వారఫలాలు : 29 మే నుంచి 4 జూన్, 2016 వరకు
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
బంధువుల ద్వారా ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ఆర్థిక ఇబ్బందుల నుంచి ఉపశమనం లభిస్తుంది. కొన్ని బాకీలు వసూలవుతాయి. ఆస్తి వివాదాలు కొలిక్కివచ్చే అవకాశం. విద్య, ఉద్యోగావకాశాలు దక్కుతాయి. వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి. ఉద్యోగులకు ఒత్తిడులు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. పసుపు, లేత ఆకుపచ్చ రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి.
వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోిహ ణి, మృగశిర 1,2 పా.)
ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. నిరుద్యోగులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. అనుకున్న పనులు కొంత నిదానంగా సాగుతాయి. ఒక సమాచారం ఊరట కలిగిస్తుంది. వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు ఒక సమస్య పరిష్కారమవుతుంది. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు. లేతనీలం, చాక్లెట్ రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. నృసింహస్తోత్రాలు పఠించండి.
మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
కొన్ని పనులు కొంత నెమ్మదిస్తాయి. ఆదాయం పెరిగినా ఖర్చులు కూడా అదేస్థాయిలో ఉంటాయి. దూరపు బంధువుల రాకతో ఉత్సాహంగా గడుపుతారు. స్వల్ప అనారోగ్యం. తీర్థయాత్రలు చేస్తారు. కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. వ్యాపారాలలో కొద్దిపాటి లాభాలు. ఉద్యోగుల శ్రమ ఫలిస్తుంది. కళాకారులకు సత్కారాలు, విదేశీ పర్యటనలు. పసుపు, ఆకుపచ్చ రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. కనకదుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.
కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
ప్రారంభంలో కుటుంబ సమస్యలు కొంత చికాకు పరిచినా సర్దుబాటు కాగలవు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. ఇతరుల నుంచి రావలసిన సొమ్ము అందుతుంది. పనులు సకాలంలోనే పూర్తి కాగలవు. ఆస్తుల విషయంలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. శుభకార్యాలకు హాజరవుతారు. వ్యాపారాలు గతం కంటే పుంజుకుంటాయి. ఉద్యోగులకు హోదాలు పెరిగే అవకాశం. పారిశ్రామికవర్గాలకు ప్రభుత్వం నుంచి ఆహ్వానాలు. లేతపసుపు, తెలుపు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీస్తుతి మంచిది.
సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
చేపట్టిన కార్యక్రమాలు శ్రమానంతరం పూర్తి కాగలవు. దూరపు బంధువులను కలుసుకుని ముఖ్య విషయాలు చర్చిస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. రాబడి ఆశాజనకమే. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. విద్యార్థులు, నిరుద్యోగులను విజయాలు వరిస్తాయి. వాహనయోగం. వ్యాపారాలు కొంత మేరకు లాభిస్తాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు రాగలవు. రాజకీయవర్గాలకు సంతోషకరమైన సమాచారం. ఎరుపు, చాక్లెట్ రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. అంగారకస్తోత్రం పఠించండి.
కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విద్యావకాశాలు దగ్గరకు వస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. బంధువులు, మిత్రులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. వాహన, గృహయోగాలు. వ్యాపారాలలో పెట్టుబడులు పెరుగుతాయి. ఉద్యోగులకు కొత్త ఆశలు. కళాకారులకు కొన్ని అవకాశాలు దగ్గరకు వస్తాయి. పసుపు, లేత ఆకుపచ్చ రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.
తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
పనులు చకచకా పూర్తి కాగలవు. ఆర్థికంగా గతం కంటే మెరుగ్గా ఉంటుంది. వాహనాలు, భూములు కొనుగోలు చేసే అవకాశముంది. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తిలాభ సూచనలు. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు రాగలవు. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు. నీలం, నేరేడు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్ చాలీసా పఠించండి.
వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
కొన్ని వివాదాలు పరిష్కారదశకు చేరతాయి. ఒక సమాచారం కొంత ఊరట కలిగిస్తుంది. రాబడి, ఖర్చులు సమానంగా ఉంటాయి. స్థిరాస్తి విషయంలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. వాహనయోగం. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన. ఉద్యోగులకు ఒత్తిడుల నుంచి ఉపశమనం. పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం. ఎరుపు, బంగారు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.
ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
పనులు కొంత నెమ్మదిస్తాయి. ఆర్థికంగా ఇబ్బందులు ఏర్పడినా అధిగమిస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడవచ్చు. గృహం, వాహనాలు కొనుగోలు యత్నాలలో పురోగతి కనిపిస్తుంది. తీర్థయాత్రలు చేస్తారు. ఒక ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. దూరపు బంధువులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. వ్యాపారాలలో స్వల్పలాభాలు. ఉద్యోగులకు పనిభారం నుంచి విముక్తి. కళాకారులకు ప్రయత్నాలు కొంత సఫలమవుతాయి. గులాబి, తెలుపు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్‌స్తోత్రాలు పఠించండి.
మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
అనుకున్న పనులలో అవాంతరాలు. బంధుమిత్రుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు నెలకొంటాయి. విలువైన వస్తువులు భద్రంగా చూసుకోండి. ఆరోగ్యపరంగా కొద్దిపాటి చికాకులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో కొన్ని ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఉద్యోగులకు పనిఒత్తిడులు. రాజకీయవర్గాల వారు పర్యటనలు వాయిదా వేస్తారు. నీలం, నేరేడు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాస్తోత్రాలు పఠించండి.
కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
పనుల్లో విజయం. విద్యార్థులు, నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. రావలసిన డబ్బు చేతికందుతుంది. బంధువర్గంతో వివాదాలు తీరతాయి. ప్రముఖుల నుంచి కీలక సమాచారం. ఇంటి నిర్మాణయత్నాలలో పురోగతి ఉంటుంది. వేడుకల్లో పాల్గొంటారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు బాధ్యతలు మరింతగా పెరుగుతాయి. కళాకారుల యత్నాలు కలిసి వస్తాయి. నలుపు, ఆకుపచ్చరంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి.
మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఒక ప్రకటన నిరుద్యోగులకు ఉత్సాహాన్నిస్తుంది. ఎంతోకాలంగా వేధిస్తున్న సమస్య నుంచి బయటపడతారు. ఆరోగ్యం కొంత మందగిస్తుంది. వాహనయోగం. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలలో అడుగు ముందుకు వేస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు. రాజకీయవర్గాలకు పదవులు వరించే సూచనలు. గులాబి, లేతఎరుపు రంగులు, దక్షిణదిశప్రయాణాలు సానుకూలం. కనకధారా స్తోత్రం పఠించండి.
- సింహంభట్ల సుబ్బారావు, జ్యోతిష్య పండితులు