చంద్రబింబం: నవంబర్ 10 నుండి నవంబర్ 16 వరకు
మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.)
ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఇంటి నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. శ్రమ ఫలిస్తుంది. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తిలాభం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు. విద్యార్థులు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వారం చివరిలో ధనవ్యయం. కుటుంబంలో కొద్దిపాటి చికాకులు.
వృషభం (కృత్తిక 2,3,4పా, రోిహ ణి, మృగశిర 1,2పా.)
పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. సంఘంలో విశేష గౌరవం. భూవివాదాలు తీరి లబ్ధి పొందుతారు. పరపతి పెరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. భూ, గృహయోగాలు. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టిసారిస్తారు. వారం మధ్యలో అనారోగ్యం. వివాదాలు.
మిథునం (మృగశిర 3,4పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.)
కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి కాగలవు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. భాగస్వామ్య వ్యాపారాలు పుంజుకుంటాయి. విద్యార్థులు సాంకేతిక విద్యావకాశాలు పొందుతారు. వారం ప్రారంభంలో ధనవ్యయం. మిత్రులతో మాటపట్టింపులు.
కర్కాటకం (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయంతో ముందుకు సాగుతారు. పనులు శ్రమానంతరం పూర్తి చేస్తారు. విద్యార్థులకు కొత్త విద్యావకాశాలు. వాహనాలు కొనుగోలు చేస్తారు. వృత్తి, వ్యాపారాలలో మార్పులకు అవకాశం. వారం మధ్యలో ప్రయాణాలు. ఆరోగ్యభంగం.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.)
వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. సమస్యల నుంచి బయటపడతారు. ఆలోచనలు కలసివస్తాయి. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. విద్యార్థుల ఆశయం నెరవేరుతుంది. వ్యాపారాల్లో చికాకులు తొలగుతాయి. ఉద్యోగులకు హోదాలు లభిస్తాయి. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు సన్మానాలు. వారం చివరిలో వివాదాలు. అనారోగ్యం.
కన్య (ఉత్తర 2,3,4పా, హస్త, చిత్త 1,2పా.,)
రుణాలు తీరతాయి. బంధువర్గంతో వివాదాలు తొలగుతాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు. కాంట్రాక్టు పనులు చేపడతారు. వారం మధ్యలో దూరప్రయాణాలు. ధనవ్యయం.
తుల (చిత్త 3,4పా, స్వాతి, విశాఖ 1,2,3పా.)
రావలసిన సొమ్ము అందుతుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. కీర్తిప్రతిష్ఠలు పెరుగుతాయి. శుభకార్యాలు నిర్వహిస్తారు. ఇంటి నిర్మాణయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపారవృద్ధి. ఉద్యోగులకు పదోన్నతులు. వారం చివరిలో అనుకోని ప్రయాణాలు. రుణాలు చేస్తారు.
వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ)
ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. బాధ్యతలు పెరుగుతాయి. నిరుద్యోగులను ఒక ప్రకటన ఆకట్టుకుంటుంది. వ్యాపారాలు కొంత అనుకూలం. ఉద్యోగస్తులకు అదనపు పనిభారం. ఆరోగ్యం మందగిస్తుంది. వారం ప్రారంభంలో శుభవార్తలు. ధనలాభం.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1పా.)
ఆర్థిక లావాదేవీలు అంతంత మాత్రంగా ఉంటాయి. రుణాలు చేస్తారు. దూరప్రయాణాలు. బంధువులతో మాటపట్టింపులు. శ్రమానంతరం కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఆరోగ్యభంగం. వ్యాపార, ఉద్యోగాలలో మార్పులకు అవకాశం. కళాకారులకు ఊహించని అవకాశాలు. వారం మధ్యలో విందువినోదాలు. పాతమిత్రుల కలయిక.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1,2పా.)
ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. సంఘంలో ఆదరణ. ప్రముఖులతో పరిచయాలు. రావలసిన సొమ్ము అందుతుంది. బంధువులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు. వ్యాపారులకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం చివరిలో వివాదాలు. అనారోగ్యం.
కుంభం (ధనిష్ట 3,4పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పా.)
పనులు సజావుగా పూర్తి కాగలవు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు. విద్యార్థులకు కొత్త అవకాశాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. రాజకీయవర్గాలకు పదవులు. వారం చివరిలో ధనవ్యయం. వివాదాలు.
మీనం (పూర్వాభాద్ర 4పా., ఉత్తరాభాద్ర, రేవతి)
ఎంతటి వారినైనా ఆకట్టుకుని వ్యవహారాలు చక్కదిద్దుతారు. సన్నిహితులు, మిత్రులతో వివాదాలు తొలగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. భూ, గృహయోగాలు. వృత్తి, వ్యాపారాలలో పురోగతి. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం మధ్యలో వివాదాలు. ఆరోగ్యభంగం.
- సింహంభట్ల సుబ్బారావు, జ్యోతిష పండితులు
ఈ వారంలో పుట్టినరోజు జరుపుకునేవారికి...
సన్నిహితులు, మిత్రులు మీ అభివృద్ధికి సహకరిస్తారు. గతంలో నిలిచిపోయిన వ్యవహారాలు సైతం పూర్తి కాగలవు. ఆదాయానికి లోటు ఉండదు. ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. భూములు, భవనాలు కొనుగోలు చేస్తారు. వృత్తి, వ్యాపారాలలో విజయం సాధిస్తారు. ద్వితీయార్థంలో కొద్దిపాటి చికాకులు ఎదురవుతాయి.
మీతో పాటు ఈ వారం పుట్టినరోజు జరుపుకుంటోన్న సెలెబ్రిటీ...
పి. సుశీల
పుట్టినరోజు: నవంబర్13