Ace Against Odds
-
సానియా ‘ఆత్మకథ’ తెలుగులో...
సాక్షి, హైదరాబాద్: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఆటోబయోగ్రఫీ ‘ఏస్ అగైనెస్ట్ ఆడ్స్’ తెలుగు అనువాదం ‘టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా’ పేరుతో విడుదలైంది. ‘సాక్షి’ క్రీడా ప్రతినిధి మొహమ్మద్ అబ్దుల్ హాది దీనిని తెలుగులోకి తర్జుమా చేశారు. బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో సానియా ఈ పుస్తకాన్ని ఆవిష్కరించింది. తన కెరీర్ విశేషాలతో కూడిన ఈ పుస్తకం రెండు రాష్ట్రాల్లోని తెలుగు పాఠకులు ఎక్కువ మందికి చేరాలని ఆశిస్తున్నట్లు ఈ సందర్భంగా సానియా మీర్జా చెప్పింది. -
పెళ్లి తేదీని స్వయంగా ప్రకటించిన సల్మాన్!
ఔను! బాలీవుడ్ మోస్ట్ ముదురు బ్యాచిలర్ సల్మాన్ ఖాన్ స్వయంగా తన పెళ్లి తేదీని ప్రకటించాడు. నవంబర్ 18న పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. అయినా.. ఆయన మహిళా అభిమానులు.. అయ్యో సల్మాన్ పెళ్లి చేసుకుంటున్నాడని బాధపడక్కర్లేదు. ఎందుకంటే నవంబర్ 18న పెళ్లి చేసుకుంటానని సల్మాన్ ప్రకటించాడు.. అది ఏ సంవత్సరంలో అన్నది మాత్రంలో చెప్పలేదు. ముంబైలో భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా ఆత్మకథ 'ఏస్ అగైనెస్ట్ ఆడ్స్' పుస్తకావిష్కరణ సందర్భంగా ఈ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. తన పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ప్రధాన అతిథిగా వచ్చిన సల్మాన్ ఖాన్ ను స్వయంగా సానియానే 'మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు' అని ప్రశ్నించింది. ఈ ప్రశ్న ఎంతో కీలకమైనది కావడం వల్ల సమాధానం చెప్పాలని కోరింది. ఈ ఊహించని ప్రశ్నతో కాస్త ఇబ్బంది పడ్డ సల్మాన్ కొంత ఆలోచించుకొని.. నవంబర్ 18న అని చెప్పాడు. తన తండ్రి సలీం ఖాన్, తల్లి సల్మా నవంబర్ 18న పెళ్లి చేసుకున్నారు. కాబట్టి అదే తేదీన పెళ్లి చేసుకోవాలని తాను భావిస్తున్నట్టు చెప్పాడు. అయితే, ఇలాంటి నవంబర్ లో 20-25 వచ్చిపోయాయని, నవంబర్ 18న పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నప్పటికీ, అది ఏ సంవత్సరంలోనో తెలియదని సల్మాన్ భాయ్ చెప్పాడు. మీరు పెళ్లి చేసుకోకపోవడంపై మహిళలెవరూ మిమ్మల్ని అడగటం లేదా? అని సానియా అడుగగా.. హా.. కొందరు అడుగుతున్నారు.. మీకు తెలియదు ఎంతో ఒత్తిడి చేస్తున్నారు? సల్మాన్ బదులిచ్చాడు. ఆ మహిళలు ఎవరు అని అడుగగా.. మా అమ్మ, చెల్లెళ్లు.. వారు నేను పెళ్లిచేసుకోవాలని భావిస్తున్నారంటూ తెలిపాడు. -
'స్టెఫీగ్రాఫ్ బయోగ్రఫీ చదవాలని ఉంది'
ముంబై: రియో ఒలింపిక్స్‌లో మిక్స్డ్ డబుల్స్ విభాగంలో తమకు పతకావకాశాలు ఉన్నాయని భారత టాప్ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా వ్యాఖ్యానించింది. ఈ ఈవెంట్లో తీవ్రమైన పోటీ ఉందని, అయితే తాను, బోపన్న మంచి సమన్వయంతో ఆడతామని ఆమె విశ్వాసం వ్యక్తం చేసింది. ‘ఒలింపిక్స్ మిక్స్డ్ డబుల్స్‌లోనూ ఆయా దేశాలకు చెందిన అగ్రశ్రేణి ఆటగాళ్లు జోడీగా బరిలోకి దిగుతున్నారు కాబట్టి పోటీ ఎక్కువగా కనిపిస్తోంది. క్రీడల్లో విజయానికి హామీ ఇవ్వలేం. అయితే వంద శాతం గెలుపు కోసం ప్రయత్నించగలం. కాబట్టి మాకు ఇదో సవాల్. అయితే సింగిల్స్, డబుల్స్ విభాగాలతో పోలిస్తే ఇందులో పతకంపై ఆశలు పెట్టుకోవచ్చు’ అని సానియా అభిప్రాయ పడింది. గత కొన్నేళ్లలో క్రీడల్లో సత్తా చాటుతున్న భారత మహిళల సంఖ్య పెరగడం మంచి పరిణామమని ఆమె పేర్కొంది. తాను ఇప్పటికే అగస్సీ, టైసన్‌ల జీవిత చరిత్రలు చదివానన్న సానియా... స్టెఫీగ్రాఫ్ ఆటోబయోగ్రఫీ చదవాలని ఆసక్తిగా ఉన్నట్లు వెల్లడించింది. తన కథను సినిమా రూపంలోకి తీసుకు వస్తే దీపికా పడుకోన్ లేదా పరిణీతి చోప్రాలలో ఒకరు నటిస్తే బాగుంటుందని ఆమె వ్యాఖ్యానించింది. ఆమె చాలా సాధించింది : సల్మాన్ సానియా ఆటోబయోగ్రఫీ ‘ఏస్ అగెనైస్ట్ ఆడ్స్’ను ఇక్కడ జరిగిన కార్యక్రమంలో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఆవిష్కరించాడు. ‘కొంత మంది మూడు జన్మలెత్తినా సాధించలేనిది సానియా 29 ఏళ్లలోనే ఎన్నో ఘనతలు తన పేర లిఖించింది. ఈ వయసులోనే పుస్తకం రాయడం కూడా చెప్పుకోదగ్గ విశేషమే. ఆమె చెప్పదల్చుకున్న చాలా అంశాలను ఎప్పుడో ఏళ్లు గడిచాక కాకుండా ఇప్పుడే చెప్పేయడం కూడా మంచి ఆలోచన’ అని సల్మాన్ ప్రశంసించాడు. -
పెళ్లి తేదీని ప్రకటించిన సల్మాన్!
-
ఫెడరర్ అందుకే స్పెషల్ : సానియా
న్యూఢిల్లీ: టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ సాటి క్రీడాకారులతో ప్రేమగా మెలుగుతారని భారత స్టార్ క్రీడాకారిణి సానియా మీర్జా తెలిపారు. ఫెడరర్‌తో తనకున్న అనుబంధాన్ని సానియా తన ఆత్మకథ ‘ఏస్ ఎగెనైస్ట్ ఆడ్స్’లో ప్రస్తావించింది. ‘ నేను అనవసర వివాదాల్లో చిక్కుకున్నప్పుడు ఫెడరర్ నా యోగక్షేమాల గురించి తెలుసుకున్నాడు. 2008లో జెండాను అవమానపరిచానంటూ నమోదైన కేసులో కూడా రోజర్ నాకు అండగా నిలిచాడు. ముంబైలో ఉగ్రదాడులు జరిగినపుడు మా పరిస్థితి గురించి ఆందోళన చెందాడు. ఆ సమయంలో ధైర్యం చెప్పాడు. సాటి ఆటగాళ్లతో ఆయన వ్యవహరించే తీరే ఫెడరర్‌ను స్పెషల్‌గా నిలిపింది’ అని సానియా తెలిపింది. దిగ్గజ ఆటగాడైన ఫెడరర్ తన పేరు ప్రఖ్యాతలకు దూరంగా ఉంటూ చాలా హుందాగా వ్యవహిరించడమే అతని నిరాడంబరతకు నిదర్శమని ఆమె పేర్కొంది. -
సానియా ఆత్మకథను ఆవిష్కరించిన షారూఖ్
హైదరాబాద్: కొద్దికాలంగా అభిమానులు ఎదురు చూసిన రోజు రానేవచ్చింది. టెన్నిస్ స్టార్ సానియా మిర్జా ఆత్మకథ 'ఏస్ అగెనెస్ట్ ఆడ్స్' విడుదలైంది. బుధవారం హైదరాబాద్ లోని ఫలక్ నుమా ప్యాలెస్ లో జరిగిన కార్యక్రమంలో బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్.. సానియా ఆత్మకథ పుస్తకాన్ని ఆవిష్కరించారు. (16 ఏళ్లకే ఆమెకు స్టార్ డమ్ ఎలా వచ్చింది?) చిన్నవయసులోనే ఆత్మకథ పూర్తిచేయగలిగినంత అనుభవాన్ని సానియా సంపాదించుకుందని షారూఖ్ సరదాగా అన్నారు. తన పుస్తకాన్ని ఆవిష్కరించేందుకు హైదరాబాద్ వచ్చిన బాద్ షాకు సానియా కృతజ్ఞతలు తెలిపారు. ప్రముఖ సంస్థ హూపర్ కొలిన్స్ పబ్లికేషన్ లో వచ్చిన 'ఏస్ అగెనెస్ట్ ఆడ్స్' బుధవారం నుంచి పుస్తకాల షాపుల్లో లభించనుంది. -
16 ఏళ్లకే ఆమెకు స్టార్ డమ్ ఎలా వచ్చింది?
హైదరాబాద్/న్యూఢిల్లీ: పట్టుమని పదహారేళ్లైనా నిండకముందే టెన్నిస్ ప్లేయర్ గా స్టార్ డమ్ సంపాదించుకుంది సానియా మిర్జా. ఏ రేంజ్ లో కష్టపడితే అంత చిన్నవయసులోనే అంత పేరు సాధించిందామె? ఆ దిశగా ఇన్ స్పైర్ చేసింది ఎవరు? అన్నింటికన్నా మించి, స్టార్ గా ఎదిగిన తర్వాత కెరీర్ ను నిలబెట్టుకోగలగడం, పాకిస్థానీతో పెళ్లి విషయంలో దేశవ్యాప్తంగా విమర్శలు ఎదురైనా తట్టుకొని నిలబడగలిగే మెంటల్ బ్యాలెన్స్ ఎలా సాధించింది? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ జులైలో సమాధానాలు తెలియనున్నాయి. సానియా మిర్జా బయోగ్రఫీ 'ఏస్ ఎగనెస్ట్ ఆడ్స్' ను జులైలో విడుదల చేయనున్నట్లు ప్రపంచ ప్రఖ్యాత పబ్లిషర్స్ హార్పర్ కొలిన్స్ బుధవారం వెల్లడించింది. 'దాదాపు గుర్తెరిగినప్పటి నుంచి చేతిలో టెన్నిస్ రాకెట్ మాత్రమే పట్టుకున్న సానియా దాన్ని పక్కన పెట్టి మొదటిసారి పెన్ పట్టుకుని, తండ్రి ఇమ్రాన్ మిర్జా సహకారంతో ఆత్మకథ రాశారు. చిన్నప్పటి నుంచి తాను ఎదుర్కొన్న అడ్డంకులు, వాటిని అధిగమించిన తీరు, సాధించిన విజయాల వెనుక రహస్యాలు.. అన్నీ పుస్తకంలో రాసినట్లు, భవిష్యత్ లో క్రీడాకారులుగా ఎదగాలనుకునేవారికి ఇన్ స్పిరేషనల్ బుక్ గా రూపొందించినట్లు సానియా చెప్పారు. ఇండియా నంబర్ వన్ మాత్రమేకాదు.. వరల్డ్ నంబర్ వన్ టెన్నిస్ ప్లేయర్ సానియా ఆటోబయోగ్రఫీని పబ్లిష్ చేసే అవకాశాన్ని గర్వంగా భావిస్తున్నమని, జులై నుంచి అన్ని పుస్తక దుకాణాల్లో 'ఏస్ అగెనెస్ట్ ఆడ్స్' అందుబాటులో ఉంచుతామని హూపర్ కొలిన్స్ (ఇండియా) చీఫ్ ఎడిటర్ కార్తిక అన్నారు. ఈ పుస్తకం ఆధారంగా సానియా జీవితంపై ఓ సినిమా కూడా రూపొందించాలని బాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే పలు ఊహాగానాలు ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే.