సాక్షి, హైదరాబాద్: డిగ్రీ ఆన్‌లైన్ ప్రవేశాలకు జూన్ మొదటి వారంలో నోటిఫికేషన్‌ను జారీ చేసేందుకు డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్, తెలంగాణ (దోస్త్) కసరత్తు చేస్తోంది. జూన్ రెండో వారంలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర ఫలితాలు వెలువడగానే డిగ్రీ ప్రవేశాల రిజిస్ట్రేషన్ ప్రారంభించేలా షెడ్యూల్ సి ద్ధం చేస్తున్నట్లు దోస్త్ కన్వీనర్ ఆర్.లింబాద్రి తెలి పారు. కరోనా నేపథ్యంలో విద్యార్థులంతా ఈసేవ/మీసేవ కేంద్రాల వద్ద అధిక సంఖ్యలో ఉండకుం డా చూసేందుకు, భౌతిక దూరం పాటించేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించా రు. ఈసారి దరఖాస్తుల సమయంలో బయోమెట్రి క్ అథెంటికేషన్ (థంబ్ ఇంప్రెషన్) లేకుండానే ప్రవేశాలు చేపట్టాలని నిర్ణయించినట్లు చెప్పా రు. వేలిముద్రల స్వీకర ణ సమయంలో కరోనా వ్యాప్తికి అవకాశము న్నందున దానిని తొలగించినట్లు పేర్కొన్నారు.
దీంతో విద్యార్థులు ఇంట్లో ఉండి కూడా డిగ్రీ ప్రవేశాల కోసం ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని, క్రెడిట్ కార్డు/డెబిట్/ఆన్‌లైన్ బ్యాంకింగ్ ద్వారా ఫీజు చెల్లించవచ్చ ని తెలిపారు. ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించే సదుపాయం లేని వారు మాత్రం ఈసేవ/మీసేవ కేంద్రాల ద్వారా ఫీజు చెల్లించవచ్చని వివరించారు. ఇప్పటివరకు విద్యార్థులు దరఖాస్తు చేసే సమయంలో మొౖ బెల్ నంబరు తప్పకుండా ఇవ్వాలని, అది కూడా ఆధార్ లింక్డ్ మొబైల్ నంబరై ఉండాలన్న నిబం ధన ఉందన్నారు. ప్రస్తుతం దానిని కూడా తొలగించేందుకు కసరత్తు చేస్తున్నట్లు వెల్లడిం చారు. ఇక విద్యార్థి దరఖాస్తుచేసే సమయంలో తనవద్ద ఉండే (లేదా తల్లిదండ్రులది) మొబైల్ నం బరును మాత్రమే ఇచ్చి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఒక మొబైల్ నుంచి ఒకే దరఖాస్తును స్వీకరించేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
ఫేస్‌బుక్, ట్విట్టర్ ఖాతాలతో పాటు వాట్సాప్ నంబర్
డిగ్రీ ప్రవేశాలకు సంబంధించి విద్యార్థులకు సమ గ్ర సమాచారం అందించేందుకు ఈసారి ఫేస్‌బుక్ (facebook.com/ dost.telangana/), ట్విట్టర్ (twitter.com/dost_telangana) ఖాతాలను అందుబాటులోకి తెస్తున్నట్లు చెప్పారు. రియల్ టైమ్ ఇన్‌ఫర్మేషన్ అందించేలా దోస్త్ బిజినెస్ వా ట్సాప్ పేరుతో వాట్సాప్ నంబరు 7901002200 అందుబాటులోకి తెస్తున్నట్లు వెల్లడించారు. విద్యార్థుల దరఖాస్తు పూర్తయితే పూర్తయినట్లుగా, పూర్తి కాకపోతే పూర్తి కాలేదని, ఇతరత్రా దోస్త్ సమగ్ర సమాచారం ఈ వాట్సాప్ నంబరు ద్వారా విద్యార్థులకు అందేలా చర్యలు చేపట్టినట్లు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment