వారఫలాలు(10 డిసెంబర్‌ నుంచి 16 డిసెంబర్‌ 2017 వరకు) | varaphalalu(10-12-2017-16-12-2017) | Sakshi
Sakshi News home page

వారఫలాలు(10 డిసెంబర్‌ నుంచి 16 డిసెంబర్‌ 2017 వరకు)

Published Sun, Dec 10 2017 1:06 AM | Last Updated on Sun, Dec 10 2017 1:06 AM

varaphalalu(10-12-2017-16-12-2017) - Sakshi

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
కొత్త విషయాలు తెలుస్తాయి. ప్రతిభను చాటుకుంటారు. మీ అభిప్రాయాలను కుటుంబసభ్యులు గౌరవిస్తారు. ఆదాయం గతంతో పోలిస్తే మెరుగుపడుతుంది. ప్రత్యర్థులు మిత్రులుగా మారి సహకరిస్తారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు. ఉద్యోగులకు ఉన్నత పోస్టులు దక్కుతాయి. రాజకీయవేత్తలకు సంతోషకరమైన సమాచారం. వారం ప్రారంభంలో ఖర్చులు. మానసిక ఆందోళన. స్వల్ప అనారోగ్యం. గులాబి, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆవుపాల పొంగలి ఇష్టౖ§ð వానికి నివేదించండి.

 

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.)
ప్రారంభంలో కొద్దిపాటి చికాకులు, పనుల్లో జాప్యం ఉంటాయి. ఆర్థికపరమైన సమస్యలు తీరతాయి. మీలో దాగి ఉన్న నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. విద్యార్థులు, నిరుద్యోగులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వాహనయోగం. వ్యాపారాలలో చికాకులు తొలగుతాయి. ఉద్యోగులకు ఊరట కలిగించే సమాచారం. పారిశ్రామికవేత్తలకు సన్మానాలు. వారం ప్రారంభంలో ధనవ్యయం. అనారోగ్యం. లేత నీలం, పసుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. ఆవునేతితో గణేశ్‌ వద్ద దీపం వెలిగించండి.

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
కొన్ని కార్యక్రమాలను నిదానంగా పూర్తి చేస్తారు. సేవాభావంతో అందర్నీ మెప్పిస్తారు. సంఘంలో గౌరవమర్యాదలు పొందుతారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. వాహనాలు కొంటారు. ప్రముఖులు పరిచయమవుతారు. గతంలోని కొన్ని సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. వ్యాపారాలు లాభాలదిశగా సాగుతాయి. ఉద్యోగులకు హోదాలు పెరిగే అవకాశాలు. కళాకారులు పోగొట్టుకున్న అవకాశాలు తిరిగి పొందుతారు. వారం మధ్యలో ఆరోగ్య సమస్యలు. నేరేడు, గులాబి రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీస్తోత్రాలు పఠించండి.

కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
అనుకున్న ఆదాయం సమకూరక కొంత ఇబ్బంది తప్పదు. పనులు ముందుకు సాగవు. ఆలోచనలు కలసిరావు. కుటుంబసభ్యులతో అకారణంగా వివాదాలు నెలకొంటాయి. ఆరోగ్యం మందగిస్తుంది.  విద్యార్థులు, నిరుద్యోగులపై ఒత్తిడులు పెరుగుతాయి. దూరపు బంధువులను కలుసుకుంటారు. వ్యాపార లావాదేవీలు స్వల్పంగానే లాభిస్తాయి. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి. రాజకీయవేత్తలకు సమస్యలు ఎదురవుతాయి. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. గులాబి, పసుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
పనుల్లో విజయం సా«ధిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. రావలసిన డబ్బు అంది అవసరాలు తీరతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఇళ్లు, వాహనాలు కొంటారు. పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు, లాభాలు తథ్యం. ఉద్యోగులకు ఉన్నతస్థితి దక్కుతుంది. కళాకారులకు నూతనోత్సాహం. వారం చివరిలో వృథా ఖర్చులు అవుతాయి. కుటుంబంలో అనుకోని ఒత్తిడులు. లేత ఆకుపచ్చ, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి.

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
ఎటువంటి సమస్యనైనా అవలీలగా పరిష్కరించుకుంటారు. ఆత్మస్థైర్యం పెరుగుతుంది. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. చిరకాల మిత్రుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార లావాదేవీలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు చిక్కులు తొలగుతాయి. పారిశ్రామికవేత్తలకు ఆహ్వానాలు అందుతాయి. వారం ప్రారంభంలో ఖర్చులు తప్పవు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. నేరేడు, నీలం రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం.  నవగ్రహస్తోత్రాలు పఠించండి.

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
రుణబాధలు తొలగి ఊరట లభిస్తుంది. పనులు అనుకున్న విధంగా సాగుతాయి. ఆస్తి వివాదాలు తీరి ఉపశమనం లభిస్తుంది. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. ఒక ప్రకటన నిరుద్యోగులను ఆకట్టుకుంటుంది. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం అందుతుంది. రాజకీయవేత్తలకు సన్మానాలు. వారం చివరిలో వృథా ఖర్చులు. ఆకుపచ్చ, తెలుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారాస్తోత్రాలు పఠించండి.

వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
వీరికి పట్టింది బంగారంగా ఉంటుంది. కార్యశూరులై అనుకున్న పనులు పూర్తి చేస్తారు. స్వచ్ఛంద కార్యక్రమాలలో పాలుపంచుకుంటారు. అభిమానులు పెరుగుతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖుల నుంచి కీలక సమాచారం. వాహనాలు, భూములు కొంటారు. వివాదాల పరిష్కారంలో చొరవ చూపుతారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఉన్నతస్థితి దక్కుతుంది. రాజకీయవేత్తల కృషి ఫలిస్తుంది. వారం చివరిలో అనారోగ్యం. ధనవ్యయం. ఎరుపు, లేత గులాబి రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి.

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
అదనపు రాబడి దక్కి ఉత్సాహంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. ఆప్తుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. నిరుద్యోగులకు శుభవార్తలు. వాహనయోగం. చర్చలు సఫలం. ఒక సంఘటన ఆకట్టుకుంటుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు రాగలవు. కళాకారులకు సత్కారాలు. వారం చివరిలో ఖర్చులు. కుటుంబసమస్యలు. లేత పసుపు, తెలుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. అన్నపూర్ణాష్టకం పఠించండి.

మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
ప్రారంభంలో కొన్ని సమస్యలు వేధిస్తాయి. అయినా ఆత్మవిశ్వాసం, పట్టుదలతో అధిగమించి ముందుకు సాగుతారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. దూరపు బంధువులను కలుసుకుంటారు. విద్యార్థుల సత్తా చాటుకునేందుకు తగిన సమయం. వివాహాది శుభకార్యాలపై చర్చలు జరుపుతారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు విధుల్లో చిక్కులు తొలగుతాయి. రాజకీయవేత్తలకు అనుకూల పరిస్థితులు. వారం ప్రారంభంలో మానసిక అశాంతి. ఆరోగ్య సమస్యలు. నీలం, నేరేడు రంగులు. తూర్పుదిశప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.

కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
పనులు కొంత నెమ్మదించినా పూర్తి కాగలవు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. బంధువుల సలహాలు స్వీకరిస్తారు. వాహనయోగం. చర్చలు సఫలమవుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలలో పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు మంచి గుర్తింపు రాగలదు. కళాకారులకు సత్కారాలు అందుతాయి. వారం మధ్యలో వృథా ఖర్చులు. మిత్రులతో వివాదాలు. వారం చివరిలో కొంచెం అనారోగ్యం. ఆకుపచ్చ, లేత పసుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి.

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
ముఖ్యమైన కార్యక్రమాలు సజావుగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. మీ సమర్థత, నైపుణ్యం వెలుగులోకి వస్తాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. మిత్రుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. విద్యార్థులకు నూతనోత్సాహం. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో కొత్త భాగస్వాములు చేరతారు. ఉద్యోగులకు విధుల్లో అనుకూల వాతావరణం. రాజకీయవేత్తలకు పదవీయోగం. వారం ప్రారంభంలో శ్రమ తప్పదు. అనారోగ్యం. గులాబి, ఎరుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు సానుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.
సింహంభట్ల సుబ్బారావు జ్యోతిష్య పండితులు

టారో (10 డిసెంబర్‌ నుంచి 16 డిసెంబర్, 2017 వరకు)
మేషం (మార్చి 21 – ఏప్రిల్‌ 19)
వృత్తి జీవితంలో మీదైన గుర్తింపు కోసం కష్టపడతారు. చాలాకాలంగా మీ జీవితాన్ని మలుపుతిప్పే విజయం కోసం ఎదురుచూస్తున్నారు. ఆ విజయం త్వరలోనే మీకు దక్కుతుంది.  మీరు చేస్తున్న పని ఏదయినా అది మీకు ఆత్మసంతృప్తిని ఇచ్చేదై ఉండాలన్న విషయాన్ని మరవకండి. ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీకు ఇష్టమైన వ్యక్తుల దగ్గర్నుంచి ఓ శుభవార్త వింటారు. ఇది మీకు ఎంతో సంతోషాన్నిస్తుంది. ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉంటుంది.
కలిసివచ్చే రంగు : తెలుపు

వృషభం (ఏప్రిల్‌ 20 – మే 20)
జీవితాశయం వైపుకు అడుగులు వేయాల్సిన సమయం ఇదే! వృత్తి జీవితంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. యజమానితో మాటపట్టింపు సూచనలు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి. మీకు కావాల్సింది ఏంటో స్వతహాగా, అన్నీ ఆలోచించి నిర్ణయించుకోండి. ఆ నిర్ణయంతో మీరు సంతోషంగా ఉంటారన్న నమ్మకం వస్తేనే ముందుకు వెళ్లండి. ప్రేమ జీవితం బాగుంటుంది.
కలిసివచ్చే రంగు : గోధుమ

మిథునం (మే 21 – జూన్‌ 20)
మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టేసిన సమస్యలను చూసి భయపడిపోతున్నారు. అయితే ఆ భయాలన్నింటినీ వదిలి, ముందుకు వెళ్లడంలోనే విజయం ఉందని గ్రహించండి. మీకు ఇష్టమైన వాళ్లు మీతో మాట్లాడే విధానంలో తేడా గమనిస్తారు. అందుకు మీ ఇద్దరి మధ్యా వచ్చే మనస్పర్థలు కారణం కావొచ్చు. బంధాన్ని బలంగా నిలుపుకోవడానికి ఇలాంటి సందర్భాల్లో వాళ్లు ఏ పరిస్థితుల్లో ఉండి అలా మాట్లాడుతున్నారో ఆలోచించండి. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంటుంది.
కలిసివచ్చే రంగు : ఆకుపచ్చ

కర్కాటకం (జూన్‌ 21 – జూలై 22)
కొత్త వ్యక్తుల పరిచయం మీకు మరింత ఉత్సాహాన్నిస్తుంది. ఈవారమంతా ఖాళీ అన్నదే లేకుండా గడుపుతారు. మీ ప్రతిభను ప్రదర్శించుకునేందుకు ఒక వేదిక దొరుకుతుంది. ఈ అవకాశాన్ని అన్నివిధాలా అందిపుచ్చుకొని మీరేంటో నిరూపించుకోవాల్సిన సమయం కూడా ఇదేనని నమ్మండి. మీ జీవిత భాగస్వామికి ఎక్కువ సమయం కేటాయిస్తారు. మీ ఇద్దరూ ఇష్టంగా కన్న ఒక విహారయాత్ర కలను సాకారం చేసుకుంటారు.
కలిసివచ్చే రంగు : ఎరుపు

సింహం (జూలై 23 – ఆగస్ట్‌ 22)
జీవితం ఓ దగ్గర ఆగిపోయి, ఎటూ ముందుకు పోని పరిస్థితుల్లో చిక్కుకున్నట్టు అనిపిస్తుంది. అయితే ఇలాంటి ఒక రోజును దాటి ముందుకు వెళితేనే జీవితమన్న విషయాన్ని గ్రహించండి. ఒక కొత్త వ్యక్తి పరిచయం మీ ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఆ వ్యక్తికి తక్కువ సమయంలోనే చాలా దగ్గరవుతారు. మీకు ఆత్మసంతృప్తినిచ్చే విషయాలేంటో తెలుసుకుంటారు. చాలాకాలంగా ఎదురుచూస్తోన్న ఓ అవకాశం మీ తలుపు తడుతుంది.
కలిసివచ్చే రంగు : గోధుమ

కన్య (ఆగస్ట్‌ 23 – సెప్టెంబర్‌ 22)
మీ స్వభావానికి తగ్గట్టే పరిస్థితులూ అనుకూలించడంతో ఈవారమంతా చాలా సంతోషంగా గడుపుతారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ధైర్యంగా నిలబడాలన్న మీ ఆత్మవిశ్వాసమే మిమ్మల్ని విజయం దిశగా తీసుకెళుతుంది. ఒక కొత్త అవకాశాన్ని అందిపుచ్చుకుంటారు. శ్రమకు తగ్గ గుర్తింపు లభిస్తుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది.
కలిసివచ్చే రంగు : పసుపు

తుల (సెప్టెంబర్‌ 23 – అక్టోబర్‌ 22)
 జీవితంలో ఓ కీలక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. ఆ నిర్ణయం తీసుకునేందుకు అన్నివిధాలా మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి. ఈ నిర్ణయం మీకు ఎంత ముఖ్యమో తెలుసుకొని, మీరు కోరుకున్న విధంగా ఆ వైపుకు ధైర్యంగా అడుగు వేయండి. మీకు బాగా ఇష్టమైన వ్యక్తి వల్లే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆర్థిక, ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది. ప్రేమ జీవితం ఉల్లాసంగా ఉంటుంది.
కలిసివచ్చే రంగు : గులాబి

