చంద్రబింబం: జూలై 6 నుండి 12 వరకు | Funday Book: Astrology of the week, July 6 to july 12 | Sakshi
Sakshi News home page

చంద్రబింబం: జూలై 6 నుండి 12 వరకు

Published Sun, Jul 6 2014 2:12 AM | Last Updated on Sat, Sep 2 2017 9:51 AM

Funday Book: Astrology of the week, July 6 to july 12

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.)
 ఆర్థిక లావాదేవీలు ఊహించిన విధంగానే ఉంటాయి. కొద్దిపాటి ఆరోగ్యసమస్యలు ఎదురుకావచ్చు. ఒక ప్రకటన నిరుద్యోగులకు ఊరటనిస్తుంది. వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు. ఉద్యోగులు సమర్థతను చాటుకుంటారు. రాజకీయవర్గాలకు పదవులు. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనుకోని ప్రయాణాలు.
 
 వృషభం (కృత్తిక 2,3,4పా, రోిహ ణి, మృగశిర 1,2పా.)
 నేర్పుతో కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి చేకూరుతుంది. విద్యార్థులు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. వ్యాపార లావాదేవీలు ఊపందుకుంటాయి. ఉద్యోగులకు ఉన్నతస్థాయి నుంచి ప్రశంసలు. పారిశ్రామికరంగం వారు వ్యవహారాలలో విజయంసాధిస్తారు. వారం ప్రారంభంలో ప్రయాణాలలో మార్పులు. అనారోగ్యం. ఆలయాలు సందర్శిస్తారు.
 
 మిథునం (మృగశిర 3,4పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.)
 ఆర్థిక ఇబ్బందులు తొలగే సమయం. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆరోగ్యంపై కాస్త శ్రద్ధ చూపండి. బంధువర్గంతో నెలకొన్న వివాదాలు తొలగుతాయి. భూములు, వాహనాలు కొనుగోలులో ప్రతిబంధకాలు తొలగుతాయి. వ్యాపారాల విస్తరణలో ముందుకు సాగుతారు. ఉద్యోగాలలో ప్రోత్సాహం. కళారంగం వారికి విదేశీ పర్యటనలు. వారం మధ్యలో ధనవ్యయం. ప్రయాణాలు.
 
 కర్కాటకం (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
 ఆర్థిక వ్యవహారాలు కొంత మందకొడిగా సాగుతాయి. రావలసిన సొమ్ము ఆలస్యమవుతుంది. ప్రయాణాలలో చివరిక్షణంలో మార్పులు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగస్తులు ఇంక్రిమెంట్లు అందుకుంటారు. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం మధ్యలో ఆస్తి వివాదాలు. అనారోగ్యం. తీర్థయాత్రలు.
 
 సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.)
 అనుకున్న పనులలో జాప్యం. కుటుంబసభ్యులతో అకారణంగా వివాదాలు నెలకొనవచ్చు. ఆర్థిక లావాదేవీలలో నిరుత్సాహం.  ఒక ముఖ్య వ్యక్తి సహాయం అందే అవకాశం. ప్రయాణాలు వాయిదా పడతాయి. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. ఉద్యోగులకు అదనపు పనిభారం. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు రద్దు. వారం మధ్యలో శుభవార్తలు.
 
 కన్య (ఉత్తర 2,3,4పా, హస్త, చిత్త1,2పా.,)
 బంధువుల నుంచి ఆసక్తికరమైన సమాచారం అందుతుంది. ఇతరుల నుంచి రావలసిన సొమ్ము అంది ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. భూములు, వాహనాల కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులలో కొత్త ఆశలు. వ్యాపార లావాదేవీలు లాభిస్తాయి. ఉద్యోగులకు మంచి గుర్తింపు లభిస్తుంది. కళారంగం వారు అవార్డులు అందుకుంటారు. వారం చివరిలో వ్యయప్రయాసలు.
 
 తుల (చిత్త 3,4పా, స్వాతి, విశాఖ1,2,3పా.)
 పనులు విజయవంతంగా సాగుతాయి. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకం. రుణాలు సైతం తీరుస్తారు. నిరుద్యోగుల నిరీక్షణ ఫలిస్తుంది. ఇంటి నిర్మాణయత్నాలలో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు లభించే సమయం. రాజకీయరంగం వారికి ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం చివరిలో దూరప్రయాణాలు. ఆరోగ్యభంగం.
 
 వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ)
 ఆర్థిక విషయాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. కోర్టు కేసులో విజయం చేకూరే అవకాశం.  వాహనయోగం. ఆరోగ్యంపై నిర్లక్ష్యం వద్దు. దూరప్రయాణాలు చేయాల్సివస్తుంది. వ్యాపారాలు క్రమేపీ పుంజుకుంటాయి. ఉద్యోగాలలో చిక్కులు తొలగి ఊరట చెందుతారు. పారిశ్రామికరంగం వారు కొత్త అవకాశాలు అందుకుంటారు. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబసభ్యులతో వివాదాలు.
 
 ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1పా.)
 పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి గ తం కంటే మెరుగ్గా ఉంటుంది. కుటుంబసభ్యులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. భూములు, ఆభరణాలు కొంటారు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో అనుకున్న ప్రగతి. ఆరోగ్యం కొంత మందగిస్తుంది. వారం చివరిలో మిత్రులతో వివాదాలు.
 
 మకరం (ఉత్తరాషాఢ 2,3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1,2పా.)
 ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఆస్తి విషయంలో వివాదాలు సర్దుబాటు కాగలవు. విద్యార్థుల యత్నాలు సానుకూలమవుతాయి.  వ్యాపారాలు అనుకున్న విధంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో పనిభారం తగ్గి ఊరట చెందుతారు. వారం ప్రారంభంలో అనారోగ్య సూచనలు.
 
 కుంభం (ధనిష్ట 3,4పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పా.)
 పనులు మొదట్లో కొంత మందగిస్తాయి. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. రావలసిన సొమ్ము అంది అవసరాలు తీరతాయి. కోర్టు వ్యవహారాలలో విజయం సాధిస్తారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో కొన్ని మార్పులు జరిగే సూచనలు. కళారంగం వారికి సన్మానయోగం. వారం మధ్యలో సోదరులతో వివాదాలు.
 
 మీనం (పూర్వాభాద్ర 4పా., ఉత్తరాభాద్ర, రేవతి)
 రావలసిన సొమ్ము ఆలస్యమవుతుంది. ముఖ్యమైన పనులలో కుటుంబసభ్యుల సాయం అందుతుంది.  ఆరోగ్యం విషయంలో శ్రద ్ధవహించండి. అనుకోని ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో స్వల్పలాభాలు. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. రాజకీయవర్గాలను ఒక ప్రకటన ఆకట్టుకుంటుంది. వారం ప్రారంభంలో వాహనయోగం.
 - సింహంభట్ల సుబ్బారావు,
 జ్యోతిష పండితులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement