రీటైల్ వ్యాపారులకు షాక్
ముంబై: ద్రవ్యోల్బణానికి చెక్ పెట్టే చర్యల్లో భాగం కేంద్రం ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. అనూహ్యంగా పెరుగుతున్న పప్పుధాన్యాలు, చక్కెర లాంటి నిత్యావసర వస్తువుల రిటైల్ ధరలకు కళ్లెం వేసేందుకు నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం మార్కెట్ శక్తుల ద్వారా నిర్ణయించబడుతున్ రేట్ల సంప్రదాయానికి, అదును చూసి అడ్డగోలుగా ధరలు పెంచేసే రీటైల్ వ్యాపారుల ఆగడాలకు చెక్ పెట్టనుంది. ఇప్పటికే ముఖ్యమైన వస్తువు రిటైల్ ధరను నిర్ణయించే లీగల్ కొలతల (ప్యాకేజ్డ్ కమోడిటీస్) నిబంధనల 2011 చట్ట సవరణలకు నోటిఫై చేసినట్టు సీనియర్ వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు పీటీఐకి చెప్పారు.
అసాధారణ పరిస్థితుల్లో మితిమీరిన స్థాయిలో పెరుగుతూ, నింగిని తాకే ధరలను కట్టడి చేసేందుకు మెట్రాలజీ నియమాలను సవరించనుంది. నిత్యావసరాల వస్తువుల రీటైల్ ధరలను నిర్ణయించే అధికారం ఎసెన్షియల్ కమోడిటీ చట్టం1955 నిబంధల ప్రకారం ..సంబంధిత అధికారి నిర్ణయం తీసుకుంటారని నోటిషికేషన్ తెలిపింది. రీటైల్ మార్కెట్లలో విడిగా, లేదా ప్యాకేజ్ లలో విక్రయించే అన్ని వస్తువులకు ఇది వర్తిస్తుందని పేర్కొంది. అయితే రోజువారీ ధరలను కూడా ప్రభుత్వమే నిర్ణయిస్తుందాఅని ప్రశ్నించినపుడు.. ధరలు అనూహ్యంగా పెరిగినపుడు, అసాధారణ పరిస్థితులలో మాత్రమేనని ఆయన చెప్పారు. .ప్రస్తుతం, టోకు మరియు దిగుమతిదారులను నియంత్రించడానికి చర్యలు ఉన్నాయి కానీ, రీటైల్ వ్యాపారులకు లేవని వ్యాఖ్యానించారు. వినియోగదారుల సంక్షేమం కోసం ఈ నిబంధన ద్వారా ఈ క్రియా శీలక చర్యలను తీసుకునేలా ప్రభుత్వం సహాయం చేస్తుందని అధికారి తెలిపారు.
కాగా కరువు పరిస్థితుల కారణంగా స్థానిక ఉత్పాదనలో తగ్గుదలతో జూన్ 2016 లో రిటైల్ మార్కెట్లలో పప్పుల ధర కిలో దాదాపు రూ.200 చేరాయి. ఈ నేపథ్యంలో కేంద్రం ప్రభుత్వం దిగుమతులు, పప్పు ధాన్యాల నిల్వల పెంపు తదితర చర్యల ద్వారా దేశీయ సరఫరాను మెరుగు పరచడానికి, పప్పు ధరల నియంత్రణకు కృషి చేస్తోంది.