భారీ బ్యాటరీతో ‘కె10000 ప్రొ’ త్వరలో
చైనీస్ కంపెనీ ఆకిటెల్ భారీ బ్యాటరీ సామర్ధ్యంతో తన తాజా స్మార్ట్ ఫోన్ ను త్వరలోనే లాంచ్ చేయనుంది. ఒక్కసారి చార్జింగ్ చేస్తే వారం రోజుల పాటు పనిచేసేలా ఓ కొత్త స్మార్ట్ ఫోన్ అభివృద్ధి చేస్తున్నామంటూ చైనా కంపెనీ ఆకిటెల్ 2015లో లైమ్ లైట్‌లోకి వచ్చింది. 10వేల ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యంతో ’కె 10000 ప్రొ’ పేరుతో దీన్ని అందుబాటులోకి తెస్తున్నట్టు సమాచారం. తాజా నివేదికల ప్రకారం ఈ ఏడాది జూన్‌లోనే ఈ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయనుంది. టు బి ద కింగ్ అనే ట్యాగ్ లైన్ తో ఉన్న ఆ స్మార్ట్‌ఫోన్ ఫోటో ఇపుడు నెట్ లో హల్‌చల్ చేస్తోంది. దీని ప్రకారం ఫింగర్ ప్రింట్ సెన్సర్‌ను వెనుక భాగంలో అమర్చింది. కె 10000ప్రో వేరియంట్ ఇతర ఫీచర్లపై అంచనాలు ఈ విధంగా ఉన్నాయి.
కె 10000ప్రో ఫీచర్స్
కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్
5.5 అంగుళాల డిస్‌ప్లే
1080x1920 పిక్సెల్స్ రిజల్యూషన్,
1.5 మీడియా టెక్ ఎంటీ6750టీ ఆక్టా-కోర్ ప్రాసెసర్
3 జీబీ ర్యామ్,
32 జీబీ ఇంటర్నెల్ స్టోరేజ్