వారఫలాలు : 12 జూన్ నుంచి 18జూన్, 2016 వరకు | varaphalalu | Sakshi
Sakshi News home page

వారఫలాలు : 12 జూన్ నుంచి 18జూన్, 2016 వరకు

Published Sun, Jun 12 2016 2:53 AM | Last Updated on Mon, Sep 4 2017 2:15 AM

వారఫలాలు : 12 జూన్ నుంచి 18జూన్, 2016 వరకు

వారఫలాలు : 12 జూన్ నుంచి 18జూన్, 2016 వరకు

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
పనులలో పురోగతి సాధిస్తారు. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు నెలకొన్నా సర్దుబాటు కాగలవు.  శ్రమకు ఫలితం అందుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులు సహాయపడతారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. రాజకీయవర్గాలకు సన్మానాలు. నేరేడు, తెలుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. అన్నపూర్ణాష్టకం పఠించండి.
 
వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోిహ ణి, మృగశిర 1,2 పా.)
ఉత్సాహంగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. సంఘంలో ఆదరణ పొందుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆకస్మిక ధనలబ్ధి. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు. ఉద్యోగాలలో పురోగతి కనిపిస్తుంది. కళాకారులకు నూతనోత్సాహం. పసుపు, ఆకుపచ్చ రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. రామరక్షాస్తోత్రం పఠించండి.
 
మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
పనులలో స్వల్ప ఆటంకాలు ఎదురవుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. పాత మిత్రులను కలుసుకుంటారు. నూత న పరిచయాలు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. ఆలయాలు సందర్శిస్తారు. సంఘంలో గౌరవప్రతిష్టలు ఇనుమడిస్తాయి. వ్యాపారాలు లాభదాయకంగా సాగుతాయి. ఉద్యోగులకు ఒత్తిడులు తొలగుతాయి. పారిశ్రామికవేత్తలకు ఉత్సాహంగా ఉంటుంది. ఎరుపు, చాక్లెట్ రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీస్తోత్రాలు పఠించండి.
 
కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. ఇంటాబయటా ఒత్తిడులు పెరుగుతాయి. బంధువులతో మాటపట్టింపుల వల్ల మనశ్శాంతి లోపిస్తుంది. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆరోగ్యభంగం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృథా శ్రమ తప్ప ఫలితం కనిపించదు. వ్యాపార లావాదేవీలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు తప్పకపోవచ్చు. రాజకీయవర్గాలకు నిరాశ తప్పదు. ఆకుపచ్చ, నేరేడు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం చేయండి.
 
సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు తీరి ఊరట చెందుతారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విందువినోదాలతో ఉల్లాసంగా గడుపుతారు. నూతన ఉద్యోగయోగం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో పదోన్నతి అవకాశాలు. రాజకీయవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. ఎరుపు, లేత పసుపు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్ చాలీసా పఠించండి.
 
కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
ఆర్థిక లావాదేవీలు ఉత్సాహవంతంగా ఉంటాయి. పనులు సజావుగా పూర్తి చేస్తారు. బంధువులతో విభేదాలు తొలగిపోతాయి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. వాహనయోగం. చిరకాల స్వప్నం నెరవేరుతుంది. నూతన వస్తు, వస్త్రలాభాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు కొత్త హోదాలు. కళాకారులు తమ ప్రతిభను చాటుకుంటారు. తెలుపు, లేత ఎరుపు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి.
 
తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
ముఖ్యమైన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. దూరపు బంధువులను కలుసుకుంటారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు పనిభారం తగ్గి ఊరట లభిస్తుంది. పారిశ్రామికవర్గాలకు సన్మానాలు, విదేశీ పర్యటనలు. నీలం, నేరేడు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి.
 
వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆత్మీయులు మరింత దగ్గరవుతారు. మీలోని ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ఇబ్బందులు తొలగుతాయి. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. రాజకీయవర్గాలకు పదవులు దక్కవచ్చు. గులాబి, చాక్లెట్ రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. కనకదుర్గా స్తోత్రాలు పఠించండి.
 
ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
ప్రారంభంలో కొద్దిపాటి చికాకులు నెలకొన్నా క్రమేపీ తొలగుతాయి. ప్రముఖుల నుంచి కీలక సమాచారం. చేపట్టిన కార్యక్రమాలు సజావుగా పూర్తి చేస్తారు.  రాబడి సంతృప్తినిస్తుంది. ఆస్తి వివాదాలు తీరి ఊపిరి పీల్చుకుంటారు. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు రాగలవు. వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో పురోగతి. ఉద్యోగులకు ఉన్నతహోదాలు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. ఎరుపు, తెలుపు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి.
 
మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
ఆర్థిక పరిస్థితి కొంత అనుకూలిస్తుంది. పనులు నిదానంగా పూర్తి చేస్తారు. బంధువులు, మిత్రులతో స్వల్ప వివాదాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. దూరప్రాంతాల నుంచి ముఖ్య సమాచారం అందుకుంటారు. వివాహ, ఉద్యోగయత్నాలు కొంత నిరాశ కలిగిస్తాయి. వ్యాపారాలు సామాన్యంగా లాభిస్తాయి. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు. రాజకీయవర్గాలకు పర్యటనలు వాయిదా. నీలం, నలుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం.  దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.
 
కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
అనుకున్న పనుల్లో కొద్దిపాటి ఆటంకాలు. ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి. ఆత్మీయులతో మాటపట్టింపులు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. విద్య, ఉద్యోగయత్నాలు కొంత నిరుత్సాహపరుస్తాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. ఉద్యోగులకు ఒక సమాచారం ఊరటనిస్తుంది. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు. చాక్లెట్, లేత ఆకుపచ్చ రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.
 
మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆత్మీయులు, బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. ప్రతిభను చాటుకుంటారు. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. ఆలోచనలు అమలు చేస్తారు. వివాహయత్నాలు సానుకూలం. వాహనయోగం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో లాభాలు, విస్తరణయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. కళాకారులకు ఆహ్వానాలు రాగలవు. గులాబి, ఎరుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. నృసింహస్తోత్రాలు పఠించండి.
- సింహంభట్ల సుబ్బారావు, జ్యోతిష్య పండితులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement