నా ఆటోబయోగ్రఫీ నేను రాసుకోలేను: సల్మాన్
నా ఆటోబయోగ్రఫీ నేను రాసుకోలేను: సల్మాన్
Published Tue, Apr 11 2017 9:18 AM | Last Updated on Tue, Sep 5 2017 8:32 AM
బాలీవుడ్ సూపర్ స్టార్, కండల వీరుడు సల్మాన్ ఖాన్ గురించి ఎవరికి తెలుసుకోవాలని ఉండదు చెప్పండి. సల్మాన్ ఖాన్ కూడా తన ఆత్మకథ రాస్తే బాగుండు. తన కలర్ ఫుల్ లైఫ్ గురించి మరింత తెలుసుకోవచ్చని ప్రతి ఒక్కరి మనసులో మెదలాడుతూ ఉంటుంది. కానీ సల్మాన్ ఖాన్ మాత్రం తన ఆటోబయోగ్రఫీ రాసుకోవడానికి తను సాహసించలేనని చెప్పేశారు. తాజ్ ల్యాండ్స్ లో జరిగిన ఆశా పరేఖ్ ఆటో బయోగ్రఫీ'' ది హిట్ గర్ల్'' పుస్తకావిష్కరణ సందర్భంగా ఈ విషయాన్ని తెలిపారు. ''నేను ఇక్కడ నిల్చుని మాట్లాడే అర్హత కలిగిఉన్నానని తాను భావించడం లేదు. కానీ నాకు చాలా సంతోషంగా ఉంది. ఆశా ఆంటీ మా కుటుంబానికి చాలా ప్రియమైన వారు. ఆటోబయోగ్రఫీ రాయడం, జీవిత చరిత్రను ఆవిష్కరించడం నిజంగా చాలా సంక్లిష్టమైన అంశం. అలాంటి దాన్ని నేను రాయలేనేమో'' అని సల్మాన్ చెప్పారు.
ఎందుకో ధరమ్ జీ(ధర్మేంద్ర)కి అర్థమయ్యే ఉంటుందని అన్నారు. అప్పట్లో ప్రొఫిషినల్ గా పోటీ ఎలా ఉండేదో వివరించారు. ఆశా ఆంటీ, సైరా ఆంటీ, హెలెన్ ఆంటీలు స్నేహానికి ప్రతిరూపమని అభివర్ణించిన సల్మాన్, ప్రస్తుత తరం వారు వారిని చూసి నేర్చుకోవాల్సింది ఎంతో ఉందన్నారు. వారు ఎంతో గొప్పజీవితాన్ని లీడ్ చేశారని, ప్రస్తుత తరం వారు దాన్ని మిస్ అవుతున్నారని పేర్కొన్నారు. సల్మాన్ తనపై చూపిన అభిమానానికి కృతజ్ఞతలు తెలిపిన ఆశా, సినిమా రంగంలో తనకు సహకరించిన వారందరికీ, అభిమానులకు ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్పారు. సలీమ్ ఖాన్, ధర్మేంద్ర, జితేంద్ర, వాహీదా రెహ్మన్, హెలెన్, అర్పితా ఖాన్, ఇమ్రాన్ ఖాన్ వంటి పలువురు ప్రముఖులు ఈ బుక్ ఓపెనింగ్ ఫంక్షన్ కు హాజరయ్యారు.
Advertisement
Advertisement