
ఆత్మకథ రాసే ఆలోచన లేదు: సల్మాన్
న్యూఢిల్లీ : తన జీవిత చరిత్రను రాసుకునే ఆలోచనేదీ లేదని బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఆదివారం స్పష్టం చేశారు. తన కథను తనతోపాటు సమాధి చేస్తానన్నారు. సానియా మీర్జా ఆత్మకథ ‘ఏస్ అగేనెస్ట్ ఆడ్స్’ విడుదల సందర్భంగా.. ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సల్మాన్ పాల్గొన్నారు. ‘ఆత్మకథ రాయటం మొదలుపెడితే.. పాత గాయాలన్నీ మళ్లీ గుర్తొస్తాయి’ అని అన్నారు.