మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
అనుకున్న వ్యవహారాలలో పురోగతి కనిపిస్తుంది. రాబడి కొంత పెరిగే సూచనలు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖులు ఆహ్వానాలు అందిస్తారు. విద్యార్థులు కొత్త అవకాశాలు అందుకుంటారు. కాంట్రాక్టర్లకు శుభవార్తలు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపార లావాదేవీలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. పారిశ్రామికవర్గాల వారి శ్రమ ఫలిస్తుంది. వారం చివరిలో ధనవ్యయం. అనారోగ్యం. గులాబి, లేత పసుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.
వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.)
ఆశ్చర్యకరమైన రీతిలో పనులు పూర్తి కాగలవు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తారు. బంధువులు, మిత్రుల సహాయసహాకారాలు అందుతాయి. మీ అనుభవాలు పదిమందికీ పంచుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వాహనయోగం. చర్చలు ఫలిస్తాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు సమస్యలు కొన్ని పరిష్కారమవుతాయి. రాజకీయవర్గాలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వారం మధ్యలో ఖర్చులు. మానసిక అశాంతి. ఆకుపచ్చ, పసుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.
మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
కొన్ని వివాదాలు నెలకొన్నా చాకచక్యంతో పరిష్కరించుకుంటారు. పెద్దల సలహాలు స్వీకరిస్తారు. కార్యజయంతో ఉత్సాహంగా గడుపుతారు. కొన్ని బాకీలు వసూలవుతాయి. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తిలాభం. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఆస్తుల వ్యవహారాలలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు హోదాలు దక్కే అవకాశం. కళాకారులు అనుకున్నది సాధిస్తారు. వారం ప్రారంభంలో వివాదాలు. అనారోగ్యం. తెలుపు, గులాబి రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి.
కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
మొదట్లో చికాకులు, సమస్యలు ఎదురై పరీక్షగా నిలుస్తాయి. పనులు శ్రమానంతరం పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. దూరపు బంధువులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. పరిచయాలు పెరుగుతాయి. వాహనాలు, భూములు కొంటారు. వ్యాపారులకు లాభాలు కనిపిస్తాయి. ఉద్యోగులకు ఒక సమాచారం మరింత సంతోషం కలిగిస్తుంది. కళాకారులకు సన్మానాలు. వారం ప్రారం¿¶ ంలో వివాదాలు. ఆరోగ్యసమస్యలు. గులాబి, లేత ఆకుపచ్చరంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీస్తోత్రాలు పఠించండి.
సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
ముఖ్యమైన కార్యక్రమాలు నిదానంగా పూర్తి కాగలవు. ఆలోచనలు అమలు చేస్తారు. ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితులు మరింత దగ్గరవుతారు. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆస్తి వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు రాగలవు. పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం, ప్రభుత్వం నుంచి ఆహ్వానాలు. వారం మధ్యలో అనుకోని ఖర్చులు. ఆరోగ్యసమస్యలు. ఎరుపు, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.
కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
కొత్త విషయాలు తెలుస్తాయి. చేపట్టిన కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. నూతన వ్యక్తుల పరిచయం సంతోషం కలిగిస్తుంది. వాహనాలు, ఆభరణాలు సమకూర్చుకుంటారు. ఆస్తి వ్యవహారాలలో చర్చలు ఫలిస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. గతానుభవాల రీత్యా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. ఇంటి నిర్మాణాలు చేపడతారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు రాగలవు. కళాకారులకు అవార్డులు దక్కవచ్చు. వారం చివరిలో వ్యయప్రయాసలు. వివాదాలు. గులాబి, లేత పసుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి.
తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
విలువైన వస్తువులు, వాహనాలు కొనుగోలు చేస్తారు. రాబడి ఆశాజనకంగా ఉంటుంది. రుణఒత్తిడులు తొలగుతాయి. మీలోని నైపుణ్యం వెలుగుచూస్తుంది. స్థిరాస్తి వివాదాలు తీరతాయి. ఆరోగ్యం కొంత మందగించినా ఉపశమనం పొందుతారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు రావచ్చు. రాజకీయవర్గాలకు పదవులు, సన్మానాలు. వారం ప్రారంభంలో వృథా ఖర్చులు. శ్రమాధిక్యం. నీలం, లేత పసుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శివస్తోత్రాలు పఠించండి.
వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
ఆప్తులు అన్నివిధాలా సహకరిస్తారు. ఎంత కష్టమైన పనైనా అవలీలగా పూర్తి చేస్తారు. విద్యార్థులు సత్తా చాటుకుని ప్రతిభావంతులుగా గుర్తింపు పొందుతారు. వాహనాలు, భూములు కొంటారు. వివాహయత్నాలు కొలిక్కి వస్తాయి. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఉద్యోగులు సమర్థతను నిరూపించుకుంటారు. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. ఎరుపు,నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గామాతకు అర్చనలు చేయండి.
ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
కొన్ని వివాదాలు పరిష్కారమవుతాయి. ఆర్థిక విషయాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. మీకు నచ్చిన నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ లభిస్తుంది. వివాహ, ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడవచ్చు. ఆలోచనలు కలసివస్తాయి. వ్యాపారాలు విస్తరణలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులు అనుకున్న పదోన్నతులు పొందుతారు. కళాకారులకు ప్రయత్నాలు సఫలం. వారం మధ్యలో వృథా ఖర్చులు. ఆరోగ్యసమస్యలు. గులాబి, తెలుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.
మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
పనుల్లో కొంత జాప్యం తప్పదు. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. ఎంత కష్టించినా ఫలితం కనిపించక డీలా పడతారు. ఆరోగ్య, కుటుంబసమస్యలు వేధిస్తాయి. బంధువులతో అకారణంగా తగాదాలు. ఆస్తి వ్యవహారాలలో కొద్దిపాటి చికాకులు. నిరుద్యోగులకు కాస్తనిరుత్సాహం. వ్యాపార లావాదేవీలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉద్యోగులకు అదనపు పనిభారం. పారిశ్రామికవేత్తలు నిరాశ చెందే అవకాశం. వారం మధ్యలో శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. ఆకుపచ్చ, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్ చాలీసా పఠించండి.
కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
పనులు చకచకా పూర్తి కాగలవు. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. ఆలోచనలు అమలు చేస్తారు. ఆత్మీయులు, శ్రేయోభిలాషులు మీవెన్నంటి నిలుస్తారు. సంఘంలో పరపతి పెరుగుతుంది. ఆస్తి వ్యవహారాలలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. చిరకాల స్వప్నం నెరవేరే సమయం. కొన్ని సమస్యలు వాటంతట అవే పరిష్కారమవుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు. ఉద్యోగులకు ఉన్నత స్థితి ఖాయం. రాజకీయవర్గాలకు కొత్త పదవులు దక్కవచ్చు. వారం చివరిలో స్వల్ప అనారోగ్యం. వృథా ఖర్చులు. నీలం, ఆకుపచ్చ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారాస్తోత్రాలు పఠించండి.
మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
ముఖ్యమైన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. అదనపు ఆదాయం సమకూరుతుంది. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. భూములు, వాహనాలు కొనుగోలు చేసే వీలుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. పాతమిత్రులను కలుసుకుంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు అనుకోని హోదాలు. కళాకారులకు పురస్కారాలు లభిస్తాయి. వారం ప్రారంభంలో అనారోగ్యం. బంధువులతో తగాదాలు. ఎరుపు, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.
సింహంభట్ల సుబ్బారావు జ్యోతిష్య పండితులు
టారో (24 డిసెంబర్ నుంచి 30 డిసెంబర్, 2017 వరకు)
మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19)
ఈవారం మీకు బాగా కలిసివస్తుంది. కొద్దికాలం క్రితమే మొదలుపెట్టిన ఒక పనిలో విజయం సాధిస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది. జీవితాశయం వైపుకు అడుగులు వెయ్యాలన్న ఆలోచన ఎప్పట్నుంచో ఉన్నట్లైతే, అందుకు సరైన సమయం ఇదే. మీ వ్యవహార శైలిలో కొన్ని ఊహించని మార్పులు వస్తాయి. అయితే అవి మిమ్మల్ని ప్రేమించే వారిని ఇబ్బంది పెట్టకుండా ఉండేలా చూసుకోండి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం.
కలిసివచ్చే రంగు : ముదురు గోధుమ
వృషభం (ఏప్రిల్ 20 – మే 20)
చాలాకాలంగా మీ స్థాయికి తగ్గ విజయం కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఆ విజయం కోసం ఓపిగ్గా ఇంకొంత కాలం ఎదురుచూడాల్సి రావొచ్చు. పరిస్థితులకు భయపడిపోకుండా ఆత్మవిశ్వాసంతో పనిచేస్తూ వెళ్లండి. మీదైన ప్రతిభ త్వరలోనే ప్రపంచానికి తెలుస్తుంది. దక్కాల్సిన గుర్తింపు తప్పకుండా దక్కుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. కొత్త వ్యక్తిని కలుసుకుంటారు. ఆ వ్యక్తి రాక మీకు కొత్త ఉత్సాహాన్నిస్తుంది.
కలిసివచ్చే రంగు : ఆకుపచ్చ
మిథునం (మే 21 – జూన్ 20)
ఈవారం చాలా సంతోషంగా గడుపుతారు. ప్రేమ జీవితంలో కొత్త కొత్త రంగులను చూస్తారు. ఇష్టపడ్డ వ్యక్తి కోసం ఎక్కువ సమయం కేటాయిస్తారు. జీవితాశయం వైపుకు అడుగులు వేస్తారు. కొద్దికాలం క్రితమే మొదలుపెట్టిన ఓ పనిలో మంచి విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత కలవరపెడుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఆత్మవిశ్వాసంతో, విజయంపై ధీమాతో పనిచేసే మీ స్వభావమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుందని నమ్మండి.
కలిసివచ్చే రంగు : గులాబి
కర్కాటకం (జూన్ 21 – జూలై 22)
మీ శ్రమకు తగ్గ గుర్తింపు దక్కే సమయం ఇదే. ఎప్పట్నుంచో ఎదురుచూస్తోన్న ఓ విజయం మీకు దగ్గరగా వచ్చి ఉంది. మీదైన శైలిలో, ఫలితాన్ని గురించే ఆలోచిస్తూ కూర్చోకుండా కష్టపడితే ఆ విజయం మీదే! మీ జీవితానికి సంబంధించి ఓ కీలక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ నిర్ణయంపైనే మీ భవిష్యత్ ఆధారపడి ఉందని గ్రహించండి. ఆ ఆలోచనలతో జీవితంలో మీకుగా మీరు ఏం కోరుకుంటున్నారో అర్థం చేసుకుంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం.
కలిసివచ్చే రంగు : నారింజ
సింహం (జూలై 23 – ఆగస్ట్ 22)
ఈవారం మీకు కొన్ని అనుకోని అవాంతరాలు ఎదురవుతాయి. మీకు సన్నిహితులైన వ్యక్తులతో చిన్న చిన్న వివాదాలు తలెత్తుతాయి. మాట్లాడేముందు ఆ మాట ఎదుటివ్యక్తికి ఎలా చేరుతుందన్న విషయాన్ని కూడా ఆలోచించి మాట్లాడండి. జీవిత భాగస్వామికి ఎక్కువ సమయం కేటాయిస్తారు. ఎప్పట్నుంచో వాయిదా వేస్తూ వస్తోన్న విహారయాత్రను ఇప్పుడే చేపడతారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఆహరపు అలవాట్లలో మార్పు రావాల్సిన పరిస్థితి వస్తుంది.
కలిసివచ్చే రంగు : పసుపు
కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22)
ఆర్థిక పరిస్థితి ఈవారం మిమ్మల్ని కాస్తంత కలవరపెడుతుంది. అనవసర ఖర్చులకు దూరంగా ఉండటాన్ని ఇప్పటికైనా అలవాటు చేసుకుంటే మంచిది. వృత్తి జీవితం సాఫీగా సాగిపోతుంది. తోటి ఉద్యోగులతో కలిసిమెలిసి ఉండడం అలవర్చుకోవాల్సిన సమయం ఇదే. ఖాళీ అన్నదే లేకుండా వారమంతా కష్టపడుతూనే ఉంటారు. ప్రేమ జీవితం బాగుంటుంది. మీకిష్టమైన వ్యక్తి ఇచ్చే ఓ బహుమతి మిమ్మల్ని ఉత్సాహపరుస్తుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం.
కలిసివచ్చే రంగు : తెలుపు
తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22)
ఆర్థిక పరిస్థితి మిమ్మల్ని నిరాశలోకి నెట్టేసే ప్రమాదం కనిపిస్తోంది. దీనంతటికీ కారణం అనవసర ఖర్చులను దూరం చేసుకోలేకపోవడమే. గతాన్ని గురించి ఆలోచిస్తూ కూర్చుంటారు. దీంతో ఆరోగ్యపరంగా కూడా కొన్ని సమస్యలు తలెత్తుతాయి. ఇలాంటి పరిస్థితుల నుంచి బయటపడేందుకు మిమ్మల్ని మీరు ఎలా సిద్ధం చేసుకోవాలో ఆలోచించండి. ఒక కొత్త అవకాశం మీకోసం ఎదురుచూస్తోంది. మీదైన శైలిలో కష్టపడి పనిచేస్తూ ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోండి.
కలిసివచ్చే రంగు : గులాబి
వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21)
ఒక కొత్త ఆలోచన మీ వ్యాపారాన్ని మరింత బాగా వృద్ధిలోకి తీసుకొస్తుంది. అయితే ఆ ఆలోచనను బలంగా నమ్మి, కష్టపడితేనే ఫలితం సాధ్యమని గ్రహించండి. వరుసగా అవకాశాలు వచ్చిపడతాయి. తొందరపడకుండా మిమ్మల్ని పై స్థాయికి తీసుకెళ్లే అవకాశాన్ని మాత్రమే అందుకొని ముందుకెళ్లండి. మనుషులతో కలిసిపోవడాన్ని ఇకనైనా అలవాటు చేసుకుంటే మంచిది. ఆర్థిక పరిస్థితి మీరు ఊహించిన దానికంటే బాగుంటుంది. మీకు ఇష్టమైన వస్తువులను కొనుగోలు చేస్తారు. ప్రేమ జీవితం బాగుంటుంది.
కలిసివచ్చే రంగు : గులాబి
ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21)
మీ ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేసే ఓ వ్యక్తిని కలుసుకుంటారు. ఆ వ్యక్తి రాకతో ఊహించనంత సంతోషంగా రాబోయే రోజులను గడుపుతారు. ప్రేమ జీవితం మీకు ఒక కొత్త ఉత్సాహాన్నిస్తుంది. ఒక గొప్ప అవకాశం మీకు దగ్గరలో ఉంది. దాన్ని అందుకునేందుకు నిరంతరం కష్టపడుతూ ఉండండి. పాత మిత్రులను కలుసుకుంటారు. విహారయాత్రకు వెళ్లే ఆలోచన కూడా చేస్తారు. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది.
కలిసివచ్చే రంగు : ఎరుపు
మకరం (డిసెంబర్ 22 – జనవరి 19)
ఈవారమంతా సాఫీగా సాగిపోతుంది. జీవితాశయం వైపుకు అడుగులు వేయాలని తపిస్తారు. అందుకు తగ్గట్టుగా మీ ఆలోచనా విధానాన్ని కూడా మార్చుకుంటూ ముందుకు వెళతారు. మారే మీ ఆలోచనా విధానం మీలో ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుంది. ఎటువంటి పరిస్థితులకైనా ఎదురెళ్లే శక్తిని కూడగట్టుకుంటారు. ఆర్థిక పరిస్థితి గతంలో కంటే చాలా మెరుగుపడుతుంది. మీరు బాగా ఇష్టపడే వ్యక్తికి సమయం కేటాయిస్తారు. విహారయాత్రకు సన్నాహాలు చేసుకుంటారు.
కలిసివచ్చే రంగు : పసుపు
కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18)
ఈవారం మీకు అదృష్టం బాగా కలిసివస్తుంది. ఇష్టమైన వ్యక్తితో సంతోషంగా కాలాన్ని గడుపుతారు. మీదైన ప్రతిభను ప్రపంచానికి చాటుకునే అవకాశం కూడా త్వరలోనే వస్తుంది. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు సిద్ధంగా ఉండండి. ఆర్థిక పరిస్థితి గతంలోకంటే మెరుగుపడుతుంది. అయితే అనవసర ఖర్చులకు దూరంగా ఉండడం ఇప్పటికైనా అలవాటు చేసుకుంటే మంచిది. ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. వృత్తి జీవితంలో ఓ కీలక మలుపు సూచనలు కనిపిస్తున్నాయి.
కలిసివచ్చే రంగు : తెలుపు
మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20)
మీ భయాలే మిమ్మల్ని విజయం వైపుకు వెళ్లనీయకుండా ఆపేస్తున్న శక్తులని నమ్మండి. ఆ భయాలను దూరం చేసుకొని ధైర్యంగా ముందుకెళ్లాల్సిన సమయం ఇదే. ఇతరుల అభిప్రాయాలకే పూర్తిగా విలువ ఇచ్చేయకుండా, మీదైన బలమైన అభిప్రాయం ఒకటి ఏర్పరచుకోండి. ఒక కొత్త వ్యక్తిని కలుసుకుంటారు. ఆ వ్యక్తి పరిచయం మిమ్మల్ని జీవితాశయం వైపుకు అడుగులు వేయిస్తుంది. కొన్ని దురలవాట్లని తెలిసినా, వాటిని వదల్లేకపోతూంటే, ఇప్పటికైనా వాటిని దూరం చేసుకోండి. ఆర్థిక పరిస్థితి సాదాసీదాగా ఉంటుంది.
కలిసివచ్చే రంగు : నీలం
ఇన్సియా టారో అనలిస్ట్
Comments
Please login to add a commentAdd a comment