ఈపీఎఫ్ ఖాతాదారులకు మరో శుభవార్త!
ఈపీఎఫ్ ఖాతాదారులకు మరో శుభవార్త!
Published Wed, Nov 16 2016 11:50 AM | Last Updated on Sat, Jul 6 2019 1:10 PM
ముంబై: కేంద్ర కార్మిఖ శాఖ మరో కీలక ముందడుగు వేసింది. నిర్వహణలో లేని ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) ఖాతాలకు కొత్త నిర్వచనాన్ని అందించిన కార్మికశాఖ తాజాగా అలాంటి ఖాతాలకు వడ్డీ చెల్లింపు ప్రక్రియను ప్రారంభించనున్నట్టు ప్రకటించింది. దీని ద్వారా కోట్లాదిమంది పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త అందించింది. ఈ చెల్లింపులను ఏప్రిల్ 1, 2011 నుంచి వర్తింప చేయనున్నట్టు వెల్లడించింది. గత మూడు సంవత్సరాలుగా లావాదేవీలు జరపని ఈపీఎఫ్ ఖాతాలకు కూడా ఇకముందు వడ్డీ చెల్లించనున్నట్టు స్పష్టం చేసింది. 'పనిచేయని' ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) ఖాతాల్లో ఉన్న నగదు నిల్వలకు కూడా వడ్డీ చెల్లింపును ప్రారంభిస్తున్నట్టుగా నవంబర్ 11 న ఒక నోటిఫికేషన్ జారిచేసింది.
గత 36 నెలలుగా పనిచేయని పీఎఫ్ ఖాతాలను కార్మిక మంత్రిత్వ శాఖ ఆపరేటివ్ ఖాతాలుగా పరిగణించడంతోపాటు వాటికి వడ్డీ చెల్లింపు ప్రక్రియను ప్రారంభించడానికి నిర్ణయించుకుంది. ఈ నోటిఫికేషన్ అందించిన సమాచారం ప్రకారం ఒక ఉద్యోగి రాజీనామా చేసి రెండు నెలలలోపు మరో ఉద్యోగం చేపట్టకపోయినా కొత్త ఉద్యోగాన్ని ఈపీఎఫ్ ఖాతాకు బదిలీ చేయబడుతుంది. లేదా కొత్త ఉద్యోగంలో ఈపీఎఫ్ ఖాతాలో బదిలీచేయడంలో విఫలమైనా కూడా సదరు ఉద్యోగి ఖాతాను యాక్టివ్ ఖాతాగా పరిగణిస్తారు. దీంతోపాటుగా సంవత్సరానికి 8.8శాతం వడ్డీచెల్లించనున్నట్టు నోటిఫికేషన్ స్పష్టం చేసింది. అయితే 55 ఏళ్ల తరువాత ఉద్యోగాన్ని విరమించినా, లేదా శాశ్వతంగా విదేశాలకు వలస వెళ్లినా లేదా 36 నెలలలోపు ఆ ఉద్యోగి ఖాతాను స్వయంగా ఉపసంహరించుకున్నా, లేదా మరణించిన సందర్భంలో మాత్రమే పీఎఫ్ ఖాతా రద్దు అవుతుంది.
కాగా గత రెండు సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా సుమారు 42, 000 కోట్ల నిధులు సంస్థలో ఉన్నట్టు సమాచారం. ఈ కీలక నిర్ణయం కారణంగా దాదాపు 9.70కోట్ల పీఎఫ్ ఖాతాదారులకు లబ్ది చేకూరనుంది.దీంతో కార్మికుల సంక్షేమం కోసం నిర్వహణలో లేని ఖాతాలకు ఇకముందు యాక్టివ్ ఖాతాలుగా పరిగణించనున్నట్టు కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ వెల్లడించిన సంగతి తెలిసిందే.
Advertisement
Advertisement