SpiceJet Hikes Salaries For Captains To Rs 7 Lakh Per Month, Details Inside - Sakshi
Sakshi News home page

SpiceJet:దీపావళి కానుక: వారికి నెలకు రూ.7 లక్షల జీతం

Published Wed, Oct 19 2022 1:00 PM | Last Updated on Wed, Oct 19 2022 5:01 PM

SpiceJet hikes salaries for captains to Rs 7 lakh per month - Sakshi

సాక్షి, ముంబై:  విమానయాన సంస్థ స్పైస్‌జెట్ తన పైలట్లకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. నవంబరు 1 నుంచి వర్తించేలా జీతాలపెంపును ప్రకటించింది. తద్వారా స్పైస్‌జెట్  వారికిదీపావళి కానుక అందించింది.  స్పైస్‌జెట్   కెప్టెన్లకు 80 గంటల విమాన ప్రయాణానికి నెలవారీ వేతనం 7 లక్షల రూపాయలకు పెంచుతున్నట్లు తెలిపింది. ఈపెంపు నవంబర్ 1, 2022 నుండి వర్తిస్తుందని  తెలిపింది.

ట్రైనర్స్‌, సీనియర్‌ ఫస్ట్‌ ఆఫీసర్‌ల వేతనాలను కూడా తగిన విధంగా పెంచినట్లు స్పైస్‌జెట్ పేర్కొంది. నెలవారీ ప్రాతిపదికన పైలట్ వేతనాలను సవరించినట్టు  తెలిపింది. అక్టోబర్‌లో కెప్టెన్లు , ఫస్ట్ ఆఫీసర్ల జీతం 22 శాతం పెంచింది.   ఆగస్టుతో పోలిస్తే, సెప్టెంబర్ జీతంలో శిక్షకులకు 10 శాతం, కెప్టెన్‌లు, ఫస్ట్ ఆఫీసర్ల వేతనం 8 శాతం వరకు పెంచిన సంగతి తెలిసిందే.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement