
సౌరబలం: ఆగస్టు 25 నుండి 31 వరకు
మేషం (మార్చి 21-ఏప్రిల్ 20)
ఉద్యోగయత్నాలు సానుకూలం. పనుల్లో పురోగతి. ఆర్థిక లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. ప్రముఖులతో ఉత్తరప్రత్యుత్తరాలు. కొన్ని వివాదాలు తీరతాయి. ఆహ్వానాలు అందుతాయి. విద్యార్థులకు అనుకున్న ఫలితాలు తథ్యం. వృత్తి, వ్యాపారాలలో అనుకూల వాతావరణం. వారం చివరిలో ధనవ్యయం. దూరప్రయాణాలు.
వృషభం (ఏప్రిల్ 21-మే 20)
పరిచయాలు పెరుగుతాయి. శుభకార్యాల నిర్వహణలో నిమగ్నమవుతారు. సేవలకు గుర్తింపు రాగలదు. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఇంటి నిర్మాణాలు చేపడతారు. వ్యాపార, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు. కళాకారులకు అవార్డులు. వారం మధ్యలో అనుకోని ప్రయాణాలు. ఆరోగ్యభంగం.
మిథునం (మే 21-జూన్ 21)
కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. అందరిలోనూ ప్రత్యేకత చాటుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వాహనయోగం. వృత్తి, వ్యాపారాలలో చిక్కులు తొలగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. వారం చివరిలో అనారోగ్యం. ఆకస్మిక ప్రయాణాలు.
కర్కాటకం (జూన్ 22-జూలై 23)
అనుకోని ప్రయాణాలు. సోదరులు, మిత్రుల నుంచి అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది. నిర్ణయాలలో తొందర వద్దు. ఆరోగ్యం మందగిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపార, ఉద్యోగాలు సామాన్యం. వారం మధ్యలో శుభవార్తలు. ధనలాభం.
సింహం (జూలై 24-ఆగస్టు 23)
ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. అనుకున్నది సాధించేవరకూ విశ్రమించరు. జీవిత భాగస్వామి సలహాలతో నిర్ణయాలు తీసుకుంటారు. వాహనయోగం. రచయితలు, కళాకారులకు సన్మానాలు. వృత్తి, వ్యాపారాలలో పురోగతి. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. ఆరోగ్యభంగం.
కన్య (ఆగస్టు 24-సెప్టెంబర్ 23)
పనులు నెమ్మదిగా పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలు కాస్త ఇబ్బంది పెట్టినా అవసరాలు తీరతాయి. బంధువులు, శుభకార్యాల నిర్వహణలో పాలుపంచుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో మీదే పైచేయి. కళాకారులకు సన్మానాలు. వారం మధ్యలో వివాదాలు. ధనవ్యయం.
తుల (సెప్టెంబర్ 24-అక్టోబర్ 23)
కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. ప్రముఖులతో ఉత్తరప్రత్యుత్తరాలు. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. విద్యార్థులు కొత్త అవకాశాలు అందుకుంటారు. వారం చివరిలో ధనవ్యయం. కుటుంబంలో చికాకులు.
వృశ్చికం (అక్టోబర్ 24-నవంబర్ 22)
సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఇంటిలో శుభకార్యాలు. వ్యాపార, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు. రాజకీయవర్గాలకు పదవీయోగం. వారం ప్రారంభంలో ఆస్తి వివాదాలు. ఆరోగ్యభంగం.
ధనుస్సు (నవంబర్ 23-డిసెంబర్ 21)
పనులు చకచకా సాగుతాయి. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. సన్నిహితుల సాయం అందుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. శుభకార్యాలకు హాజరవుతారు. సేవా కార్యక్రమాలపై ఆసక్తి. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. వారం మధ్యలో చికాకులు. ఆరోగ్యభంగం.
మకరం (డిసెంబర్ 22-జనవరి 20)
ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. అనుకున్న పనులు కొంత మందగిస్తాయి. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు. ఆరోగ్యభంగం. తీర్థయాత్రలు చేస్తారు. మిత్రుల నుంచి కొద్దిపాటి ఒత్తిడులు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. కళాకారులకు కొత్త అవకాశాలు ఊరిస్తాయి. వారం చివరిలో శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం.
కుంభం (జనవరి 21-ఫిబ్రవరి 19)
ఆర్థిక వ్యవహారాలలో నిరుత్సాహం. పనులు వాయిదా వేస్తారు. బంధువులు, మిత్రులతో వివాదాలు. మీ ప్రతిపాదనలకు కుటుంబసభ్యులు వ్యతిరేకత చూపుతారు. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలలో అనుకోని మార్పులు. వారం మధ్యలో విందువినోదాలు. వాహనయోగం. పనులు పూర్తి.
మీనం (అధిపతి గురువు, ఫిబ్రవరి 20-మార్చి 20)
పరిచయాలు పెరుగుతాయి. ఆత్మీయులు, బంధువుల నుంచి ఆసక్తికరమైన సమాచారం. వాహనాలు, భూములు కొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు పదవీయోగం. వారం చివరిలో ధనవ్యయం. కుటుంబసభ్యులతో వివాదాలు.
- సింహంభట్ల సుబ్బారావు
ఈ వారంలో పుట్టినరోజు జరుపుకునేవారికి...
ఇంతకాలం వేధిస్తున్న ఒక సమస్య పరిష్కారమవుతుంది. శుభకార్యాల రీత్యా ఖర్చులు. రావలసిన పైకం అందుతుంది. ఒక ముఖ్య వ్యవహారంలో స్థిరమైన అభిప్రాయానికి వస్తారు. అపవాదులు తొలగుతాయి. ఆరోగ్యపరంగా కొద్దిపాటి చికాకులు కలిగినా సర్దుబాటు కాగలవు. కళాకారులు, పరిశోధకులకు విశేష యోగకాలమే. ఇతరులకు సైతం సహాయం అందిస్తారు.
మీతో పాటు ఈ వారం పుట్టినరోజు జరుపుకుంటోన్న సెలెబ్రిటీ...
నాగార్జున
పుట్టినరోజు: ఆగస్టు 29