చంద్రబింబం: జూన్ 8 నుండి 14వరకు | Funday Astrology of the week: june 07 to June14 | Sakshi
Sakshi News home page

చంద్రబింబం: జూన్ 8 నుండి 14వరకు

Published Sun, Jun 8 2014 1:20 AM | Last Updated on Sat, Sep 2 2017 8:27 AM

చంద్రబింబం: జూన్ 8 నుండి 14వరకు

చంద్రబింబం: జూన్ 8 నుండి 14వరకు

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.)
 ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. ఆసక్తికరమైన సమాచారం. ఒక ముఖ్య నిర్ణయం తీసుకుంటారు. భూవివాదాలు తీరతాయి. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారులకు అనుకున్న లాభాలు. ఉద్యోగులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం. విద్యార్థులకు మంచి ర్యాంకులు. వారం చివరిలో దూరప్రయాణాలు. రుణాలు చేస్తారు.
 
 వృషభం (కృత్తిక 2,3,4పా, రోిహ ణి, మృగశిర 1,2పా.)
 వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆస్తి విషయాలలో ఒప్పందాలు చేసుకుంటారు. సోదరుల నుంచి ధనలాభం. ఆర్థిక విషయాలలో పురోగతి ఉంటుంది. వాహనాలు, భూములు కొంటారు. విద్యార్థులకు నూతన విద్యావకాశాలు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగులకు పదోన్నతి. రాజకీయవర్గాలకు పదవీయోగం. వారం ప్రారంభంలో అనారోగ్య సూచనలు.
 
 మిథునం (మృగశిర 3,4పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.)
 భూవివాదాలు తీరతాయి. ఇంటాబయటా అనుకూల పరిస్థితి. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఒక సమాచారం నిరుద్యోగులను ఆకట్టుకుంటుంది. వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుతాయి. ఉద్యోగులకు ఇంక్రి మెంట్లు రాగలవు. కళాకారులకు సన్మానాలు జరుగుతాయి. వారం మధ్యలో వివాదాలు. అనారోగ్యం.
 
 కర్కాటకం (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
 కొత్త పనులు ప్రారంభిస్తారు. అరుదైన ఆహ్వానాలు అందుతాయి. నిరుద్యోగులకు సంతోషకరమైన సమాచారం.  ఇంటి నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలలో లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో చిక్కులు తొలగి ఊరట చెందుతారు. పారిశ్రామికవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం చివరిలో దూరప్రయాణాలు. ఆరోగ్యభంగం.
 
 సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.)
 ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఆరోగ్యభంగం. విద్యార్థులకు ఒత్తిడులు పెరుగుతాయి. బంధువులతో వివాదాలు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు మార్పులు ఉంటాయి. రాజకీయవర్గాలకు కొంత నిరాశ తప్పదు. వారం ప్రారంభంలో శుభవార్తలు.
 
 కన్య (ఉత్తర 2,3,4పా, హస్త, చిత్త1,2పా.,)
 కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి శుభవార్తలు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. ఒక ప్రకటన నిరుద్యోగులను ఆకట్టుకుంటుంది. కొన్ని వివాదాలు తీరతాయి. వ్యాపారాలలో అనుకున్న లాభాలు తథ్యం. ఉద్యోగులకు కొత్త హోదాలు. పారిశ్రామికవర్గాలకు ఆహ్వానాలు అందుతాయి. వారం చివరిలో ప్రయాణాలు. రుణాలు చేస్తారు.
 
 తుల (చిత్త 3,4పా, స్వాతి, విశాఖ1,2,3పా.)
 పనుల్లో విజయం సాధిస్తారు. మిత్రులు, బంధువులతో వివాదాలు పరిష్కారం. రావలసిన సొమ్ము అందుతుంది. పోటీ పరీక్షల్లో అనుకూల ఫలితాలు. చిరకాల కోరిక నెరవేరే సమయం. ఇంటి నిర్మాణయత్నాలు సాగిస్తారు. వ్యాపారాలలో పురోగతి. ఉద్యోగులకు పైస్థాయి నుంచి ప్రశంసలు. రాజకీయవర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం మధ్యలో ఆస్తి వివాదాలు.ప్రయాణాలలో ఆటంకాలు.
 
 వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ)
 చేపట్టిన పనులు సజావుగా పూర్తి చేస్తారు. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. ఇంతకాలం పడిన శ్రమకు ఫలితం దక్కుతుంది. వాహనసౌఖ్యం. ఇంటిలో శుభకార్యాలు. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. రాజకీయవర్గాలకు పదవులు దక్కుతాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. ఖర్చులు.
 
 ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1పా.)
 దూరపు బంధువులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఆస్తి విషయాలలో ఒప్పందాలు చేసుకుంటారు. నిరుద్యోగులు, విద్యార్థులకు అనుకూల ఫలితాలు. గృహ నిర్మాణయత్నాలు ఫలిస్తాయి. ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది. వాహనాలు, భూములు కొంటారు. ఉద్యోగులకు కొత్త హోదాలు. వారం మధ్యలో అనుకోని ప్రయాణాలు. రుణాలు చేస్తారు.
 
 మకరం (ఉత్తరాషాఢ 2,3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1,2పా.)
 అనుకున్న పనుల్లో పురోగతి ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు తీరతాయి. ప్రత్యర్థులు సైతం సహాయపడతారు. వాహనయోగం. కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుతాయి. ఉద్యోగులకు అనుకూల మార్పులు ఉంటాయి. కళాకారులకు సన్మానాలు. వారం ప్రారంభంలో ధనవ్యయం. దూరప్రయాణాలు. సోదరులతో వివాదాలు.
 
 కుంభం (ధనిష్ట 3,4పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పా.)
 నూతనోత్సాహంతో వ్యవహారాలు పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. బందువులతో ఉత్తరప్రత్యుత్తరాలు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు. రాజకీయవర్గాలకు ఆహ్వానాలు అందుతాయి. వారం మధ్యలో మిత్రులతో వివాదాలు. అనారోగ్యం.
 
 మీనం (పూర్వాభాద్ర 4పా., ఉత్తరాభాద్ర, రేవతి)
 దూరపు బంధువుల నుంచి శుభవార్తలు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. రుణబాధలు తొలగుతాయి. విద్యార్థుల యత్నాలు కలసివస్తాయి. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. కళాకారులకు పురస్కారాలు. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబంలోచికాకులు.
 - సింహంభట్ల సుబ్బారావు,
 జ్యోతిష పండితులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement