శ్రీ వికారి నామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు మాఘ మాసం, తిథి శు.అష్టమి సా.4.10 వరకు, తదుపరి నవమి నక్షత్రం భరణి రా.7.54 వరకు తదుపరి కృత్తిక, వర్జ్యం ..లేదు, దుర్ముహూర్తం సా.4.22 నుంచి 5.07 వరకు, అమృతఘడియలు... ప.2.40 నుంచి 3.44 వరకు.
సూర్యోదయం : 6.35
సూర్యాస్తమయం : 5.52
రాహుకాలం : సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం : ప.12.00 నుంచి 1.30 వరకు
భవిష్యం
మేషం: కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. శుభవార్తలు. ఆర్థికలాభాలు. పాతమిత్రుల కలయిక. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. దైవదర్శనాలు. ఉద్యోగులకు పదోన్నతులు.
వృషభం: ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. శ్రమాధిక్యం. అనారోగ్యం.బంధువులతో వివాదాలు.వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. కుటుంబంలో ఒత్తిడులు.
మిథునం: యత్నకార్యసిద్ధి.మిత్రులు, బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆధ్యాత్మికచింతన. వాహనయోగం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ఉన్నతస్థితి.
కర్కాటకం: కొత్త వ్యక్తుల పరిచయం. ఆకస్మిక ధనలాభం.బంధువుల నుంచి శుభవార్తలు.వాహనయోగం. వ్యాపారాలు,ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.
సింహం: రుణాలు చేస్తారు. ఆలోచనలు కలసిరావు. బంధువులతో తగాదాలు. ఆకస్మిక ప్రయాణాలు.అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలు చికాకు పరుస్తాయి.
కన్య: కుటుంబ సమస్యలు. అనారోగ్యం.పనుల్లో అవాంతరాలు.రుణాలు చేస్తారు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు. ఉద్యోగాలలో కొంత గందరగోళం.
తుల: శుభవార్తలు వింటారు.పనుల్లో విజయం. వాహనయోగం. కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.
వృశ్చికం: ఇంటాబయటా అనుకూలం. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు.
ధనుస్సు: కుటుంబసభ్యులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. శ్రమ పెరుగుతుంది. విందువినోదాలు. వ్యాపారాలు,ఉద్యోగాలలో నిరుత్సాహం.
మకరం: మకరం...వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. కొత్త రుణాలు చేస్తారు. శ్రమకు ఫలితం కనిపించదు. భూవివాదాలు. స్వల్ప అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలలో నిరాశ.
కుంభం: నిరుద్యోగులకు అనుకూలం. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. వృత్తి,వ్యాపారాలు సాఫగా సాగుతాయి.శ్రమ ఫలిస్తుంది.
మీనం: మిత్రులతో కలహాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. పనులు వాయిదా వేస్తారు. శ్రమాధిక్యం.వృత్తి, వ్యాపారాలలో చిక్కులు.
– సింహంభట్ల సుబ్బారావు
Comments
Please login to add a commentAdd a comment