మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.)
ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. ఆత్మీయులు, బంధువుల నుంచి ఆహ్వానాలు. బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి ప్రశంసలు అందుకుంటారు. పనులు సకాలంలో పూర్తి కాగలవు. వ్యాపార, ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. వారం ప్రారంభంలో ధనవ్యయం. కుటుంబంలో చికాకులు.
వృషభం (కృత్తిక 2,3,4పా, రోిహ ణి, మృగశిర 1,2పా.)
సంఘంలో గౌరవప్రతిష్టలు. స్థిరాస్తి వివాదాలు తీరతాయి. రావలసిన పైకం అందుతుంది. శ్రమ ఫలిస్తుంది. బంధువులతో విభేదాలు తొలగుతాయి. వాహన, గృహయోగాలు. వ్యాపారాలు అభివృద్ధి పథంలో సాగుతాయి. ఉద్యోగులకు హోదాలు. వారం మధ్యలో స్వల్ప వివాదాలు. ధనవ్యయం.
మిథునం (మృగశిర 3,4పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.)
ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. పనుల్లో స్వల్ప ఆటంకాలు. ఆరోగ్యం మందగిస్తుంది. నిర్ణయాలలో ఆచితూచి వ్యవహరించాలి. సోదరులు, మిత్రులతో స్వల్ప వివాదాలు. వ్యాపారాల విస్తరణలో అవరోధాలు. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి. విద్యార్థులు, నిరుద్యోగులకు ఒత్తిడులు. వారం చివరిలో శుభవార్తలు. ధన, వస్తులాభాలు.
కర్కాటకం (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
ఆకస్మిక ప్రయాణాలు. ఆర్థిక పరిస్థితి అనుకూలించదు. రుణాలు చేయాల్సివస్తుంది. బంధువర్గం నుంచి ఒత్తిడులు. అనారోగ్య సూచనలు. ఇంటా బయటా నిరుత్సాహం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ. విద్యార్థులకు శ్రమాధిక్యం. వారం మధ్యలో విందువినోదాలు. ధనలాభం.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.)
వ్యూహాత్మకంగా వ్యవహారాలు పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు. ఆస్తి వివాదాలు తీరతాయి. ఇంటి నిర్మాణ యత్నాలు ముమ్మరం చేస్తారు. కొత్త పరిచయాలు. ఆర్థిక విషయాలలో పురోగతి. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు అనుకోని హోదాలు. నిరుద్యోగులు, విద్యార్థులకు అనుకూల ప్రకటన రావచ్చు. వారం చివరిలో దూరప్రయాణాలు. బంధువులతో వివాదాలు.
కన్య (ఉత్తర 2,3,4పా, హస్త, చిత్త 1,2పా.,)
బంధువుల నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఇంటిలో శుభకార్యాలు. నూతన వ్యక్తుల పరిచయాలు. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం.
తుల (చిత్త 3,4పా, స్వాతి, విశాఖ 1,2,3పా.)
ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. దీర్ఘకాలిక సమస్య నుంచి బయటపడతారు. శ్రమ ఫలిస్తుంది. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు. రాజకీయవర్గాలకు పదవీయోగం. వారం మధ్యలో వివాదాలు. పనుల్లో ప్రతిబంధకాలు.
వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ)
కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. అరుదైన ఆహ్వానాలు. దూరమైన ఆప్తులు దగ్గరవుతారు. ఆస్తి వివాదాల పరిష్కారం. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం చివరిలో ప్రయాణాలు. ఆరోగ్యభంగం.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1పా.)
సోదరులు, మిత్రుల నుంచి కీలక సమాచారం. మీ శ్రమ ఫలించే సమయం. చిరకాల స్వప్నం నెరవేరుతుంది. రావలసిన సొమ్ము అంది అవసరాలు తీరతాయి. కోర్టు కేసు పరిష్కారం. స్థిరాస్తి వృద్ధి. వ్యాపార, ఉద్యోగాలలో చిక్కులు అధిగమిస్తారు. పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు. వారం మధ్యలో ఆకస్మిక ప్రయాణాలు. పనుల్లో అవరోధాలు.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1,2పా.)
కుటుంబసభ్యులతో వివాదాలు తీరతాయి. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులకు నూతన అవకాశాలు. వ్యాపారులకు నూతనోత్సాహం. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. కళారంగం వారు సన్మానాలు పొందుతారు. వారం ప్రారంభంలో అనుకోని ప్రయాణాలు. రుణాలు చేస్తారు.
కుంభం (ధనిష్ట 3,4పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పా.)
ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. రుణదాతల ఒత్తిడులు ఉండవచ్చు. అనుకోని ప్రయాణాలు. స్థిరాస్తి వివాదాలు కొంతవరకూ పరిష్కారం. ఒక ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. వృత్తి, వ్యాపారాలు మంద కొడిగా సాగుతాయి. విద్యార్థులకు శ్రమాధిక్యం. వారం చివరిలో ధనలాభం.
మీనం (పూర్వాభాద్ర 4పా., ఉత్తరాభాద్ర, రేవతి)
దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆర్థిక ప్రగతి. బాకీలు అందుతాయి. స్థిరాస్తి వివాదాలు తీరతాయి. వాక్చాతుర్యంతో ఆకట్టుకుంటారు. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వృత్తి, వ్యాపారాలలో అనూహ్యమైన ప్రగతి కనిపిస్తుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వారం మధ్యలో ఆరోగ్యభంగం.
- సింహంభట్ల సుబ్బారావు, జ్యోతిష పండితులు
చంద్రబింబం: రాశిఫలాలు (జనవరి 19 నుండి 25 వరకు)
Published Sun, Jan 19 2014 3:47 AM | Last Updated on Sat, Sep 2 2017 2:45 AM
Advertisement
Advertisement