తెలంగాణ కేబినెట్ సమావేశం సోమవారం జరగనుంది.
హైదరాబాద్: తెలంగాణ కేబినెట్ సమావేశం సోమవారం జరగనుంది. రేపు మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయంలో మంత్రివర్గం సమావేశం కానుంది.
ప్రధాని నరేంద్ర మోదీ పెద్ద నోట్లను రద్దు చేసిన నేపథ్యంలో తాజా పరిమాణాలపై కేబినెట్‌లో చర్చించనున్నారు. ప్రజలు కరెన్సీ కోసం పడుతున్న ఇబ్బందులను తొలగించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చిస్తారు. శనివారం హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీతో తెలంగాణ సీఎం కేసీఆర్ శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కలిసిన సంగతి తెలిసిందే. పెద్ద నోట్ల రద్దు వల్ల తెలంగాణ, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను కేసీఆర్ ప్రధానితో చర్చించినట్టు సమాచారం.