shrink
-
జూన్‌లోనూ భారీగానే, కానీ మే నెలతో పోలిస్తే
న్యూఢిల్లీ: యూయూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ఆధారిత డిజిటల్ లావాదేవీలు జూన్ నెలలోనూ భారీగా నమోదయ్యాయి. వరుసగా రెండో నెలలో రూ.10లక్షల కోట్లకుపైగా విలువైన లావాదేవీలు జరిగినట్టు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) డేటా స్పష్టం చేస్తోంది. అయితే మే నెలతో పోలిస్తే లావాదేవీల విలువ జూన్‌లో 3 శాతం తగ్గింది.యూపీఐ లావాదేవీలు మేతో పోలిస్తే జూన్‌లో వాల్యూమ్ , విలువ రెండింటిలోనూ తగ్గిపోయాయని ఎన్పీసీఐ డేలా తెలిపింది. జూన్ నెలకు రూ.10,14,384 కోట్ల విలువ చేసే యూపీఐ లావాదేవీలు నమోదు కాగా, మే నెలకు ఈ మొత్తం రూ.10,41,506 కోట్లుగా ఉంది. జూన్ నెలలో 596 కోట్ల యూపీఐ లావాదేవీలు (సంఖ్య) నమోదయ్యాయి. ఇక ఈ ఏడాది ఏప్రిల్ నెలకు యూపీఐ లావాదేవీలు 558 కోట్లుగా ఉంటే, వీటి విలువ రూ.9,83,302 కోట్లుగా ఉండడం గమనార్హం. -
మున్ముందు కోర్టు హాళ్లూ చిన్నవి అవుతాయి
పణాజి: సాంకేతికత కారణంగా భవిష్యత్తులో కోర్టు ప్రాంగణాలు, కోర్టు గదులు కూడా చిన్నవిగా మారి పోతాయని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎస్ఏ బాబ్డే తెలిపారు. న్యాయం అందించే విషయంలో కరోనా మహమ్మారి పలు సవాళ్లు విసిరినప్పటికీ, ఆ పరిణామం కోర్టుల నవీకరణకు బాటలు వేసిందని ఆయన తెలిపారు. శనివారం పోర్వోరిమ్‌లో ముంబై హైకోర్టు గోవా ధర్మాసనం కొత్త భవనం ప్రారంభించిన అనంతరం జరిగిన కార్యక్రమంలో సీజేఐ మాట్లాడారు. ‘రవి శంకర్ ప్రసాద్ మంత్రిత్వం కారణంగానే కోర్టు గదులు చిన్నవిగా మారుతున్న పరిణామాన్ని చూస్తున్నాను. అదేవిధంగా, భారీగా ఉండే కోర్టు పత్రాలను భద్రపరిచేందుకు చాలా గదులుండేవి. కానీ, ఈ–ఫైలింగ్, డేటా రాకతో ఇకపై పెద్ద సంఖ్యలో గదుల అవసరం కూడా ఉండదు. ఈ విషయంలో సుప్రీంకోర్టు కనీస ప్రమాణాలు, ప్రణాళికలను రూపొందించింది’అని ఆయన చెప్పారు. ‘మౌలిక వసతులపై చర్చించేటప్పుడు కొత్త భవనాల నిర్మాణం అంశమే ప్రముఖంగా ప్రస్తావనకు వస్తుంది. ఇవి అవసరమే అయినప్పటికీ ఇప్పటికే ఉన్న వాటిని ఆధునీకరించాల్సి ఉంది’అని సీజేఐ అన్నారు. ముంబై హైకోర్టుకు కొత్త భవనం నిర్మించాలన్న ఆయన..‘అప్పట్లో కేవలం ఏడుగురు జడ్జీలకు మాత్రమే సరిపోయే విధంగా నిర్మించారు. కానీ, ఇప్పుడు అక్కడ 40 మందికి పైగా జడ్జీలు విధులు నిర్వర్తిస్తున్నారు’అని వివరించారు. నాలుగున్నర శతాబ్ధాల ఘన చరిత్ర గోవా న్యాయవ్యవస్థకు ఉందని సీజేఐ జస్టిస్ బాబ్డే చెప్పారు. పోర్చుగీస్ పాలకులు ఆసియాలోనే మొట్టమొదటి హైకోర్టును 1544లో గోవాలోనే ఏర్పాటు చేశారని ఆయన గుర్తు చేశారు. గోవా ధర్మాసనంలోని ముగ్గురు జడ్జీల్లో తను కూడా ఉన్నానని, తనను కొందరు గోవా జడ్జీగా పేర్కొనడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. మౌలిక వసతుల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి: జస్టిస్ రమణ ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ మాట్లాడుతూ.. న్యాయవ్యవస్థ అవసరాలు తీర్చేందుకు వీలుగా ప్రత్యేకంగా జాతీయ న్యాయ మౌలిక వసతుల కార్పొరేషన్ అవసరం ఉందని చెప్పారు. దీనిని ఏర్పాటు చేసేందుకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా కృషి చేయాలని కోరారు. ఈ కొత్త కార్పొరేషన్ న్యాయ వ్యవస్థ మౌలిక వసతుల్లో విప్లవాత్మక మార్పులకు అవసరమైన ఏకరూపకత, ప్రామాణీకరణను తెస్తుందని చెప్పారు. అన్ని కోర్టులకు ప్రత్యేకంగా వీడియో కాన్ఫరెన్సింగ్ సౌకర్యం, కోర్టు పత్రాల ఈ–ఫైలింగ్‌కు ఏర్పాట్లు చేయడం వంటివి కూడా మౌలిక వసతుల కిందికే వస్తాయని వివరించారు. ‘శిథిలావస్థకు చేరిన నిర్మాణాల్లో కోర్టులను నిర్వహిస్తున్న ఉదాహరణలను మనం చూస్తున్నాం. కొన్ని చోట్ల రికార్డు గదులు కూడా ఉండటం లేదు. వాష్ రూంలు, వెయిటింగ్ గదులు లేని కోర్టు ప్రాంగణాలు కూడా ఉన్నాయి’అని ఆయన తెలిపారు. కరోనా కారణంగా కేసుల విచారణ వర్చువల్‌గా సాగుతుండటంతో కోర్టులను ప్రజల గుమ్మం ముందుకు తీసుకెళ్లినట్లయిం దన్నారు. దీనికి కేంద్ర న్యాయశాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్, గోవా సీఎం ప్రమోద్ సావంత్‌లు హాజరయ్యారు. -
ద్రవ్యోల్బణం పెరిగింది.. ఉత్పత్తి తగ్గింది!
న్యూఢిల్లీ : వినియోగదారుల ద్రవ్యోల్బణం ఐదు నెలల గరిష్ట స్థాయికి ఎగిసింది. ఇంధన ధరలు పెరుగడంతో మార్చి నెల ద్రవ్యోల్భణం పెరిగినట్టు బుధవారం విడుదలైన డేటాలో వెల్లడైంది. ధరలు పెరుగుతాయని ముందుగానే ఊహించిన రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా పాలసీ రేట్లను యథాతథంగా ఉంచింది. వారి అంచనాల మేరకే ద్రవ్యోల్బణం ఎగిసింది. గత నెల వినియోగదారుల ద్రవ్యోల్బణం 3.81 శాతం పైకి ఎగిసినట్టు ప్రభుత్వ డేటాలో తెలిసింది. 2016 అక్టోబర్ నుంచి ఇదే అత్యంత వేగవంతమైన పెరుగుదలని తేలింది. ఫిబ్రవరి నెలలో ద్రవ్యోల్బణం 3.65 శాతానికి ఎగిసినప్పటికీ, ఇంత వేగంగా పెరుగలేదని గణాంకాల మంత్రిత్వశాఖ డేటాలో వెల్లడైంది. ఫిబ్రవరి నెలలో 3.91శాతంగా ఉన్న రిటైల్ ఇంధన ద్రవ్యోల్బణం మార్చి నెలలో ఏకంగా 5.56 శాతానికి పెరిగింది. ఆహారపు ధరలు కూడా 1.93 శాతం పైకి వెళ్లాయి. కానీ ముందస్తు నెలతో పోల్చుకుంటే ఇది తక్కువేనని తెలిసింది. ఓ వైపు వినియోగదారుల ద్రవ్యోల్బణం పెరుగగా.. మరోవైపు పారిశ్రామికోత్పత్తి అనూహ్యంగా ఫిబ్రవరి నెలలో 1.2 శాతం పడిపోయింది. జనవరి నెలలో ఈ ఉత్పత్తి 2.7 శాతం వృద్ధి నమోదుచేసుకుంది. కానీ పారిశ్రామికోత్పత్తి 1.3 శాతం వృద్ధి నమోదుచేస్తుందని రాయిటర్స్ అంచనావేసింది. ప్రస్తుతం రాయిటర్స్ అంచనాలు తప్పాయి. -
ఆ వర్గం భవిష్యత్‌లో కనిపించదా?
వెనక్కు తిరిగి చూసుకుంటే 2 వేల సంవత్సరాల చరిత్ర. ఎన్నో అటూపోట్లు. అన్నింటినీ సమర్ధంగా ఎదుర్కొని నిలబడినా కాలం దేన్నేయినా చరిత్రలో కలిపేసుకుంటుంది కదా. 'బెనే ఇస్రాయిల్' వర్గం భారతదేశంలో మిణుకుమిణుకు వెలుగుతున్న ఓ దీపం. వేల సంవత్సరాల కిందట ఇజ్రాయెల్ నుంచి మన దేశానికి వచ్చిన కొందరు 'జ్యూ'లు అప్పటి బొంబాయిని తమ సొంతవూరిగా మార్చుకున్నారు. అక్కడే జీవనం సాగిస్తూ వస్తున్నారు. 2010లో ఓ ఫోటోగ్రాఫర్‌కు తీసిన ఫోటో భారతదేశంలో అంతరించిపోతున్న ఇజ్రాయిలీల గురించి బయటకు తెచ్చింది. ఆ ఫోటో తీసిన కొద్ది రోజుల తర్వాత వేరే షూట్ ప్రయత్నాల్లో ఉన్న ఫోటోగ్రాఫర్ అహ్మదాబాద్‌లో స్ధిరనివాసం ఏర్పరచుకున్న ఇండియన్-జ్యూయిష్ రచయిత ఈస్టర్ డేవిడ్‌ను కాకతాళీయంగా కలిశారు. అప్పుడు గానీ తెలియలేదు భారత్‌కు వచ్చిన ఇజ్రాయిలీలు ఇక్కడే ఎందుకు స్ధిరపడ్డారో. వారికెందుకు భారతీయ వాతావరణం నచ్చిందో. దాంతో తన తర్వాతి షూట్ ఇదేనని నిర్ణయించుకున్నాడు. డేవిడ్‌తో కొద్దిరోజులు పాటు అహ్మదాబాద్‌లో ప్రయాణం చేసి జ్యూల సంప్రదాయాన్నీ అద్భుతంగా చిత్రీకరించాడు. ఈ సమయంలో జ్యూలు ఫోటోగ్రాఫర్‌తో చెప్పిన విషయం ప్రపంచంలో ఎక్కడికెళ్లినా దొరకని స్వతంత్రం భారతదేశంతో లభిస్తోందని. ఆ మాట విన్న ఫోటోగ్రాఫర్ కళ్లలో నీళ్లు గిర్రున తిరిగాయి. ప్రస్తుతం దేశంలో చాలా తక్కువ మంది జ్యూలు ఉన్నారు. వారి వర్గం క్రమంగా తగ్గిపోతోంది.