
చంద్రబింబం: అక్టోబర్13 నుండి 19 వరకు
మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.)
పనుల్లో విజయం. పాతబాకీలు వసూలవుతాయి. సేవలకు తగిన గుర్తింపు పొందుతారు. స్థిరాస్తి వివాదాల పరిష్కారం. వాహన, గృహయోగాలు. దూరపు బంధువులతో ఉత్తరప్రత్యుత్తరాలు జరుపుతారు. వ్యాపారాల్లో లాభాలు. ఉద్యోగులకు ఉన్నత హోదాలు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. వారం మధ్యలో ధనవ్యయం. అనారోగ్యం.
వృషభం (కృత్తిక 2,3,4పా, రోిహ ణి, మృగశిర 1,2పా.)
చిరకాల స్వప్నం నెరవేరే సమయం. ఆర్థిక లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. దీర్ఘకాలిక సమస్యల నుంచి విముక్తి. ఒక ప్రకటన నిరుద్యోగులను ఆకట్టుకుంటుంది. వస్తులాభాలు. వ్యాపార, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. కళాకారులకు సన్మానయోగం. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. దూరప్రయాణాలు.
మిథునం (మృగశిర 3,4పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.)
ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. రుణబాధలు తొలగుతాయి. పలుకుబడి పెరుగుతుంది. విద్యార్థులకు మంచి ర్యాంకులు దక్కుతాయి. ప్రముఖులతో పరిచయాలు. వృత్తి, వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు. వారం చివరిలో ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం.
కర్కాటకం (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
ఆర్థిక వ్యవహారాలు కాస్త నిరాశ కలిగిస్తాయి. వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. బంధువులు, మిత్రులతో మాటపట్టింపులు. ఒప్పందాలు వాయిదా వేసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో మార్పులు. విద్యార్థులకు నిరుత్సాహం. వారం మధ్యలో శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.)
ఇంటిలో శుభకార్యాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. యుక్తితో కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. ఇంటి నిర్మాణయత్నాలు సాగిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం. విద్యార్థులు నూతన విద్యావకాశాలు పొందుతారు. వారం చివరిలో అనారోగ్యం. కుటుంబసభ్యులతో వివాదాలు.
కన్య (ఉత్తర 2,3,4పా, హస్త, చిత్త 1,2పా.,)
కొత్త పనులు ప్రారంభిస్తారు. సంఘంలో గౌరవమర్యాదలు. చిన్ననాటి మిత్రుల సహాయం పొందుతారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. వారం ప్రారంభంలో వివాదాలు. ధనవ్యయం.
తుల (చిత్త 3,4పా, స్వాతి, విశాఖ 1,2,3పా.)
పరిచయాలు పెరుగుతాయి. అనుకోని సంఘటనలు. విలువైన సమాచారం అందుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వాహనాలు, భూములు కొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలస్థితి. వారం మధ్యలో సోదరులతో వివాదాలు. ధనవ్యయం.
వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ)
ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఇంటిలో శుభకార్యాలు. సమస్యలు తీరి ఊపిరిపీల్చుకుంటారు. ఇంటి నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. వారం చివరిలో అనుకోని ప్రయాణాలు. ఆరోగ్యభంగం.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1పా.)
పనులు కొన్ని వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. అనారోగ్యం. బంధువులు, మిత్రులతో వివాదాలు. ఆస్తుల విషయంలో ఒత్తిడులు. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహం. విద్యార్థులకు కృషి కొంతమేరకు ఫలిస్తుంది. దూరప్రయాణాలు. వారం మధ్యలో విందువినోదాలు. భూ, గృహయోగాలు.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1,2పా.)
పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యత. ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. వాహనయోగం. పలుకుబడి పెరుగుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. విద్యార్థుల ఆశయాలు నెరవేరతాయి. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలస్థితి. వారం చివరిలో వ్యయప్రయాసలు. ధనవ్యయం.
కుంభం (ధనిష్ట 3,4పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పా.)
ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవమర్యాదలు. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సోదరులు, మిత్రులతో వివాదాలు తీరతాయి. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు. ఇంటర్వ్యూలు అందుతాయి. వారం మధ్యలో అనారోగ్యం. చికాకులు.
మీనం (పూర్వాభాద్ర 4పా., ఉత్తరాభాద్ర, రేవతి)
ముఖ్యమైన పనులలో విజయం. ప్రముఖులతో పరిచయాలు. సమస్యలు తీరతాయి. ఇంటి నిర్మాణ యత్నాలు ముమ్మరం చేస్తారు. విద్యార్థుల అంచనాలు నిజమవుతాయి. స్థిరాస్తి వృద్ధి. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం చివరిలో ధనవ్యయం.
- సింహంభట్ల సుబ్బారావు,
జ్యోతిష పండితులు
మీతో పాటు ఈ వారం పుట్టినరోజు జరుపుకుంటోన్న సెలెబ్రిటీ...
హేమామాలిని
పుట్టినరోజు: అక్టోబర్ 16
ఈ వారంలో పుట్టినరోజు జరుపుకునేవారికి...
పట్టుదలతో కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఆత్మీయుల సహాయం అందుకుంటారు. ఇంటి నిర్మాణ యత్నాలు సాగిస్తారు. శత్రువులు సైతం అనుకూలంగా మారతారు. ఆరోగ్యపరంగా కొద్దిపాటి చికాకులు తప్పవు. సోద రులతో విభేదాలు తొలగుతాయి. నిర్ణయాలలో ఆచితూచి వ్యవహరించండి. ద్వితీయార్థంలో మరింతగా అనుకూలమైన కాలం.