ఫెడ్ రిజర్వు ఆసియన్ మార్కెట్లకి షాకినిచ్చింది. జూన్ లో మరోమారు వడ్డీరేట్లను పెంచబోతున్నట్టు సంకేతాలు విడుదల చేసింది. బుధవారం జరిగిన ఫెడ్ సెంట్రల్ బ్యాంకు ఏప్రిల్ పాలసీ సమావేశం అనంతరం అమెరికా ఆర్థికవ్యవస్థ బాగుంటే జూన్ లో వడ్డీరేట్ల పెంపుకు సిద్దంగా ఉన్నామని అధికారులు వ్యక్తంచేసినట్టు మినిట్స్ వెల్లడించింది. రెండో త్రైమాసికంలో అమెరికా ఆర్థికాభివృద్ధి మెరుగుపడిందని, ఉద్యోగావకాశాలు, ద్రవ్యోల్బణం పెరగిందని సంకేతాలు వచ్చాయి. దీంతో జూన్ లో ఫెడ్ వడ్డీరేట్లను పెంచబోతున్నట్టు మినిట్స్ నివేదించింది.
అయితే వాల్ స్ట్రీట్ అంచనా వేసిన దానికంటే చాలా త్వరగానే జూన్ లో ఫెడ్ వడ్డీరేట్లను పెంచుతాదనే తెలుస్తోంది. దాదాపు 34శాతం ఫెడ్ జూన్ లో రేట్ల పెంపుకే అవకాశముందని ట్రేడర్స్ అభిప్రాయం వ్యక్తంచేశారు. మినిస్ట్స్ విడుదల చేసిన ఈ రిపోర్టుతో మార్కెట్లో డాలర్ బలపడింది. ఫెడ్ 2శాతం టార్గెట్ కు ద్రవ్యోల్బణం పెరుగుతుందని పాలసీమేకర్స్ వ్యక్తంచేసినట్టు తాజా డేటాలో వెల్లడైంది. ఈ సంకేతాల ప్రభావం ఆసియన్ స్టాక్ మార్కెట్లపై చూపించింది. ఈ సంకేతాలతో ఆసియన్ మార్కెట్లు ఒడిదుడుకులకు గురవుతున్నాయి. 2008 లో నెలకొన్న ఆర్థికమందగమనంతో ఫెడ్ రిజర్వు రేట్లను 0శాతానికి ఉంచింది. దాదాపు దశాబ్దం అనంతరం అమెరికా ఆర్థికవ్యవస్థ కొంత మెరుగుపడిందని గణాంకాలు చూపడంతో, డిసెంబర్ లో మొదటిసారి ఫెడ్ వడ్డీరేట్లను 0.25 శాతం-0.50 శాతం పెంచింది.