వారఫలాలు : 22 మే నుంచి 28మే, 2016 వరకు
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. కొన్ని సమస్యలను నేర్పుగా పరిష్కరించుకుంటారు. ఆహ్వానాలు అందుతాయి. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. వాహనయోగం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు కొత్త హోదాలు రాగలవు. పారిశ్రామికవర్గాలకు సంతోషక రమైన సమాచారం. పసుపు, నేరేడు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి.
వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోిహ ణి, మృగశిర 1,2 పా.)
అవసరాలకు డబ్బు అందుతుంది. పనులు కొంత నెమ్మదిస్తాయి. బంధువులతో ముఖ్య విషయాలపై చర్చలు జరుపుతారు. ఆరోగ్యం మందగిస్తుంది. తీర్థయాత్రలు చేస్తారు. కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు సామాన్యంగా లాభిస్తాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు తప్పకపోవచ్చు. రాజకీయవర్గాలకు పర్యటనలు వాయిదా. ఎరుపు, ఆకుపచ్చ రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి.
మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
కొత్త పనులు ప్రారంభిస్తారు. సేవాకార్యక్రమాలు, వేడుకలలో పాల్గొంటారు. రావలసిన సొమ్ము అందుకుంటారు. ఒక సమస్య నుంచి బయటపడతారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు కలిసి వస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. కళాకారులకు సన్మానాలు. పసుపు, లేత ఎరుపురంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దత్తాత్రేయస్తోత్రాలు పఠించండి.
కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
కొత్త వ్యక్తుల పరిచయం. శుభకార్యాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులు, మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. స్వల్ప అనారోగ్యం. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. నూతన విద్య, ఉద్యోగావకాశాలు దక్కుతాయి. వాహనయోగం. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు. చాక్లెట్, లేత పసుపు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్ చాలీసా పఠించండి.
సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
పనులు శ్రమానంతరం పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. భూవివాదాలు పరిష్కారమవుతాయి. పాతమిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. పలుకుబడి కలిగిన వారితో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థులు, నిరుద్యోగులకు శుభవార్తలు. వ్యాపారవృద్ధి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు. పారిశ్రామికవర్గాలకు అంచనాలు నిజమవుతాయి. ఎరుపు, లేత ఆకుపచ్చ రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవికి కుంకుమార్చన చేయండి.
కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులు, మిత్రులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. ముఖ్యమైన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. వివాహ, ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు రాగలవు. కళాకారులకు అవార్డులు దక్కవచ్చు. గులాబి, నేరేడు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.
తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఆస్తి వ్యవహారాలలో కావాల్సిన వారితో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. విద్యార్థులకు కొంత నిరాశ ఎదురుకావచ్చు. వాహనాలు, ఆరోగ్య విషయంలో కొంత మెలకువ అవసరం. వ్యాపార లావాదేవీలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. పారిశ్రామికవర్గాలకు పర్యటనల్లో మార్పులు. నీలం, చాక్లెట్ రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.
వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
ఈ వారం పట్టింది బంగారమే అన్నట్టుంటుంది. శుభవార్తలు. సన్నిహితులతో విభేదాలు తొలగుతాయి. తండ్రి తరఫు వారి నుంచి ఆహ్వానాలు రావచ్చు. స్థిరాస్తి వృద్ధి. కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు అనుకోని హోదాలు తథ్యం. కళాకారులకు సంతోషకరమైన సమాచారం. ఎరుపు, లేత ఆకుపచ్చ రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారాస్తోత్రం పఠించండి.
ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. సంఘంలో గౌరవం పొందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు కలిసి వస్తాయి. ఎంతోకాలంగా వేధిస్తున్న సమస్య తీరుతుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు దక్కుతాయి. రాజకీయవర్గాలకు పదవులు దగ్గరకు రాగలవు. పసుపు, గులాబి రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్ అర్చనలు చేయండి.
మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
అదనపు ఆదాయం సమకూరుతుంది. రుణబాధలు తొలగుతాయి. బంధువులు, మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఎంతటివారినైనా మాటలతో ఆకట్టుకుంటారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. సంఘంలో కీర్తిప్రతిష్ఠలు మరింతగా పెరుగుతాయి. వాహనయోగం. పుణ్యక్షేత్రాల సందర్శనం. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. నీలం, ఆకుపచ్చ రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. రాఘవేంద్రస్వామి స్తోత్రాలు పఠించండి.
కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొన్ని వివాదాలు, సమస్యల నుంచి బయటపడతారు. మిత్రులతో ఉత్తర ప్రత్యుత్తరాలు సాగిస్తారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు, నిరుద్యోగుల నిరీక్షణ ఫలిస్తుంది. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు. కళాకారుల యత్నాలలో పురోగతి కనిపిస్తుంది. నలుపు, లేత ఆకుపచ్చ రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.
మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు. రాబడి మరింతగా పెరుగుతుంది. ఇతరుల సహాయంతో కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. స్థిరాస్తి విషయంలో ఒప్పందాలు కుదురుతాయి. ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. నిరుద్యోగులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఉద్యోగులకు శుభవార్తలు అందుతాయి. రాజకీయవర్గాలకు ఊహించని పిలుపురావచ్చు. గులాబి, బంగారు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం.
- సింహంభట్ల సుబ్బారావు, జ్యోతిష్య పండితులు