వృశ్చికం (అక్టోబర్‌ 23 – నవంబర్‌ 21)
చాలాకాలంగా చీకట్లో కూరుకుపోయి ఉన్న మీ జీవితమంతా ఒక్కసారిగా కొత్త కాంతిని చూసినట్టుగా మారిపోతుంది. జీవితంలో వచ్చే ఈ మార్పును సంతోషంగా అందిపుచ్చుకునేందుకు సిద్ధంగా ఉండండి. వృత్తి జీవితం బాగుంటుంది. ఓ గొప్ప అవకాశం మీ తలుపు తడుతుంది. మీదైన శ్రమ పెడితేనే ఆ అవకాశాన్ని విజయం దిశగా తీసుకెళ్లగలరన్న విషయాన్ని మనసులో పెట్టుకోండి. మనసును ప్రశాంతంగా ఉంచుకునేందుకు కొత్త ప్రదేశాలకు వెళ్లండి.
కలిసివచ్చే రంగు : ఆకుపచ్చ

ధనుస్సు (నవంబర్‌ 22 – డిసెంబర్‌ 21)
మీ ఆలోచనా విధానం పూర్తిగా మారాల్సిన పరిస్థితి వచ్చి పడుతుంది. అందుకు మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి. ఎప్పట్లానే మారకుండా ఉంటే మీరే చిక్కుల్లో పడతారు. మారే మీ ఆలోచనా విధానమే మీకు ఒక గొప్ప అవకాశాన్ని తెచ్చిపెడుతుంది. ఆ అవకాశాన్ని అందుకోవడంతోనే విజయం వైపుకు మీరు ఒక అడుగు వేసేసినట్లని నమ్మండి. ప్రశాంతంగా ఉండేందుకు ఏదైనా విహారయాత్రకు వెళ్లాలన్న ఆలోచన ఉంటే వెంటనే ఆ దిశగా అడుగులు వేయండి.
కలిసివచ్చే రంగు : నారింజ

మకరం (డిసెంబర్‌ 22 – జనవరి 19)
ఈవారమంతా కాస్తంత గందరగోళంగా ఉంటుంది. చేపట్టిన పనులన్నీ వాయిదా పడుతూ మీ సహనానికి పరీక్ష పెడతాయి. మీ చుట్టూ ఉండేవారంతా మంచి వారే అనుకోవడం మీ స్వభావమే అయినా గుడ్డిగా నమ్మితే కొన్ని సమస్యలు తలెత్తుతాయన్న విషయం తెలుసుకోండి. ఎప్పుడో మొదలుపెట్టి మధ్యలో ఆపేసిన ఓ పని గురించి బాగా ఆలోచిస్తారు. ఆ పనిని మళ్లీ కొత్తగా మొదలుపెట్టేందుకు ఇదే సరైన సమయం. కలిసివచ్చే రంగు : ఆకుపచ్చ

కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18)
ఈ నెలంతా మీకు కొన్ని అనుకోని పరిస్థితులు ఎదురవుతాయి. ఆ పరిస్థితులు మీపై తీవ్ర ఒత్తిడిని తీసుకొస్తాయి. ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. వీటన్నింటినీ ఎదుర్కొనేందుకు మానసికంగా సిద్ధంగా ఉండండి. జీవిత భాగస్వామికి ఎక్కువ సమయం కేటాయిస్తారు. వారి మాటలే మీకు ఈ కష్టసమయంలోనూ కొండంత అండగా కనిపిస్తాయి. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది.
కలిసివచ్చే రంగు : నారింజ

మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20)
జీవితాశయం వైపుకు అడుగులు వేయాల్సిన సమయం ఇదే! గమ్యాన్ని చేరేందుకు ఏయే మార్గాలు ఎంచుకోవాలో ఇప్పట్నుంచే ఆలోచించండి. పగటికలలు మానేసి గమ్యం వైపుకు వెళ్లేందుకు శక్తినంతా వెచ్చించి పనిచేయండి. సన్నిహితుల నుంచి వచ్చే సలహాలు, సూచనలు తీసుకుంటూనే ముందుకెళ్లండి. ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీరు ఇష్టంగా ప్రేమించే వ్యక్తి నుంచి వచ్చే ప్రోత్సాహం కూడా మిమ్మల్ని మరింత ఉత్సాహంగా ముందుకు నడిపిస్తుంది.
కలిసివచ్చే రంగు : బూడిద
ఇన్సియా టారో అనలిస్ట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement