న్యూఢిల్లీ: యూయూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) ఆధారిత డిజిటల్ లావాదేవీలు జూన్ నెలలోనూ భారీగా నమోదయ్యాయి. వరుసగా రెండో నెలలో రూ.10లక్షల కోట్లకుపైగా విలువైన లావాదేవీలు జరిగినట్టు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) డేటా స్పష్టం చేస్తోంది.
అయితే మే నెలతో పోలిస్తే లావాదేవీల విలువ జూన్‌లో 3 శాతం తగ్గింది.యూపీఐ లావాదేవీలు మేతో పోలిస్తే జూన్‌లో వాల్యూమ్ , విలువ రెండింటిలోనూ తగ్గిపోయాయని ఎన్‌పీసీఐ డేలా తెలిపింది. జూన్ నెలకు రూ.10,14,384 కోట్ల విలువ చేసే యూపీఐ లావాదేవీలు నమోదు కాగా, మే నెలకు ఈ మొత్తం రూ.10,41,506 కోట్లుగా ఉంది. జూన్ నెలలో 596 కోట్ల యూపీఐ లావాదేవీలు (సంఖ్య) నమోదయ్యాయి. ఇక ఈ ఏడాది ఏప్రిల్ నెలకు యూపీఐ లావాదేవీలు 558 కోట్లుగా ఉంటే, వీటి విలువ రూ.9,83,302 కోట్లుగా ఉండడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment