
సౌరబలం: సెప్టెంబర్29 నుండి అక్టోబర్ 5 వరకు
మేషం (మార్చి 21-ఏప్రిల్ 20)
ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. బాధ్యతలు పెరుగుతాయి. పనులు నెమ్మదిగా సాగుతాయి. సోదరులు, మిత్రులతో వివాదాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. ఆరోగ్యభంగం. వ్యాపార, ఉద్యోగాలలో కొన్ని మార్పులు. కళాకారులకు కొంత గందరగోళంగా ఉంటుంది. వారం చివరిలో ధన, వస్తులాభాలు. విందువినోదాలు.
వృషభం (ఏప్రిల్ 21-మే 20)
ముఖ్యమైన కార్యక్రమాలు మందగిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. రుణాలు చేస్తారు. బంధువులతో స్వల్ప వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఇంటి నిర్మాణయత్నాలు వాయిదా వేస్తారు. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. రాజకీయవర్గాలకు ఒత్తిడులు. వారం మధ్యలో వాహనయోగం.
మిథునం (మే 21-జూన్ 21)
కొన్ని పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం. దూరప్రయాణాలు. కుటుంబంలో చికాకులు. నిరుద్యోగులకు శ్రమాధిక్యం. ఆలోచనలు కలిసిరావు. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహం. వారం చివరిలో ఆస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు.
కర్కాటకం (జూన్ 22-జూలై 23)
కొత్త పనులు చేపడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితుల సాయం అందుతుంది. ఇంటిలో శుభకార్యాలు. విద్యార్థులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆటంకాలు తొలగుతాయి. గృహ, వాహనయోగాలు. వారం మధ్యలో ధనవ్యయం. అనుకోని ప్రయాణాలు.
సింహం (జూలై 24-ఆగస్టు 23)
పనుల్లో జాప్యం. ఆర్థిక లావాదేవీలు అంతంత మాత్రం. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. వ్యాపార, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి. స్థిరాస్తి వివాదాలు. దూరపు బంధువులతో ఉత్తరప్రత్యుత్తరాలు. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. వారం ప్రారంభంలో శుభకార్యాలు. ఆకస్మిక ధన, వ స్తులాభాలు.
కన్య (ఆగస్టు 24-సెప్టెంబర్ 23)
శుభకార్యాలలో పాల్గొంటారు. పనులు చకచకా సాగుతాయి. కుటుంబ సమస్యలు తీరతాయి. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవమర్యాదలు. విద్యార్థులకు సాంకేతిక విద్యావకాశాలు. కళాకారులకు విదేశీ పర్యటనలు. వారం చివరిలో వివాదాలు. ఆరోగ్యభంగం.
తుల (సెప్టెంబర్ 24-అక్టోబర్ 23)
ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. రుణాలు తీరతాయి. ఇంటి నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. భూవివాదాల పరిష్కారం. విద్యార్థులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలలో పురోగతి కనిపిస్తుంది. వారం మధ్యలో ధనవ్యయం. దూరప్రయాణాలు.
వృశ్చికం (అక్టోబర్ 24-నవంబర్ 22)
పనులు పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో వివాదాల పరిష్కారం. రావలసిన సొమ్ము అంది అవసరాలు తీరతాయి. కుటుంబంలో ఒత్తిడులు తొలగుతాయి. వ్యాపార, ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. వారం మధ్యలో ప్రయాణాలు. ఆస్తి వివాదాలు.
ధనుస్సు (నవంబర్ 23-డిసెంబర్ 21)
ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం. ఇంటాబయటా బాధ్యతలు పెరుగుతాయి. దూరప్రయాణాలు చేస్తారు. ఆరోగ్యభంగం. శ్రమ పెరుగుతుంది. బంధువులతో వివాదాలు. వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా. వారం చివరిలో శుభకార్యాలు. వాహనయోగం.
మకరం (డిసెంబర్ 22-జనవరి 20)
రుణయత్నాలు. ప్రయాణాలు వాయిదా పడతాయి. సోదరులు, మిత్రులతో స్వల్ప వివాదాలు. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. ఉద్యోగయత్నాలు మందగిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. వారం మధ్యలో ప్రారంభంలో విందువినోదాలు. ప్రముఖులతో పరిచయాలు.
కుంభం (జనవరి 21-ఫిబ్రవరి 19)
కొత్త కార్యక్రమాలు చేపడతారు. విందువినోదాలు. వాహనయోగం. మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వివాదాల నుంచి బయటపడతారు. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. విద్యార్థులకు నూతన అవకాశాలు. వారం చివరిలో వ్యయప్రయాసలు. ఆరోగ్యభంగం.
మీనం (అధిపతి గురువు, ఫిబ్రవరి 20-మార్చి 20)
పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. భూవివాదాలు తీరతాయి. సంఘంలో గౌరవం. చర్చలు ఫలిస్తాయి. ఇంటి నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి, వ్యాపారాలలో అనుకూలత. వారం మధ్యలో ధనవ్యయం. ఇంటా బయటా బాధ్యతలు. దైవదర్శనాలు.
- సింహంభట్ల సుబ్బారావు, జ్యోతిష పండితులు
మీతో పాటు ఈ వారం పుట్టినరోజు జరుపుకుంటోన్న సెలెబ్రిటీ...
ఖుష్బూ
పుట్టినరోజు: సెప్టెంబర్ 29
ఈ వారంలో పుట్టినరోజు జరుపుకునేవారికి...
ఆర్థిక లావాదేవీలు కొంత అనుకూలిస్తాయి. పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. సత్తా చాటుకుని ముందుకు సాగుతారు. కొన్ని వివాదాలు తీరతాయి. అందరికీ ఆదర్శవంతంగా నిలుస్తారు. భూములు, భవనాలు కొనుగోలు చేస్తారు. ప్రత్యర్థులను ఆకట్టుకుని ముందడుగు వేస్తారు. ఆరోగ్యపరంగా కొద్దిపాటి చికాకులు. ద్వితీయార్థంలో మరింత అనుకూలం.