
ఆ ఛాతీ 56 అంగుళాలు కాదు.. ఇప్పుడు 100
ప్రధాని నరేంద్ర మోదీని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రశంసల్లో ముంచెత్తారు.
భోపాల్: పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లో భారత సైన్యం సర్జికల్ దాడులు జరపడానికి అనుమతిచ్చి పాక్‌కు దీటైన జవాబు చెప్పిన ప్రధాని నరేంద్ర మోదీని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రశంసల్లో ముంచెత్తారు. మోదీ ఛాతీ ఇప్పుడు 56 అంగుళాలు కాదు, 100 అంగుళాలని చౌహాన్ అన్నారు.
భోపాల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో చౌహాన్ మాట్లాడుతూ.. ఉడీ ఉగ్రవాద దాడికి ప్రతిచర్యగా పాక్‌కు గుణపాఠం చెప్పిన భారత సైన్యానికి, ప్రధాని మోదీకి అభినందనలు తెలియజేశారు. మోదీ శక్తిమంతమైన నాయకత్వంలో దేశం అభివృద్ధి దిశగా దూసుకెళ్తోందని అన్నారు. మన వృద‍్ధి రేటు చైనా కంటే ఎక్కువగా ఉందని చెప్పారు.