పెళ్లి తేదీని స్వయంగా ప్రకటించిన సల్మాన్! | Salman Khan wants to get married on November 18 | Sakshi
Sakshi News home page

పెళ్లి తేదీని స్వయంగా ప్రకటించిన సల్మాన్!

Published Mon, Jul 18 2016 2:46 PM | Last Updated on Sat, Jul 6 2019 1:10 PM

పెళ్లి తేదీని స్వయంగా ప్రకటించిన సల్మాన్! - Sakshi

పెళ్లి తేదీని స్వయంగా ప్రకటించిన సల్మాన్!

ఔను! బాలీవుడ్ మోస్ట్ ముదురు బ్యాచిలర్ సల్మాన్ ఖాన్ స్వయంగా తన పెళ్లి తేదీని ప్రకటించాడు. నవంబర్ 18న పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. అయినా.. ఆయన మహిళా అభిమానులు.. అయ్యో సల్మాన్ పెళ్లి చేసుకుంటున్నాడని బాధపడక్కర్లేదు. ఎందుకంటే నవంబర్ 18న పెళ్లి చేసుకుంటానని సల్మాన్ ప్రకటించాడు.. అది ఏ సంవత్సరంలో అన్నది మాత్రంలో చెప్పలేదు. ముంబైలో భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా ఆత్మకథ 'ఏస్ అగైనెస్ట్ ఆడ్స్' పుస్తకావిష్కరణ సందర్భంగా ఈ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.

తన పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ప్రధాన అతిథిగా వచ్చిన సల్మాన్ ఖాన్ ను స్వయంగా సానియానే 'మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు' అని ప్రశ్నించింది. ఈ ప్రశ్న ఎంతో కీలకమైనది కావడం వల్ల సమాధానం చెప్పాలని కోరింది. ఈ ఊహించని ప్రశ్నతో కాస్త ఇబ్బంది పడ్డ సల్మాన్ కొంత ఆలోచించుకొని.. నవంబర్ 18న అని చెప్పాడు. తన తండ్రి సలీం ఖాన్, తల్లి సల్మా నవంబర్ 18న పెళ్లి చేసుకున్నారు. కాబట్టి అదే తేదీన పెళ్లి చేసుకోవాలని తాను భావిస్తున్నట్టు చెప్పాడు. అయితే, ఇలాంటి నవంబర్ లో 20-25 వచ్చిపోయాయని, నవంబర్ 18న పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నప్పటికీ, అది ఏ సంవత్సరంలోనో తెలియదని సల్మాన్ భాయ్ చెప్పాడు.

మీరు పెళ్లి చేసుకోకపోవడంపై  మహిళలెవరూ మిమ్మల్ని అడగటం లేదా? అని సానియా అడుగగా.. హా.. కొందరు అడుగుతున్నారు.. మీకు తెలియదు ఎంతో ఒత్తిడి చేస్తున్నారు? సల్మాన్ బదులిచ్చాడు. ఆ మహిళలు ఎవరు అని అడుగగా.. మా అమ్మ, చెల్లెళ్లు.. వారు నేను పెళ్లిచేసుకోవాలని భావిస్తున్నారంటూ తెలిపాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement