మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.)
ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి శుభవార్తలు అందుతాయి. స్థిరాస్తి విషయంలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. కుటుంబపరంగా నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారులకు లాభాలు అందుతాయి. ఉద్యోగస్తులు విధుల్లో ప్రశంసలు పొందుతారు. పారిశ్రామికరంగం వారికి నూతనోత్సాహం. వారం ప్రారంభంలో వివాదాలు, ధనవ్యయం. అనారోగ్యం.
వృషభం (కృత్తిక 2,3,4పా, రోిహ ణి, మృగశిర 1,2పా.)
పనుల్లో కొద్దిపాటి జాప్యం. ఆకస్మిక ప్రయాణాలు. ఆర్థిక విషయాలు నిరాశ కలిగించవచ్చు. గృహ నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. ప్రముఖుల నుంచి ముఖ్యసమాచారం. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు కొన్ని మార్పులు. రాజకీయరంగం వారికి నిరుత్సాహం. వారం చివరిలో శుభవార్తలు. ధనలాభం.
మిథునం (మృగశిర 3,4పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.)
పనులు చకచకా పూర్తి చేస్తారు. మీ సేవలకు గుర్తింపు లభిస్తుంది. ఆలయాలు సందర్శిస్తారు. గృహ, వాహనయోగాలు. ప్రముఖులతో చర్చలు ఫలిస్తాయి. విద్యార్థులు కొత్త లక్ష్యాలతో ముందుకు సాగుతారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు అనుకోని హోదాలు రాగలవు. పారిశ్రామికరంగం వారికి నూతనోత్సాహం. వారం మధ్యలో వివాదాలు. అనారోగ్యం. ప్రయాణాలు.
కర్కాటకం (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. ఇంటాబయటా మీదే పైచేయిగా ఉంటుంది. నిరుద్యోగులకు అనుకోని ఇంటర్వ్యూలు రాగలవు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు. కళారంగం వారికి సన్మానాలు. వారం ప్రారంభంలో దూరప్రయాణాలు. రుణాలు చేస్తారు.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.)
కొత్త పనులు ప్రారంభిస్తారు. సోదరులు, సోదరీల నుంచి ధన, వస్తులాభాలు. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులకు ఫలితాలు ఉత్సాహాన్నిస్తాయి. ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది. పెట్టుబడులకు అనుకూలం. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. పారిశ్రామికరంగం వారికి విదేశీ పర్యటనలు ఉండవచ్చు. వారం ప్రారంభంలో ధనవ్యయం. కుటుంబసభ్యులతో వివాదాలు.
కన్య (ఉత్తర 2,3,4పా, హస్త, చిత్త1,2పా.,)
రుణయత్నాలు సాగిస్తారు. బంధువులతో వివాదాలు. ఆరోగ్యభంగం. కొన్ని పనులు వాయిదా వేస్తారు. ప్రయాణాలలో ఆటంకాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార విస్తరణ యత్నాలు మందగిస్తాయి. ఉద్యోగాల్లో మార్పులు ఉంటాయి. రాజకీయరంగం వారికి విదేశీ పర్యటనలు వాయిదా. వారం చివరిలో ధనలాభం. నూతన ఉద్యోగయోగం.
తుల (చిత్త 3,4పా, స్వాతి, విశాఖ1,2,3పా.)
ఆర్థిక పరిస్థితి నిరాశపరుస్తుంది. అనుకోని ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు, ఇరుగుపొరుగుతో మాటపట్టింపులు. ఆరోగ్యపరంగా కొద్దిపాటి చికాకులు. శ్రమానంతరం కొన్ని పనులు పూర్తి కాగలవు. ఉద్యోగస్తులకు బాధ్యతలు పెరుగుతాయి. కళారంగం వారికి కొన్ని అవకాశాలు నిరాశ కలిగిస్తాయి. వారం మధ్యలో శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం.
వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ)
కొత్త పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాల్లో పురోగతి కనిపిస్తుంది. ఒక ప్రకటన నిరుద్యోగుల్లో ఆశలు రేపుతుంది. గృహ నిర్మాణాల్లో ఆటంకాలు తొలగుతాయి. మీ సేవలకు తగిన గుర్తింపు పొందుతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులు ఇంక్రి మెంట్లు పొందుతారు. రాజకీయరంగం వారికి యోగదాయకమైన కాలం. వారం చివరిలో వ్యయప్రయాసలు. ధనవ్యయం.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1పా.)
ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వాహనాలు, గృహ కొనుగోలు యత్నాలు సఫలం. వ్యాపారాల్లో ఒడిదుడుకులు తొలగుతాయి. పారిశ్రామికరంగం వారికి నూతనోత్సాహం. వారం మధ్యలో దూరప్రయాణాలు. అనారోగ్యం.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1,2పా.)
ఈవారం పనులు చకచకా పూర్తి కాగలవు. ఆర్థిక విషయాల్లో చికాకులు తొలగుతాయి. నిరుద్యోగుల యత్నాలు ఫలిస్తాయి. సంఘంలో విశేష గౌరవమర్యాదలు లభిస్తాయి. వ్యాపారాల్లో ముందడుగు వేస్తారు. ఉద్యోగులు పైస్థాయి నుంచి అభినందనలు అందుకుంటారు. రాజకీయరంగం వారికి కలసివచ్చే కాలం. వారం చివరిలో ఆరోగ్యభంగం. పనుల్లో ఆటంకాలు.
కుంభం (ధనిష్ట 3,4పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పా.)
ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. నిరుద్యోగులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. బంధువుల నుంచి ధన లేదా వస్తులాభాలు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులకు ఉన్నతహోదాలు దక్కే అవకాశం. పారిశ్రామికరంగం వారికి విదేశీ పర్యటనలు. వారం మధ్యలో కుటుంబంలో చికాకులు. అనారోగ్యం.
మీనం (పూర్వాభాద్ర 4పా., ఉత్తరాభాద్ర, రేవతి)
పనులు అనుకున్న రీతిలో పూర్తి కాగలవు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. స్థిరాస్తి వివాదాలు తీరతాయి. వాహనాలు, భూములు సమకూర్చుకుంటారు. వ్యాపారాల్లో అనుకున్న లాభాలు. ఉద్యోగులు పనిభారం తగ్గి ఊపిరి పీల్చుకుంటారు. కళారంగం వారికి ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనుకోని ప్రయాణాలు.
- సింహంభట్ల సుబ్బారావు,
జ్యోతిష పండితులు
చంద్రబింబం: మార్చి 23 నుండి 29 వరకు
Published Sun, Mar 23 2014 2:00 AM | Last Updated on Sat, Sep 2 2017 5:01 AM
Advertisement
Advertisement