
సౌరబలం (ఆగస్టు 11 నుండి 17 వరకు)
మేషం (మార్చి 21-ఏప్రిల్ 20)
కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. శుభకార్యాలలో పాలుపంచుకుంటారు. మీ ఊహలు నిజం కాగల సమయం. ఆస్తుల వివాదాలు కొలిక్కి వస్తాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. దూరపు బంధువుల నుంచి ఆహ్వానాలు. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. కళాకారులకు సన్మానయోగం. వారం చివరిలో ధనవ్యయం. అనారోగ్యం.
వృషభం (ఏప్రిల్ 21-మే 20)
విద్యార్థులకు అనుకూల ఫలితాలు. పనుల్లో విజయం. శుభవార్తలు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. బంధువులు, మిత్రుల చేయూత లభిస్తుంది. వాహనయోగం. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం. ఆలయాలు సందర్శిస్తారు. వారం మధ్యలో వివాదాలు. ఆరోగ్యభంగం.
మిథునం (మే 21-జూన్ 21)
ముఖ్యమైన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగ యత్నాలు సానుకూలం. బంధువర్గంతో వివాదాలు సర్దుబాటు కాగలవు. ఆస్తుల వ్యవహారంలో అగ్రిమెంట్లు. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి. కళాకారులకు పురస్కారాలు. వారం ప్రారంభంలో ధనవ్యయం.
కర్కాటకం (జూన్ 22-జూలై 23)
పనులు నిదానంగా సాగుతాయి. బంధువులతో వివాదాలు. ఆర్థిక లావాదేవీలు మందగించినా అవసరాలు తీరతాయి. ఆలోచనలు కలసివస్తాయి. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. రాజకీయవర్గాలకు పదవీయోగం. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం.
సింహం (జూలై 24-ఆగస్టు 23)
ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగించవచ్చు. రుణయత్నాలు. ఒప్పందాలు వాయిదా వేస్తారు. బాధ్యతలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆరోగ్యభంగం. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు. కళాకారులకు నిరుత్సాహం. వారం చివరిలో విందువినోదాలు. కుటుంబసౌఖ్యం.
కన్య (ఆగస్టు 24-సెప్టెంబర్ 23)
సంఘంలో ఆదరణ. ప్రముఖులతో పరిచయాలు. నిరుద్యోగులకు శుభవార్తలు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. రుణబాధలు తొలగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు సన్మానయోగం. వారం మధ్యలో అనారోగ్యం. పనుల్లో ఆటంకాలు.
తుల (సెప్టెంబర్ 24-అక్టోబర్ 23)
కొత్త పనులు ప్రారంభిస్తారు. ఆస్తి వివాదాలు తీరతాయి. అనుకున్నది సాధించాలన్న తపనతో ముందుకు సాగుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలలో పురోగతి కనిపిస్తుంది. కళాకారులకు నూతన అవకాశాలు. వారం చివరిలో దూరప్రయాణాలు. రుణయత్నాలు.
వృశ్చికం (అక్టోబర్ 24-నవంబర్ 22)
అప్రయత్నంగా పనులు పూర్తి. సంఘంలో గౌరవమర్యాదలు. ఆకస్మిక ధనలాభం. శుభకార్యాలకు ఖర్చు చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. షేర్ల విక్రయాలలో లాభాలు. వారం మధ్యలో కుటుంబంలో చికాకులు. ధనవ్యయం.
ధనుస్సు (నవంబర్ 23-డిసెంబర్ 21)
ఆర్థిక లావాదేవీల్లో చికాకులు తొలగుతాయి. పనులు సజావుగా సాగుతాయి. బంధువులు, మిత్రుల సహాయం అందుతుంది. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలలో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. కళాకారులకు సన్మానయోగం. వారం చివరిలో ఆస్తి వివాదాలు. ఆరోగ్యభంగం.
మకరం (డిసెంబర్ 22-జనవరి 20)
ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి శుభవార్తలు. దూరప్రయాణాలు. రుణబాధలు తొలగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వాహనాలు, ఇళ్లు కొనుగోలు చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు అధిగమిస్తారు. పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం. వారం ప్రారంభంలో ధనవ్యయం. మిత్రులతోమాటపట్టింపులు.
కుంభం (జనవరి 21-ఫిబ్రవరి 19)
అవసరాలకు డబ్బు అందుతుంది. పనులు నిదానంగా సాగుతాయి. బంధువులను కలుసుకుని ముఖ్య విషయాలు చర్చిస్తారు. అందరిలోనూ గుర్తింపు. వ్యాపార, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు. కళాకారులకు విదేశీ పర్యటనలు. వారం చివరిలో మిత్రులతో వివాదాలు. అనారోగ్యం.
మీనం (అధిపతి గురువు, ఫిబ్రవరి 20-మార్చి 20)
పనులు పూర్తి కాగలవు. బంధువులు, మిత్రులతో ఉత్తరప్రత్యుత్తరాలు. ఆశ్చర్యకరమైన సంఘటనలు. వివాదాల నుంచి బయటపడతారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తినిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో పురోగతి. పారిశ్రామికవర్గాలకు కార్యజయం. వారం మధ్యలో చికాకులు. ధనవ్యయం.
ఈ వారంలో పుట్టినరోజు జరుపుకునేవారికి...
మీ అంచనాలు, ఊహలు నిజం చేసుకుంటారు. ప్రయత్నాలు ఫలించి ముందుకు సాగుతారు. కొన్ని వివాదాలు ఓర్పుతో పరిష్కరించుకుంటారు. ఎంతోకాలంగా పెండింగ్‌లో ఉన్న కోర్టు వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. ప్రత్యర్థులు మీదారికి వస్తారు. వాహనాలు, గృహం వంటివి సమకూర్చుకుంటారు. ద్వితీయార్థంలో కొంత చికాకులు. ప్రయాణాలు ఉండవచ్చు.
మీతో పాటు ఈ వారం పుట్టినరోజు జరుపుకుంటోన్న సెలెబ్రిటీ...
మనీషా కొయిరాలా
పుట్టినరోజు: ఆగస్టు 16
- సింహంభట్ల సుబ్బారావు