ముంబై: బ్యాంకుల నుంచి ఎన్‌బీఎఫ్‌సీలు భారీగా నిధుల సమీకరణ చేస్తున్నాయి. ఎన్‌బీఎఫ్‌సీలకు బ్యాంకుల రుణాలు జూన్‌లో 35 శాతం పెరిగి రూ.14.2 లక్షల కోట్లకు చేరినట్టు కేర్ రేటింగ్స్ తెలిపింది. ఎన్‌బీఎఫ్‌సీలు అంతర్జాతీయ రుణాలపై ఆ ధారపడడాన్ని తగ్గించినట్టు ఇది తెలియజేస్తోందని పేర్కొంది. మొత్తం రుణాల్లో ఎన్‌బీఎఫ్‌సీల వాటా 2022 జూన్ నాటికి ఉన్న 8.5 శాతం నుంచి ఈ ఏడాది జూన్ నాటికి 9.9 శాతానికి పెరిగినట్టు కేర్ రేటింగ్స్ సీనియర్ డైరెక్టర్ సంజయ్ అగర్వాల్ తెలిపారు.
హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ విలీనం జూలై 1 నుంచి అమల్లోకి వచి్చనందున.. బ్యాంకుల రుణాల్లో ఎన్‌బీఎఫ్‌సీల వాటా తగ్గుతుందని అంచనా వేసింది. హెచ్‌డీఎఫ్‌సీ రుణాలు పునర్‌వర్గీకరణకు గురవుతాయని పేర్కొంది. ఎన్‌బీఎఫ్‌సీలకు మ్యూచువల్ ఫండ్స్ డెట్ పథకాల ఎక్స్‌పోజర్ సై తం జూన్‌లో 14.5 శాతం పెరిగి రూ.1.62 లక్షల కోట్లకు చేరుకున్నట్టు కేర్ రేటింగ్స్ వివరించింది.
బ్యాంకుల రుణాల్లో ఎన్‌బీఎఫ్‌సీల వాటా 2018 ఫిబ్రవరి నాటికి 4.5 శాతంగా ఉంటే, అది ఈ ఏడా ది జూన్ నాటికి 10 శాతానికి చేరుకున్నట్టు తెలిపింది. 2021–22 ద్వితీయ ఆరు నెలల కాలం నుంచి ఎన్‌బీఎఫ్‌సీలకు బ్యాంకుల రుణాలు పెరుగుతూ వ స్తున్నట్టు కేర్‌రేటింగ్స్ వెల్లడించింది. కరోనా తర్వా త ఆరి్థక కార్యకలాపాలను తిరిగి పూర్తి స్థాయిలో తెరవడం ఇందుకు అనుకూలించినట్టు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment