Degree online applications
-
జూన్ మొదటి వారంలో ‘దోస్త్’ నోటిఫికేషన్!
సాక్షి, హైదరాబాద్: డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాలకు జూన్ మొదటి వారంలో నోటిఫికేషన్‌ను జారీ చేసేందుకు డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్, తెలంగాణ (దోస్త్) కసరత్తు చేస్తోంది. జూన్ రెండో వారంలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర ఫలితాలు వెలువడగానే డిగ్రీ ప్రవేశాల రిజిస్ట్రేషన్ ప్రారంభించేలా షెడ్యూల్ సి ద్ధం చేస్తున్నట్లు దోస్త్ కన్వీనర్ ఆర్.లింబాద్రి తెలి పారు. కరోనా నేపథ్యంలో విద్యార్థులంతా ఈసేవ/మీసేవ కేంద్రాల వద్ద అధిక సంఖ్యలో ఉండకుం డా చూసేందుకు, భౌతిక దూరం పాటించేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించా రు. ఈసారి దరఖాస్తుల సమయంలో బయోమెట్రి క్ అథెంటికేషన్ (థంబ్ ఇంప్రెషన్) లేకుండానే ప్రవేశాలు చేపట్టాలని నిర్ణయించినట్లు చెప్పా రు. వేలిముద్రల స్వీకర ణ సమయంలో కరోనా వ్యాప్తికి అవకాశము న్నందున దానిని తొలగించినట్లు పేర్కొన్నారు. దీంతో విద్యార్థులు ఇంట్లో ఉండి కూడా డిగ్రీ ప్రవేశాల కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని, క్రెడిట్ కార్డు/డెబిట్/ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా ఫీజు చెల్లించవచ్చ ని తెలిపారు. ఆన్లైన్లో ఫీజు చెల్లించే సదుపాయం లేని వారు మాత్రం ఈసేవ/మీసేవ కేంద్రాల ద్వారా ఫీజు చెల్లించవచ్చని వివరించారు. ఇప్పటివరకు విద్యార్థులు దరఖాస్తు చేసే సమయంలో మొౖ బెల్ నంబరు తప్పకుండా ఇవ్వాలని, అది కూడా ఆధార్ లింక్డ్ మొబైల్ నంబరై ఉండాలన్న నిబం ధన ఉందన్నారు. ప్రస్తుతం దానిని కూడా తొలగించేందుకు కసరత్తు చేస్తున్నట్లు వెల్లడిం చారు. ఇక విద్యార్థి దరఖాస్తుచేసే సమయంలో తనవద్ద ఉండే (లేదా తల్లిదండ్రులది) మొబైల్ నం బరును మాత్రమే ఇచ్చి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఒక మొబైల్ నుంచి ఒకే దరఖాస్తును స్వీకరించేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఫేస్బుక్, ట్విట్టర్ ఖాతాలతో పాటు వాట్సాప్ నంబర్ డిగ్రీ ప్రవేశాలకు సంబంధించి విద్యార్థులకు సమ గ్ర సమాచారం అందించేందుకు ఈసారి ఫేస్బుక్ (facebook.com/ dost.telangana/), ట్విట్టర్ (twitter.com/dost_telangana) ఖాతాలను అందుబాటులోకి తెస్తున్నట్లు చెప్పారు. రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ అందించేలా దోస్త్ బిజినెస్ వా ట్సాప్ పేరుతో వాట్సాప్ నంబరు 7901002200 అందుబాటులోకి తెస్తున్నట్లు వెల్లడించారు. విద్యార్థుల దరఖాస్తు పూర్తయితే పూర్తయినట్లుగా, పూర్తి కాకపోతే పూర్తి కాలేదని, ఇతరత్రా దోస్త్ సమగ్ర సమాచారం ఈ వాట్సాప్ నంబరు ద్వారా విద్యార్థులకు అందేలా చర్యలు చేపట్టినట్లు వివరించారు. -
డిగ్రీ ఆన్లైన్ దరఖాస్తుల గడువు పెంపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ప్రారంభించిన ఆన్లైన్ దరఖాస్తుల గడువును మరికొన్ని రోజులు పొడిగిస్తామని విద్యాశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య తెలిపారు. రెండు మూడు రోజుల్లో పొడిగింపు తేదీలను ప్రకటిస్తామని పేర్కొన్నారు. డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాలపై రంజీవ్ ఆచార్య బుధవారం వివిధ డిగ్రీ కాలేజీల ప్రిన్సిపాళ్లు, హెల్ప్‌లైన్ కేంద్రాల ఇన్‌చార్జీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ విద్యా సంవత్సరం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆన్లైన్ ప్రవేశాలను పక్కాగా జరిగేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఈసారి ప్రవేశాలకోసం అతితక్కువమంది రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి కారణాలేంటని ఆచార్య ప్రశ్నించగా, ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు వచ్చాక ప్రవేశాలు పెరుగుతాయని, వారంతా దరఖాస్తు చేసుకునేలా గడువును పొడిగించాలని ప్రిన్సిపాళ్లు కోరారు. ఇందుకు రంజీవ్ ఆచార్య ఆమోదం తెలిపారు. గురువారం నుంచి ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని కాలేజీల్లోనూ ప్రవేశాలకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. 33 ప్రభుత్వ డిగ్రీ కాలే జీల భవనాలకు రూ. 74.25 కోట్లు తెలంగాణ రాష్ట్రంలో 33 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలకు (జీడీసీ) సొంత భవనాలను నిర్మించేందుకు ప్రభుత్వం రూ.74.25 కోట్లు మంజూరు చేసింది. అలాగే మెదక్ జిల్లా జోగిపేట్, మహబూబ్‌నగర్ జిల్లా నాగర్‌కర్నూలు, ఖమ్మం పట్టణంలో మహిళా డిగ్రీ కళాశాలల్లో అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలను పూర్తి చేయడానికి 2.49 కోట్ల రూపాయలు కేటాయించింది. ఇవీ కొత్త భవనాలు నిర్మించే కాలేజీల వివరాలు కరీంనగర్: జీడీసీ హుస్నాబాద్, గంభీరావుపేట, మహదేవ్పూర్, చొప్పదండి. ఖమ్మం: జీడీసీ నేలకొండపల్లి, గార్ల. వరంగల్: జీడీసీ భూపాలపల్లి, చేర్యాల,మరిపెడ మహబూబ్‌నగర్: జీడీసీ ఆమ్రాబాద్, కొడంగల్, జీడీసీ (డబ్ల్యూ) నాగర్‌కర్నూల్, గద్వాల, జీడీసీ కొల్లాపూర్, షాద్‌నగర్, శాంతినగర్. మెదక్: జీడీసీ (డబ్ల్యూ) సిద్దిపేట్, గజ్వేల్, జోగిపేట్, మెదక్, జీడీసీ పటాన్చెరు, నర్సాపూర్, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ బుద్దెర. నల్లగొండ: జీడీసీ ఆలేరు, హుజూర్నగర్. నిజామాబాద్: జీడీసీ మోర్తాడ్, దర్పల్లి. రంగారెడ్డి: జీడీసీ చేవెళ్ల, ఇబ్రహీంపట్నం, కూకట్పల్లి, తాండూరు, హయత్‌నగర్, విద్యానగర్.