ఫెడరర్ అందుకే స్పెషల్ : సానియా | When Roger Federer's gesture touched Sania Mirza's heart | Sakshi
Sakshi News home page

ఫెడరర్ అందుకే స్పెషల్ : సానియా

Published Sun, Jul 17 2016 3:10 PM | Last Updated on Mon, Sep 4 2017 5:07 AM

ఫెడరర్ అందుకే స్పెషల్ : సానియా

ఫెడరర్ అందుకే స్పెషల్ : సానియా

న్యూఢిల్లీ: టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ సాటి క్రీడాకారులతో ప్రేమగా మెలుగుతారని భారత స్టార్ క్రీడాకారిణి సానియా మీర్జా తెలిపారు. ఫెడరర్‌తో తనకున్న అనుబంధాన్ని సానియా తన ఆత్మకథ ‘ఏస్ ఎగెనైస్ట్ ఆడ్స్’లో ప్రస్తావించింది. ‘ నేను అనవసర వివాదాల్లో చిక్కుకున్నప్పుడు ఫెడరర్ నా యోగక్షేమాల గురించి తెలుసుకున్నాడు.

 

2008లో జెండాను అవమానపరిచానంటూ నమోదైన కేసులో కూడా రోజర్ నాకు అండగా నిలిచాడు. ముంబైలో ఉగ్రదాడులు జరిగినపుడు మా పరిస్థితి గురించి ఆందోళన చెందాడు. ఆ సమయంలో ధైర్యం చెప్పాడు. సాటి ఆటగాళ్లతో ఆయన వ్యవహరించే తీరే ఫెడరర్‌ను స్పెషల్‌గా నిలిపింది’ అని సానియా తెలిపింది. దిగ్గజ ఆటగాడైన ఫెడరర్ తన పేరు ప్రఖ్యాతలకు దూరంగా ఉంటూ చాలా హుందాగా వ్యవహిరించడమే అతని నిరాడంబరతకు నిదర్శమని ఆమె పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement