భారత్లో ఎల్జీ ఫోన్ ధర ఎంతంటే...
భారత్లో ఎల్జీ ఫోన్ ధర ఎంతంటే...
Published Tue, Nov 1 2016 2:29 PM | Last Updated on Mon, Sep 4 2017 6:53 PM
అంతర్జాతీయంగా విడుదలైన గూగుల్ కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ నోగట్ తొలి స్మార్ట్ఫోన్ ఎల్జీ వీ20, భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. రూ.49,990 ధరతో భారత విపణిలోకి ఈ నెల ఆఖరున ప్రవేశపెట్టాలని కంపెనీ నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ వీ20 ఫోన్ను గ్లోబల్గా లాంచ్ చేసే సందర్భంలోనే, దీన్ని నెలలోపల భారత మార్కెట్లోకి తీసుకొస్తామని ఎల్జీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ కిమ్ కి-వాన్ ప్రకటించారు. 5.7 అంగుళాల క్యూహెచ్డీ ఐపీఎస్ డిస్ప్లేతో ఎల్జీ వీ20ను కంపెనీ ఆవిష్కరించింది. హై-ఫై క్వాడ్ డీఏసీ, హెచ్డీ ఆడియో రికార్డర్, ఫ్రంట్, రియర్ వైడ్-యాంగిల్ లెన్స్ కెమెరా వంటి మల్టీమీడియా ఫీచర్లతో ఈ స్మార్ట్ఫోన్ కంపెనీ రూపొందించింది.
16 మెగాపిక్సెల్ స్టాండర్డ్, 8 మెగాపిక్సెల్ వైడ్-యాంగిల్ డ్యుయల్ వెనుక కెమెరాలు కలిగిన ఈ ఫోన్, ఫ్రంట్ వైపు 5 మెగాపిక్సెల్ కెమెరాను కలిగిఉంది. డ్యూయల్ డిస్ప్లే సిస్టమ్తో ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. రెండో డిస్ప్లే ఫోన్కి టాప్లో ఉంటుంది. మొదటి దానికంటే ఈ రెండో డిస్ప్లే ఎక్కువ ప్రకాశవంతంగా, పెద్ద ఫాంట్తో ఉండనుంది. దీని వల్ల నోటిఫికేషన్ బార్ నుంచే పెద్ద మెసేజ్‌లకు త్వరగా రిప్లై ఇవ్వొచ్చు. క్వాల్ కామ్ స్నాప్డ్రాగన్ 820 ప్రాసెసర్, 4జీబీ ర్యామ్, 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రో ఎస్డీ కార్డు ద్వారా 2 టీబీ వరకు విస్తరణ మెమెరీ వంటివి ఈ ఫోన్ ఇతర ఫీచర్లు. భారత మార్కెట్లో ఇటీవల లాంచ్ అయిన ఆపిల్ లేటెస్ట్ ఐఫోన్7, ఐఫోన్7 ప్లస్, గూగుల్ పిక్సెల్, పిక్సెల్ ఎక్స్ఎల్ స్మార్ట్ఫోన్ల కంటే ఈ ఫోన్ రేటే తక్కువగా ఉండాలని కంపెనీ నిర్ణయించినట్టు రిపోర్టులు చెబుతున్నాయి.
Advertisement
Advertisement