
న్యూఢిల్లీ: దేశీ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ).. నవంబర్‌లో వాహనాల ఉత్పత్తిని పెంచింది. గత నెలలో మొత్తం వాహనాల ఉత్పత్తి 1,41,834 యూనిట్లుగా నమోదైనట్లు స్టాక్ ఎక్సే్ఛంజీలకు ఇచ్చిన సమాచారంలో పేర్కొంది. అంతక్రితం ఏడాది నవంబర్‌లోని 1,35,946 యూనిట్లతో పోల్చితే ఈసారి ఉత్పత్తి 4.33 శాతం మేర పెరిగినట్లు వెల్లడించింది.
ప్రయాణికుల వాహనాల ఉత్పత్తి గతనెల్లో 1,39,084 యూనిట్లు కాగా, అంతకుముందు ఏడాది ఇదే కాలంలోని 1,34,149 యూనిట్లతో పోల్చితే 3.67 శాతం వృద్ధి ఉందని కంపెనీ వివరించింది. అక్టోబర్ నెల కార్ల ఉత్పత్తిలో 20.7 శాతం కోతను విధించి 1,19,337 యూనిట్లకే పరిమితం చేసిన సంస్థ.. గతనెల్లో పెంపును ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment