
సౌరబలం : సెప్టెంబర్15 నుండి 21 వరకు
మేషం (మార్చి 21-ఏప్రిల్ 20)
ఆర్థిక విషయాలలో ప్రగతి కనిపిస్తుంది. విద్య, ఉద్యోగావకాశాలు. ఇంటా బయటా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలు. పనులు సకాలంలో పూర్తి కాగలవు. వృత్తి, వ్యాపారాలలో అవరోధాలు తొలగుతాయి. వాక్చాతుర్యంతో అందర్నీ ఆకట్టుకుంటారు. వారం చివరిలో ధనవ్యయం. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు.
వృషభం (ఏప్రిల్ 21-మే 20)
శ్రమ ఫలిస్తుంది. పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. సంఘంలో ఆదరణ. నిర్ణయాలలో కుటుంబసభ్యుల సలహాలు పొందుతారు. విద్యార్థులకు అవకాశాలు. వస్తు, వస్త్రలాభాలు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఇంటిలో శుభకార్యాల నిర్వహణ. కళాకారులకు సన్మానాలు. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. ఆస్తి వివాదాలు.
మిథునం (మే 21-జూన్ 21)
ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. బంధువులతో ఆస్తి వివాదాలు. పనులు మందకొడిగా సాగుతాయి. అనారోగ్యం. శ్రమ పెరుగుతుంది. ఇంటాబయటా ఒత్తిడులు. వ్యాపార, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి. నిర్ణయాలలో తొందరపాటు వద్దు. వారం చివరిలో శుభవార్తలు. వాహనయోగం.
కర్కాటకం (జూన్ 22-జూలై 23)
కొన్ని పనులు వాయిదా వేస్తారు. బంధువులు, మిత్రుల నుంచి కొంత వ్యతిరేకత ఎదురవుతుంది. శ్రమకు ఫలితం ఉండదు. బాధ్యతలు పెరుగుతాయి. ఆరోగ్యభంగం. విద్యార్థులు, నిరుద్యోగులకు ఒత్తిడులు. వారం ప్రారంభంలో విందువినోదాలు. ప్రముఖులతో పరిచయాలు.
సింహం (జూలై 24-ఆగస్టు 23)
కొత్త విషయాలు తెలుసుకుంటారు. బంధువుల నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయమవుతారు. భూ, గృహయోగాలు. విద్యార్థులకు అనుకున్న ర్యాంకులు. వృత్తి, వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వారం చివరిలో ఆరోగ్యభంగం, పనుల్లో ఆటంకాలు.
కన్య (ఆగస్టు 24-సెప్టెంబర్ 23)
సంఘంలో గౌరవమర్యాదలు. ఆస్తి వివాదాలు తీరతాయి. ఇంటి నిర్మాణయత్నాలు సాగిస్తారు. చిరకాల స్వప్నం నెరవేరుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు. విద్యార్థులు, నిరుద్యోగులకు శుభవార్తలు. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. అనారోగ్యం.
తుల (సెప్టెంబర్ 24-అక్టోబర్ 23)
పనులు నత్తనడకన సాగుతాయి. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. రుణాలు చేస్తారు. బాధ్యతలు పెరుగుతాయి. ఓర్పుతో ముందుకు సాగండి. వ్యాపార, ఉద్యోగాలలో మార్పులు. నిరుద్యోగుల యత్నాలు ముందుకు సాగవు. ఆరోగ్యభంగం. వారం చివరిలో ప్రముఖులతో పరిచయాలు.
వృశ్చికం (అక్టోబర్ 24-నవంబర్ 22)
ఆర్థిక పరిస్థితి ఇబ్బంది కలిగిస్తుంది. ధనవ్యయం. కుటుంబసభ్యులతో వివాదాలు. శ్రమాధిక్యం. విద్యార్థుల యత్నాలు మందగిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు. కళాకారులకు చికాకులు. వారం మధ్యలో ధనలాభం.
ధనుస్సు (నవంబర్ 23-డిసెంబర్ 21)
పనులు మందగిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు. మిత్రులతో వివాదాలు. కుటుంబంలో ఒత్తిడులు. బంధువులను కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు. విద్యార్థులకు శ్రమాధిక్యం. ఆలయదర్శనాలు. వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహం. ఆప్తుల సలహాల మేరకు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. వారం చివరిలో విందు వినోదాలు. ఉద్యోగయోగం.
మకరం (డిసెంబర్ 22-జనవరి 20)
పట్టింది బంగారమే. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితుల నుంచి ఆహ్వానాలు. చాకచక్యంగా సమస్యలు పరిష్కరించుకుంటారు. భూ, గృహయోగాలు. విద్యార్థులు, నిరుద్యోగులకు శుభవార్తలు. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. సన్మానాలు పొందుతారు. వారం మధ్యలో కుటుంబసమస్యలు. అనారోగ్యం.
కుంభం (జనవరి 21-ఫిబ్రవరి 19)
వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు. రావలసిన డబ్బు అందక ఇబ్బందిపడతారు. ఆరోగ్యం మందగిస్తుంది. బాధ్యతలు అధికమవుతాయి. ప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. రాజకీయవర్గాలకు నిరుత్సాహం. వారం ప్రారంభంలో ఆస్తిలాభం. నూతన పరిచయాలు.
మీనం (అధిపతి గురువు, ఫిబ్రవరి 20-మార్చి 20)
కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. ఇంటా బయటా అనుకూలం. ఇంటి నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. వివాదాల నుంచి బయటపడతారు. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం. విద్యార్థులకు ఊహించని అవకాశాలు. వారం చివరిలో వ్యయప్రయాసలు. ధనవ్యయం. ఆరోగ్యభంగం.
- సింహంభట్ల సుబ్బారావు,
జ్యోతిష పండితులు
మీతో పాటు ఈ వారం పుట్టినరోజు జరుపుకుంటోన్న సెలెబ్రిటీ...
కరీనా కపూర్
పుట్టినరోజు: సెప్టెంబర్ 21
ఈ వారంలో పుట్టినరోజు జరుపుకునేవారికి...
ఈతిబాధల నుంచి విముక్తి. ఆర్థిక విషయాలలో పురోగతి. అయితే ఖర్చులు తప్పవు. అందర్నీ మెప్పిస్తారు. గుర్తింపు పొందుతారు. కొందరికి పదవీయోగాలు, సన్మానాలు. కళాకారులకు అవార్డులు, పురస్కారాలు. ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. పెండింగ్ కేసులు పరిష్కారమవుతాయి. ఆధ్యాత్మిక భావాలు పెరుగుతాయి.