సాక్షి, హైదరాబాద్: భవన నిర్మాణ అనుమతుల జారీలో పారదర్శకత కోసం ‘టీఎస్–బీపాస్’ వి ధానాన్ని ఇప్పటికే రాష్ట్రంలోని 87 పురపాలికల్లో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టామని, జూన్ మొద టి వారంలో అన్ని పురపాలికల్లో పూర్తి స్థాయిలో అమలు చేస్తామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు. ఈ మేరకు ఏ ర్పాట్లను పూర్తి చేసుకుని సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. టీఎస్–బీపాస్ అమలుపై గురువారం ఆయనిక్కడ సమీక్ష నిర్వహిం చారు. ప్రస్తుతం 87 పురపాలికల్లో టీఎస్–బీపాస్ కింద 1,100 దరఖాస్తులను స్వీకరించడంతో పాటు ఇప్పటికే పలు అనుమతులను జారీ చేశామని అధికారులు కేటీఆర్‌కు వివరించారు.
సాఫ్ట్‌వేర్, సపోర్ట్ సిస్టం పనితీరుపై క్షేత్రస్థాయి నుంచి సమాచారం వచ్చిందని, లోపాలుంటే సరిదిద్దేం దుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రా ష్ట్రంలోని అన్ని మునిసిపాలిటీలతోపాటు హైదరాబాద్‌లోనూ ఈ వ్యవస్థను ఏకకాలంలో ప్రారం భించేందుకు ఆలోచిస్తున్నట్లు తెలిపిన మంత్రి, ఇందుకు సంబంధించి పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని జీహెచ్‌ఎంసీ అధికారులకు ప్రత్యేకంగా సూచించారు. ఇందుకోసం ఒకటి రెండు రోజుల్లోనే జీహెచ్‌ఎంసీ పరి ధిలోని జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ యంత్రాంగం టౌన్ ప్లానింగ్ అధికారులతో ప్రత్యేక సమావేశా న్ని ఏర్పాటు చేయాలని కేటీఆర్ పురపాలక శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు.
జూన్ మొదటివారంలో టీఎస్–బీపాస్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చాక ప్రజలు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి వీలుగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. మీసేవ, పౌరసేవా కేంద్రాలతో పాటు వ్యక్తిగతంగా ఇంటర్నెట్, మొబైల్ యాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ఏర్పాట్లు చేయాలన్నారు. ఇవేవీ అందుబాటులో లేకుంటే నేరుగా దరఖాస్తులు స్వీకరించడానికి కూడా సిద్ధంగా ఉండాలని, దరఖాస్తు ప్రక్రియలో ఇబ్బందులను పరిష్కరించేందుకు ప్రత్యేక కాల్ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు. క్షేత్ర స్థాయి నుంచి వచ్చే సమాచారం ఆధారంగా మరింత సరళీకృతం చేయాలన్నారు. ఈ సమీక్షలో జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్‌తో పాటు, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్, డైరెక్టర్ ఎ.సత్యనారాయణ పాల్గొన్నారు.
టీఎస్–బీపాస్ అమలుపై సమీక్షిస్తున్న మంత్రి కేటీఆర్
Comments
Please login to add a commentAdd a comment