సంస్థ భవిష్యత్తుపై అనుమానాలు పుట్టించేలా ఎందుకు మాట్లాడారన్న విషయమై ప్రశ్నించనునట్టు టాటా ట్రస్ట్స్ సీనియర్ సభ్యుడొకరు తెలిపారు.వారు షాపూర్ జీ పల్లోంజీ గ్రూప్ నుంచి తాము ఏ విధమైన ప్రోత్సాహకాలూ తీసుకోలేదని వారు నిరూపించుకోవాల్సి వుంటుందని టాటా గ్రూపు వర్గాలు స్టాక్ ఎక్స్ఛేంజీ కి వివరించాయి. మిస్త్రీపై వారు పూర్తి నమ్మకాన్ని ఉంచారని, ఈ విషయంలో ఐహెచ్సీఎల్ ఇన్వెస్టర్ల ప్రయోజనాలను కాపాడేందుకు తాము చర్యలు తీసుకోనున్నామని టాటా సన్స్ తెలిపింది.
కాగా మిస్త్రీ ఆకస్మితక తొలగింపు తర్వాత టాటా సన్స్ జీఈసీని రద్దు చేశారు. దీంతో టాప్ లెవల్ అధికారులు రాజన్, నిర్మాల్య కుమారు, మధు కన్నన్ లు రాజీనామా చేశారు. అలాగే తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే కూవలం మిస్త్రీకి సన్నిహితంగా మెలగడం మూలంగానే తనమీద వేటుపడిందని నిర్మాల్య కుమారు తన బ్లాగ్ లో ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.