
సౌరబలం: ఆగస్టు18 నుండి 24 వరకు
మేషం (మార్చి 21-ఏప్రిల్ 20)
ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. సోదరులు, మిత్రుల చేయూతతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వివాదాల నుంచి బయటపడతారు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు రాగలవు. వారం ప్రారంభంలో అనారోగ్యం.
వృషభం (ఏప్రిల్ 21-మే 20)
ఆర్థిక లావాదేవీలు కొంత నిరాశ కలిగించినా క్రమేపీ అనుకూలిస్తాయి. రుణదాతల ఒత్తిడులు తప్పవు. బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఇతరులకు సహాయపడతారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. తీర్థయాత్రలు. విద్యార్థులు లక్ష్యాలు సాధిస్తారు. వారం మధ్యలో చికాకులు. ఆరోగ్యభంగం.
మిథునం (మే 21-జూన్ 21)
కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆత్మీయుల నుంచి పిలుపు రావచ్చు. అందరిలోనూ ప్రత్యేకత చాటుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కొన్ని రుణాలు కూడా తీరతాయి. రాజకీయవర్గాలకు పదవీయోగం. వారం చివరిలో వ్యయప్రయాసలు. దూరప్రయాణాలు.
కర్కాటకం (జూన్ 22-జూలై 23)
సన్నిహితుల నుంచి ధనలాభం. ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మీ ప్రతిభ చాటుకుంటారు. ఇంటా బయటా మీదే పైచేయి. పనులు సాఫీగా పూర్తి కాగలవు. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. విద్యార్థులకు ఉత్తమ ఫలితాలు. వారం చివరిలో ఖర్చులు, కుటుంబసభ్యులతో వివాదాలు.
సింహం (జూలై 24-ఆగస్టు 23)
పరిచయాలు పెరుగుతాయి. ఎంతటి కార్యాన్నైనా పట్టుదలతో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవమర్యాదలు పొందుతారు. ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. వస్తులాభాలు. వ్యాపార, ఉద్యోగాలలో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. వారం ప్రారంభంలో ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యభంగం.
కన్య (ఆగస్టు 24-సెప్టెంబర్ 23)
కొత్త పనులకు శ్రీకారం. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. గృహ నిర్మాణయత్నాలు ఫలిస్తాయి. ఒక ప్రకటన నిరుద్యోగులను ఆకట్టుకుంటుంది. వృత్తి, వ్యాపారాలలో పురోగతి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. విందువినోదాలు. వారం మధ్యలో చికాకులు. బంధువులతో వివాదాలు.
తుల (సెప్టెంబర్ 24-అక్టోబర్ 23)
పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి రుణాలు తీరుస్తారు. కాంట్రాక్టులు చేపడతారు. ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. సంఘంలో గౌరవం. వృత్తి, వ్యాపారాలు సంతృప్తినిస్తాయి. పదవీయోగం, సన్మానాలు. వారం చివరిలో వివాదాలు. ఆరోగ్యభంగం.
వృశ్చికం (అక్టోబర్ 24-నవంబర్ 22)
ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. కుటుంబసభ్యులతో వివాదాలు. దూరప్రయాణాలు. శ్రమాధిక్యం. సోదరులతో ఉత్తరప్రత్యుత్తరాలు. విద్యార్థులకు కొంత నిరాశ. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. వారం మధ్యలో ఆర్థిక, వస్తులాభాలు.
ధనుస్సు (నవంబర్ 23-డిసెంబర్ 21)
నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. సోదరులు, సోదరీలతో విభేదాలు తొలగుతాయి. అనుకున్నది సాధించాలన్న పట్టుదల పెరుగుతుంది. పరిచయాలు పెరుగుతాయి. ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది. వ్యాపార, ఉద్యోగాలలో ఒడిదుడుకులు అధిగమిస్తారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. వారం చివరిలో ఆరోగ్యభంగం. దూరప్రయాణాలు.
మకరం (డిసెంబర్ 22-జనవరి 20)
ప్రముఖులతో పరిచయాలు. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. మొండి బాకీలు వసూలవుతాయి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి కాగలవు. విద్యార్థులు ప్రతిభ నిరూపించుకుంటారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబసభ్యులతో వివాదాలు.
కుంభం (జనవరి 21-ఫిబ్రవరి 19)
ఆలోచనలు కలసివస్తాయి. ఆర్థిక లావాదేవీలలో చికాకులు తొలగుతాయి. మిత్రుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. వ్యాపార, ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం. పదోన్నతులు, పదవీయోగాలు. కొత్త ఉద్యోగాలలో ప్రవేశిస్తారు. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం.
మీనం (అధిపతి గురువు, ఫిబ్రవరి 20-మార్చి 20)
పట్టింది బంగారమే. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. ఇంటి నిర్మాణాల్లో ఆటంకాలు తొలగుతాయి. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. విద్యార్థులకు పురస్కారాలు. వృత్తి, వ్యాపారాలు ప్రగతి పథంలో సాగుతాయి. వారం మధ్యలో ఆస్తి వివాదాలు. అనారోగ్యం.
- సింహంభట్ల సుబ్బారావు
ఈ వారంలో పుట్టినరోజు జరుపుకునేవారికి...
సమస్యలు తీరి ఒడ్డున పడతారు. అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఆర్థిక విషయాలలో పురోగతి. ఇంటి నిర్మాణాలు పూర్తి చేస్తారు. అందరిలోనూ ప్రత్యేకతను చాటుకుంటారు. దీర్ఘకాలిక సమస్యను మిత్రుల సహకారంతో పరిష్కరించుకుంటారు. ఆరోగ్య సమస్యలు ఎదురైనా సర్దుబాటు కాగలవు. వివాహ, ఉద్యోగ యత్నాలు సానుకూలమవుతాయి.
మీతో పాటు ఈ వారం పుట్టినరోజు జరుపుకుంటోన్న సెలెబ్రిటీ...
భూమిక
పుట్టినరోజు: ఆగస్టు 21