
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కేబినెట్ ఈనెల 30వ తేదీన భేటీ కానుంది. మంత్రి వర్గ సమావేశం సందర్భంగా తెలంగాణలో రైతులకు రైతు భరోసా, రేషన్ కార్డుల విధి విధానాలపై చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
వివరాల ప్రకారం.. ‘ఈనెల 30న తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరుగనుంది. ఈ సందర్భంగా రైతు భరోసా, రేషన్‌కార్డుల విధివిధానాలపై కేబినెట్ చర్చించే అవకాశం ఉంది. ఇదే సమయంలో భూమిలేని పేదలకు నగదు బదిలీపై కేబినెట్‌లో చర్చించే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తోంది.

Comments
Please login to add a commentAdd a comment