మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.)
ఆర్థిక వ్యవహారాలలో కొద్దిపాటి చికాకులు. పనులు నెమ్మదిగా పూర్తి కాగలవు. బంధువులతో వివాదాలు. ఆరోగ్యం మందగిస్తుంది. నిరుద్యోగుల యత్నాలు నిరాశ పరుస్తాయి. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగవర్గాలకు అదనపు పనిభారం. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా. వారం ప్రారంభంలో ధన, వస్తులాభాలు. అరుదైన సన్మానాలు.
వృషభం (కృత్తిక 2,3,4పా, రోిహ ణి, మృగశిర 1,2పా.)
మిత్రులతో మాటపట్టింపులు. పనులు కొన్ని వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఆర్థిక లావాదేవీలు మందకొడిగా సాగుతాయి. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు శ్రమాధిక్యం, అదనపు బాధ్యతలు. పారిశ్రామికరంగం వారికి అంతగా అనుకూలించదు. వారం మధ్యలో వాహనయోగం. బంధువుల నుంచి ఆహ్వానాలు. ఉద్యోగయోగం.
మిథునం (మృగశిర 3,4పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.)
పట్టింది బంగారమే అన్నట్లుంటుంది. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. గృహ నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. వాహనాలు, ఆభ రణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. కళారంగం వారికి సన్మానాలు, అవార్డులు. వారం చివరిలో వ్యయప్రయాసలు. ధనవ్యయం. ఆరోగ్యభంగం.
కర్కాటకం (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
రుణ ఒత్తిడుల నుంచి బయటపడతారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. వాహనయోగం. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. ఇంటాబయటా అనుకూల వాతావరణం. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు దక్కుతాయి. పారిశ్రామికరంగం వారికి యోగదాయకమైన కాలం. వారం చివరిలో ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యభంగం.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.)
కొత్త పనులు ప్రారంభిస్తారు. ఇంటర్వ్యూలు అందుతాయి. విద్యార్థుల పరిశోధనలు ఫలిస్తాయి. ఆర్థిక పరిస్థితి సంతృప్తినిస్తుంది. కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు. వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు. రాజకీయవర్గాలకు నూతనోత్సాహం. వారం మధ్యలో దూరప్రయాణాలు. అనారోగ్యం. కుటుంబంలో చికాకులు.
కన్య (ఉత్తర 2,3,4పా, హస్త, చిత్త1,2పా.,)
అనుకున్న సమయానికి డబ్బు అందుతుంది. శ్రమ ఫలిస్తుంది. గృహ నిర్మాణయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. కొన్ని వివాదాలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. సేవలకు తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు ఊపందుకుంటాయి, లాభాలు రాగలవు. ఉద్యోగులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. కళారంగం వారికి పురస్కారాలు. వారం చివరిలో ధనవ్యయం. బంధువులతో వివాదాలు.
తుల (చిత్త 3,4పా, స్వాతి, విశాఖ1,2,3పా.)
ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. దూరపు బంధువులతో ఉత్తరప్రత్యుత్తరాలు. వాహనయోగం. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగులకు విధి నిర్వహణలో అవాంతరాలు తొలగుతాయి. రాజకీయవర్గాలకు మంచి గుర్తింప. వారం ప్రారంభంలో అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. ప్రయాణాలు వాయిదా.
వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ)
కొత్త పనులు సాఫీగా పూర్తి చేస్తారు. రుణబాధలు తొలగుతాయి. శ్రమ ఫలించే సమయం. ఒక లేఖ ద్వారా ఉపయుక్తమైన సమాచారం. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఉద్యోగులకు ఉన్నత హోదాలు రాగలవు. కళాకారులకు నూతనోత్సాహం. వారం ప్రారంభంలో దూరప్రయాణాలు. అనారోగ్యం.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1పా.)
ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. బంధువులతో స్వల్ప వివాదాలు. ఆస్తి వ్యవహారాలలో చికాకులు. ఇంటి నిర్మాణయత్నాలు నత్తనడకన సాగుతాయి. విద్యార్థులు, నిరుద్యోగులకు కాస్త నిరుత్సాహం. వ్యాపార లావాదేవీలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలి. కళారంగం వారు నిర్ణయాలలో తొందరపడరాదు. వారం ప్రారంభంలో ధన, వస్తు లాభాలు.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1,2పా.)
కొత్త పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. శ్రమకు ఫలితం కనిపిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. మీ ఆశయాలు నెరవేరే సమయం. వాహనాలు, భూములు కొంటారు. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. కళారంగం వారికి సన్మానాలు. వారం చివరిలో అనుకోని ప్రయాణాలు. రుణయత్నాలు.
కుంభం (ధనిష్ట 3,4పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పా.)
ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరం. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు సానుకూలమవుతాయి. విద్యార్థుల కృషి ఫలిస్తుంది. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు రాగలవు. పారిశ్రామికరంగం వారికి నూతనోత్సాహం. వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్యం. శ్రమాధిక్యం.
మీనం (పూర్వాభాద్ర 4పా., ఉత్తరాభాద్ర, రేవతి)
దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొన్ని వివాదాల నుంచి బయటపడి ఊపిరి పీల్చుకుంటారు. ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. వస్తు, వస్త్రలాభాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు కొత్త ఆశలు. రాజకీయవర్గాలకు ప్రజాదరణ పెరుగుతుంది. వారం మధ్యలో ధనవ్యయం. బంధువులతో వివాదాలు.
ఈ వారం రాశి ఫలాలు
Published Sun, May 4 2014 12:46 PM | Last Updated on Sat, Sep 2 2017 6:55 AM
Advertisement
Advertisement