Care Ratings
-
ఎన్‌బీఎఫ్‌సీలకు భారీగా బ్యాంకు రుణాలు
ముంబై: బ్యాంకుల నుంచి ఎన్బీఎఫ్సీలు భారీగా నిధుల సమీకరణ చేస్తున్నాయి. ఎన్‌బీఎఫ్‌సీలకు బ్యాంకుల రుణాలు జూన్‌లో 35 శాతం పెరిగి రూ.14.2 లక్షల కోట్లకు చేరినట్టు కేర్ రేటింగ్స్ తెలిపింది. ఎన్బీఎఫ్సీలు అంతర్జాతీయ రుణాలపై ఆ ధారపడడాన్ని తగ్గించినట్టు ఇది తెలియజేస్తోందని పేర్కొంది. మొత్తం రుణాల్లో ఎన్‌బీఎఫ్‌సీల వాటా 2022 జూన్ నాటికి ఉన్న 8.5 శాతం నుంచి ఈ ఏడాది జూన్ నాటికి 9.9 శాతానికి పెరిగినట్టు కేర్ రేటింగ్స్ సీనియర్ డైరెక్టర్ సంజయ్ అగర్వాల్ తెలిపారు. హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ విలీనం జూలై 1 నుంచి అమల్లోకి వచి్చనందున.. బ్యాంకుల రుణాల్లో ఎన్‌బీఎఫ్‌సీల వాటా తగ్గుతుందని అంచనా వేసింది. హెచ్డీఎఫ్సీ రుణాలు పునర్వర్గీకరణకు గురవుతాయని పేర్కొంది. ఎన్‌బీఎఫ్‌సీలకు మ్యూచువల్ ఫండ్స్ డెట్ పథకాల ఎక్స్పోజర్ సై తం జూన్‌లో 14.5 శాతం పెరిగి రూ.1.62 లక్షల కోట్లకు చేరుకున్నట్టు కేర్ రేటింగ్స్ వివరించింది. బ్యాంకుల రుణాల్లో ఎన్‌బీఎఫ్‌సీల వాటా 2018 ఫిబ్రవరి నాటికి 4.5 శాతంగా ఉంటే, అది ఈ ఏడా ది జూన్ నాటికి 10 శాతానికి చేరుకున్నట్టు తెలిపింది. 2021–22 ద్వితీయ ఆరు నెలల కాలం నుంచి ఎన్‌బీఎఫ్‌సీలకు బ్యాంకుల రుణాలు పెరుగుతూ వ స్తున్నట్టు కేర్‌రేటింగ్స్ వెల్లడించింది. కరోనా తర్వా త ఆరి్థక కార్యకలాపాలను తిరిగి పూర్తి స్థాయిలో తెరవడం ఇందుకు అనుకూలించినట్టు తెలిపింది. -
హెచ్డీఎఫ్సీ విలీనంతో రుణ డిమాండ్ క్షీణత
ముంబై: హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లో హెచ్డీఎఫ్సీ విలీనంతో రుణ వితరణ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 300 బేసిస్ పాయింట్ల వరకు (3 శాతం) తగ్గి 13–13.5 శాతానికి పరిమితం కావొచ్చని కేర్ రేటింగ్స్ అంచనా వేసింది. గత ఆర్థిక సంవత్సరంలో రుణాల్లో వృద్ధి 15.4 శాతంగా ఉన్న విషయాన్ని ప్రస్తావించింది. జూన్ 16 నాటికి ముగిసిన పక్షం రోజుల్లో రుణ వితరణ 15.4 శాతం పెరిగి ఈ ఏడాది రూ.140.2 లక్షల కోట్లకు చేరుకున్నట్టు వెల్లడించింది. ముఖ్యంగా వ్యక్తిగత రుణాలు ఈ డిమాండ్‌ను నడిపించినట్టు చెప్పింది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న 13.2 శాతం వృద్ధి కంటే ఎక్కువ నమోదైంది. డిపాజిట్లు కూడా జూన్ 16తో ముగిసిన పక్షం రోజుల్లో 12.1 శాతం పెరిగాయి. రుణాలు, డిపాజిట్ల మధ్య అంతరం 337 బేసిస్ పాయింట్లుగా ఉంది. ఇక గడిచిన 12 నెలల్లో డిపాజిట్లు రూ.20 లక్షల కోట్లకు విస్తరించగా, రుణాలు రూ.18.7 లక్షల కోట్లకు చేరుకున్నట్టు కేర్ రేటింగ్స్ నివేదిక తెలిపింది. -
దశాబ్ద కనిష్టానికి గృహ రుణ రేట్లు
ముంబై: వ్యవస్థలో నిధుల లభ్యత (లిక్విడిటీ) పెరగడంతో గృహ రుణ రేట్లు దశాబ్ద కనిష్టానికి దిగొచ్చాయి. ఇలా రేట్లను తగ్గించిన వాటిల్లో ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంకు, కోటక్ మహీంద్రా బ్యాంకు సైతం ఉన్నాయి. గత వారం చివరికి బ్యాంకింగ్ వ్యవస్థలో రూ.6.5 లక్షల కోట్ల నిధుల మిగులు ఉన్నట్టు కేర్ రేటింగ్స్ గణాంకాల ఆధారంగా తెలుస్తోంది. ఈ డిపాజిట్లు అన్నీ సేవిం గ్స్ ఖాతాల్లోనివే అనుకున్నా.. వాటిపై కనీసం 2.5 శాతం చొప్పున వార్షిక వడ్డీ రేటును బ్యాంకులు చెల్లించుకోవాల్సి వస్తుంది. దీంతో గృహ రుణాలపై రేట్లను స్వల్ప మార్జిన్‌తోనే ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకు వస్తున్నాయి. ఆర్బీఐ గణాంకాల ప్రకారం 2020–21లో గృహ రుణాల జారీలో వేగం తగ్గింది. 2020 జనవరిలో గృహ రుణాల మంజూరులో 17.5 శాతం ఉండగా.. 2021 జనవరిలో ఇది 7.7 శాతానికే పరిమితమైం ది. కరోనా మహమ్మారి ఎంతో మంది ఆర్థిక పరిస్థితులను తలకిందులు చేసిన విషయం తెలిసిందే. రిస్క్‌కు దూరం..: నిధుల లభ్యత అధికంగా ఉన్నప్పటికీ బ్యాంకులు రిస్క్ తీసుకునేందుకు ధైర్యం చేయలేకపోతున్నాయి. దీంతో కొంత వరకు భద్రత ఉండే గృహ రుణాల వైపు మొగ్గు చూపుతున్నాయి. వ్యక్తిగత రుణాలన్నవి అన్సెక్యూర్డ్వి. అదే గృహ రుణాల్లో ప్రాపర్టీ బ్యాంకు తనఖాలో ఉంటుంది. అందుకే ఎన్పీఏలు ఈ విభాగంలో 1% కంటే తక్కువే ఉంటున్నాయి. ఇటీవలి కాలంలో ఆర్థిక వ్యవస్థ వేగంగా రికవరీ అవుతుండడంతో ఇళ్ల కొనుగోలు డిమాండ్ పెరుగుతుందని బ్యాంకులు అంచనా వేస్తున్నాయి. వినియోగదారులకూ గృ హ రుణాల విషయంలో ప్రస్తుతం పలు ప్రయోజనాలు ఉన్నాయి. గృహ రుణాలపై పన్ను రాయితీలు, అందుబాటులో ప్రాపర్టీ ధరలు, పలు చోట్ల స్టాంప్‌డ్యూటీ చార్జీల తగ్గింపు వంటివి ఆకర్షణీయమైనవే. క్రెడిట్ స్కోరే ప్రామాణికం.. ఇక అందరికీ ఒకటే రేటు అని కాకుండా.. మెరుగైన రుణ చరిత్ర ఉన్నవారికి బ్యాంకులు ఆకర్షణీయమైన వడ్డీకే గృహ రుణాలను ఇస్తున్నాయి. ఎస్బీఐ 6.7 శాతం, కోటక్ బ్యాంకు 6.65 శాతం చొప్పున తాజా ఆఫర్లను తీసుకొచ్చాయి. కానీ, 800 కంటే ఎక్కువ క్రెడిట్ స్కోరు ఉన్న వారికే ఈ రేట్లు వర్తిస్తాయి. వాస్తవానికి గృహ రుణాలపై వడ్డీ రేట్ల తగ్గింపు విషయంలో బ్యాంకుల మధ్య పోటీకి తెరతీసింది ఎస్బీఐనే. గృహ రుణ మార్కెట్లో 34 శాతం వాటా కలిగిన ఎస్బీఐ 10 బేసిస్ పాయింట్ల మేర రేట్లను తగ్గిస్తూ 6.7%> మార్చి 1న ప్రకటించింది. దీంతో ఇతర అగ్రగామి బ్యాంకులూ ఇదే బాటలో నడవక తప్పలేదు. -
మన కంపెనీల విదేశీ పెట్టుబడులు అదరహో
ముంబై: విదేశాల్లో మన కంపెనీల పెట్టుబడులు జోరుగా పెరుగుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020–21) ఎనిమిది నెలల కాలంలో భారత కంపెనీలు విదేశాల్లో 1,225 కోట్ల డాలర్ల మేర ఇన్వెస్ట్ చేశాయని కేర్ రేటింగ్స్ వెల్లడించింది. భారత కంపెనీలకు సంబంధించి విదేశీ పెట్టుబడులపై ఈ సంస్థ పేర్కొన్న కొన్ని ముఖ్యాంశాలు... ► మన కంపెనీలు విదేశాల్లో ముఖ్యంగా అమెరికా, సింగపూర్, నెదర్లాండ్స్‌ల్లోని తమ అనుబంధ సంస్థల్లో అధికంగా పెట్టుబడులు పెట్టాయి. ► ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–అక్టోబర్ కాలానికి మన కంపెనీలు అమెరికాలో 236 కోట్ల డాలర్లు ఇన్వెస్ట్ చేశాయి. సింగపూర్‌లో 207 కోట్ల డాలర్లు, నెదర్లాండ్స్‌లో 150 కోట్ల డాలర్లు, బ్రిటిష్ వర్జిన్ ఐల్యాండ్స్‌లో 137 కోట్ల డాలర్లు, మారిషస్‌లో 130 కోట్ల డాలర్లు చొప్పున మన కంపెనీలు పెట్టుబడులు పెట్టాయి. మన కంపెనీలు విదేశాల్లో ఇన్వెస్ట్ చేసిన నిధుల్లో దాదాపు 70 శాతం వాటా ఈ ఐదు దేశాలదే కావడం గమనార్హం. ► ఇక కంపెనీల పరంగా అత్యధికంగా విదేశాల్లో ఇన్వెస్ట్ చేసిన కంపెనీగా ఓఎన్జీసీ విదేశ్ (185 కోట్ల డాలర్లు) నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో జేఎస్‌డబ్ల్యూ స్టీల్(87 కోట్ల డాలర్లు), హల్దియా పెట్రోకెమికల్స్(60 కోట్ల డాలర్లు), హెచ్‌సీఎల్ టెక్నాలజీస్(59 కోట్ల డాలర్లు), మహీంద్రా అండ్ మహీంద్రా(55 కోట్ల డాలర్లు), అదానీ ప్రాపర్టీస్(39 కోట్ల డాలర్లు), లుపిన్ (38 కోట్ల డాలర్లు), పిరమల్ ఎంటర్ప్రైజెస్ (31 కోట్ల డాలర్లు), క్యాడిలా హెల్త్‌కేర్(22 కోట్ల డాలర్లు), ఇన్ఫోసిస్(22 కోట్ల డాలర్లు), టాటా స్టీల్(20 కోట్ల డాలర్లు) నిలిచాయి. ► గత ఆర్థిక సంవత్సరం(2019–20)లో భారత కంపెనీలు 1,300 కోట్ల డాలర్ల మేర విదేశాల్లో ఇన్వెస్ట్ చేశాయి. మన కంపెనీల విదేశీ ఇన్వెస్ట్మెంట్స్ 1,000 కోట్ల డాలర్లు మించడం ఇది వరుసగా రెండో ఆర్థిక సంవత్సరం. ► 2008–09 ఆర్థిక సంవత్సరంలో మన కంపెనీలు అత్యధికంగా 1,900 కోట్ల డాలర్లు విదేశాల్లో ఇన్వెస్ట్ చేశాయి. 2007–08 ఆర్థిక సంవత్సరంలో కూడా 1,800 కోట్ల డాలర్లు పెట్టుబడులు పెట్టాయి. ► ఇక ఈ ఆర్థిక సంవత్సరం ఇప్పటివరకూ మన కంపెనీలు విదేశాల్లో చేసిన ఇన్వెస్ట్‌మెంట్స్‌లో 297 కోట్ల డాలర్లు ఈక్విటీ సెగ్మెంట్లో ఉన్నాయి. 338 కోట్ల డాలర్లు తీర్చాల్సిన రుణాలు కాగా, 590 కోట్ల డాలర్లు గ్యారంటీల రూపంలో ఇచ్చాయి. ► ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–ఆగస్టు కాలానికి భారత్‌లోకి మొత్తం 3,573 కోట్ల డాలర్ల ఎఫ్‌డీఐలు వచ్చాయి. ఒక ఆర్థిక సంవత్సరం తొలి ఐదు నెలల కాలంలో ఈ స్థాయి ఎఫ్‌డీఐలు రావడం ఇదే రికార్డ్ స్థాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి వచ్చిన ఎఫ్‌డీఐలు(3,160 కోట్ల డాలర్లు)తో పోల్చితే ఇది 13 శాతం అధికం. రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన రిటైల్, టెలికం విభాగాలు జోరుగా ఎఫ్‌డీఐలను ఆకర్షించాయి. ► గత ఆర్థిక సంవత్సరంలో 7,600 కోట్ల డాలర్ల ఎఫ్‌డీఐలు మన దేశంలోకి వచ్చాయి. రిప్రాట్రియేషన్ సర్దుబాటు అనంతరం నికరంగా 5,600 కోట్ల డాలర్ల ఎఫ్‌డీఐలు వచ్చాయి. ఈ స్థాయి ఎఫ్‌డీఐలు రావడం ఇదే మొదటిసారి కావడం విశేషం. -
Q2 ఎఫెక్ట్- కేర్ రేటింగ్స్ దూకుడు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో రేటింగ్స్ దిగ్గజం.. కేర్ రేటింగ్స్ కౌంటర్‌కు భారీ డిమాండ్ నెలకొంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూ కట్టడంతో ఈ షేరు 20 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. కొనుగోలుదారులు అధికంకాగా.. అమ్మేవాళ్లు కరువుకావడంతో ఎన్ఎస్ఈలో ప్రస్తుతం రూ. 61 జంప్‌చేసి రూ. 365.4 వద్ద ఫ్రీజయ్యింది. ఈ కౌంటర్లో ట్రేడింగ్ ప్రారంభమైన తొలి రెండు గంటల్లోనే ఏకంగా 6.29 మిలియన్ షేర్లు చేతులు మారాయి. ఇది కంపెనీ మొత్తం ఈక్విటీలో 21 శాతం వాటాకాగా.. 15 రెట్లు అధిక పరిమాణం నమోదుకావడం గమనార్హం! రెండు ఎక్స్ఛేంజీలలోనూ కలిపి 4 లక్షలకుపైగా కొనుగోలు ఆర్డర్లు పెండింగ్‌లో ఉన్నట్లు మార్కెట్ వర్గాలు తెలియజేశాయి. పనితీరు భేష్ ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో కేర్ రేటింగ్స్ నికర లాభం నాలుగు రెట్లు ఎగసి రూ. 36 కోట్లకు చేరింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం రెట్టింపునకుపైగా ఎగసి రూ. 76 కోట్లను తాకింది. త్రైమాసిక ప్రాతిపదికన విడుదల చేసిన ఫలితాలివి. వాటాదారులకు షేరుకి రూ. 8 చొప్పున మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. ప్రభుత్వ వ్యయాలు పెరగనుండటం, బాండ్ మార్కెట్ల పురోగతి, ప్రైవేట్ పెట్టుబడులు వంటి అంశాలు ఇకపై కంపెనీ పనితీరు మరింత మెరుగు పడేందుకు దోహదపడనున్నట్లు కేర్ రేటింగ్స్ సీఈవో అజయ్ మహాజన్ పేర్కొన్నారు. -
కంపెనీలకు మందగమనం కష్టాలు
ముంబై: ఆర్థిక వ్యవస్థ మందగమన ప్రభావం కంపెనీలపై తీవ్రమైన ప్రభావమే చూపుతోంది. ఈ మందగమనం కారణంగా ఈ జూన్ క్వార్టర్లో పలు కంపెనీల ఆదాయాలు, లాభా ల వృద్ధి భారీగా తగ్గాయని కేర్ రేటింగ్స్ తాజా నివేదిక పేర్కొంది. మొత్తం 2,976 కంపెనీల ఆర్థిక ఫలితాలను విశ్లేషించి కేర్ రేటింగ్స్ సంస్థ ఈ నివేదికను రూపొందించింది. ఈ నివేదిక ఏం చెప్పిందంటే.. ♦ భారత కంపెనీల నికర అమ్మకాల వృద్ది ఈ ఆర్థిక సంవత్సరం జూన్ క్వార్టర్లో 4.6 శాతానికి తగ్గింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో ఇది 13.5 శాతంగా ఉంది. ♦ గత క్యూ1లో 24.6 శాతంగా ఉన్న నికర లాభ వృద్ధి క్యూ1లో 6.6 శాతానికి తగ్గింది. ♦ బలహీనంగా, అంతంతమాత్రంగానే ఉన్న ఈ క్యూ1 ఫలితాలు.. ఆర్థిక వ్యవస్థ, వివిధ రంగాల పరిశ్రమలు మందగమనంలోకి జారిపోయాయని సూచిస్తున్నాయి. ♦ ఇంత తీవ్ర స్థాయి ఇబ్బందుల్లోనూ ఊరటనిచ్చే విషయం ఒకటుంది. సంఘటిత రంగంలోని ఉద్యోగాలపై మందగమన ప్రభావం పెద్దగా లేదు. ఈ రంగ ఉద్యోగుల వ్యయాల వృద్ధి నిలకడగానే కొనసాగుతోంది. కొన్ని రంగాల్లో ఉద్యోగాల వేతనాలు 11 శాతం మేర పెరిగాయి కూడా. ♦ మార్చి క్వార్టర్లో వృద్ధి ఐదేళ్ల కనిష్టానికి, 5.8 శాతానికి పడిపోయింది.జూన్ క్వార్టర్లో మరింతగా దిగజారే ప్రమాదం ఉంది. ♦ గత క్యూ1లో రెండంకెల వృద్ధి సాధించిన నిర్వహణ లాభ వృద్ధి ఈ క్యూ1లో 4.1 శాతానికి పడిపోయింది. నిర్వహణ లాభ మార్జిన్ మాత్రం నిలకడగా 20 శాతం స్థాయిలో ఉంది. ♦ గత క్యూ1లో 53% వృద్ధి సాధించిన నికర లాభం ఈ క్యూ1లో 12 శాతానికి తగ్గింది. ♦ బ్యాంక్‌లు, ఆర్థిక కంపెనీలు మినహా ఇతర కంపెనీల పన్ను చెల్లింపులు 19% తగ్గింది. గత క్యూ1లో ఇది 52% వృద్ది చెందింది. -
అడ్డూఅదుపూ లేని ఎన్పీఏలు!
న్యూఢిల్లీ: బ్యాంకుల రుణాల్లో మొండి బకాయిల వాటా అడ్డు, అదుపు లేకుండా పెరిగిపోతోంది. ఒక్క ఏడాదిలోనే 26 బ్యాంకుల స్థూల ఎన్పీఏలు ఏకంగా 50 శాతం పెరగడం పరిస్థితికి అద్దం పడుతోంది. 26 బ్యాంకుల ఉమ్మడి స్థూల మొండి బకాయిలు 2017–18లో ఏకంగా రూ.7.31 లక్షల కోట్లకు చేరాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరం గణాంకాలతో పోల్చి చూస్తే 50 శాతం పెరిగినట్లు లెక్క. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పరిస్థితి ఏ మాత్రం మెరుగుపడలేదు. ఒక్క పీఎస్‌యూ బ్యాంకుల నుంచి డిసెంబర్ త్రైమాసిక కాలంలోనే రూ.లక్ష కోట్ల ఎన్పీఏలు జత కాగా, మార్చి త్రైమాసికంలో మరో రూ.1.1 లక్షల కోట్ల మేర పెరిగాయని కేర్ రేటింగ్స్ నివేదిక తెలియజేసింది. మొత్తం ఎన్‌పీఏల్లో ప్రభుత్వ రంగ బ్యాంకుల వాటా సుమారు రూ.6.6 లక్షల కోట్లు కావడం గమనార్హం. అంతకుముందు ఏడాదితో పోల్చి చూస్తే 26 బ్యాంకుల ఎన్పీఏలు నికరంగా రూ.2.5 లక్షల కోట్ల మేర పెరిగినట్టు తెలుస్తోంది. గత ఏడాది జూన్ క్వార్టర్లో స్థూల ఎన్పీఏల శాతం 9.04గా ఉంటే, అది సెప్టెంబర్ క్వార్టర్లో 8.93 శాతానికి తగ్గింది. పోనీలే పరిస్థితి కాస్త మెరుగుపడుతోందని అనుకుంటే... మార్చి త్రైమాసికం నాటికి ఇది ఏకంగా 10.14 శాతానికి పెరిగిపోయింది. అంటే... బ్యాంకులిస్తున్న ప్రతి 100 రూపాయల అప్పులో రూ.10కిపైనే మొండి బాకీగా మారపోతోందన్న మాట. ప్రభుత్వరంగ బ్యాంకుల స్థూల ఎన్పీఏలు మొత్తం రుణాల్లో 13.41 శాతానికి చేరాయి. ప్రభుత్వరంగ బ్యాంకుల ఎన్పీఏల రేషియో 2017 ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో 11–12 శాతం మధ్యనే ఉండగా... ఈ ఏడాది జనవరి–మార్చి త్రైమాసికంలో 1.63 శాతం పెరిగి 13.41 శాతానికి చేరింది. ప్రైవేటు బ్యాంకుల్లోనూ... మార్చి త్రైమాసికంలో ప్రైవేటు రంగ బ్యాంకుల్లోనూ ఎన్పీఏలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. డిసెంబర్ క్వార్టర్లో ఇవి మోస్తరుగానే ఉన్నాయి. మార్చి చివరికి ప్రైవేటు రంగ బ్యాంకులు రూ.18,000 కోట్ల ఎన్పీఏల పెరుగుదలను చూపించాయి. అదే డిసెంబర్ త్రైమాసికంలో పెరిగిన ఎన్పీఏలు కేవలం రూ.1,200 కోట్లే. ఇక 2017–18లో ఎన్పీఏలకు చేసిన కేటాయింపులు అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో ఉన్న రూ.43,611 కోట్ల నుంచి రూ.1,05,150 కోట్లకు పెరిగాయని కేర్ రేటింగ్స్ నివేదిక తెలియజేస్తోంది. పది ప్రభుత్వరంగ బ్యాంకుల్లో స్థూల ఎన్పీఏల రేషియో 10 శాతం పైన ఉంటే, ఐదు ప్రైవేటు రంగ బ్యాంకుల ఎన్పీఏల రేషియో మొత్తం రుణాల్లో 2–5 శాతంగా ఉంది. మరో ఐదు ప్రైవేటు రంగ బ్యాంకుల ఎన్పీఏలు 2 శాతంలోపు ఉన్నాయి. ఇతర బ్యాంకుల ఫలితాలు రావాల్సిఉంది. ఎన్పీఏల పరిస్థితి ఇదీ... ♦ రూ.7.31 లక్షల కోట్లు (26 బ్యాంకుల స్థూల ఎన్పీఏలు) ♦ రూ.2.5 లక్షల కోట్లు (గడిచిన ఏడాదిలో 26 బ్యాంకుల్లో పెరిగిన ఎన్పీఏలు) ♦ రూ.18,000 కోట్లు (మార్చి క్వార్టర్లో ప్రైవేటు బ్యాంకుల్లో పెరిగిన నికర ఎన్పీఏలు) ♦ రూ.1,05,150 కోట్లు (2017–18లో ఎన్పీఏలకు చేసిన కేటాయింపులు) -
రేటు పావుశాతం పెరగొచ్చు: కేర్ రేటింగ్స్
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– రెపోను (ప్రస్తుతం 6 శాతం) 2018లో పావుశాతం పెంచే అవకాశం ఉందని కేర్ రేటింగ్స్ తన తాజా నివేదికలో పేర్కొంది. ద్రవ్యోల్బణం అధిక శ్రేణికి పెరిగే అవకాశం ఉండటమే దీనికి కారణమని పేర్కొంది. ప్రభుత్వ ఆదాయ వ్యయాలకు సంబంధించిన నికర వ్యత్యాసమైన ద్రవ్యలోటు పెరుగుతోందని, చమురు ధరల తీవ్రత, వ్యవసాయ వృద్ధి తగ్గడం వంటివి ధరల పెరుగుదలకు దారితీసే అవకాశం ఉందని అభిప్రాయపడింది. 2 శాతం ప్లస్, 2 శాతం మైనస్‌తో 4 శాతం వద్ద ద్రవ్యోల్బణం ఉండాలన్నది ఆర్బీఐ లక్ష్యం. అయితే ఈ శ్రేణికి మించి ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉందని కేర్ తన నివేదికలో వెల్లడించింది. -
బ్యాంకులకు ‘బ్యాడ్ టైమ్’ ముగిసినట్టే!
న్యూఢిల్లీ: దేశీయ బ్యాంకింగ్ రంగాన్ని కుదిపేస్తున్న మొండి బకాయిల (ఎన్పీఏ) సమస్య ముగిసినట్టేనా...? బ్యాంకుల బాధలు తీరినట్టేనా...? అవుననే అంటోంది ప్రముఖ రేటింగ్స్ సంస్థ కేర్. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్‌కు (జూలై–సెప్టెంబర్) సంబంధించి బ్యాంకులు ఇప్పటి వరకు వెల్లడించిన ఫలితాలను గమనిస్తే ఎన్పీఏల పరంగా దారుణ శకం ముగిసి ఉండొచ్చంటోంది. మొండి బకాయిల పెరుగుదల గణనీయంగా తగ్గినట్టు గణాంకాలను చూస్తే తెలుస్తోందని కేర్ రేటింగ్స్ వ్యాఖ్యానించింది. 2016–17 సెప్టెంబర్ త్రైమాసికంలో ఎన్పీఏల పెరుగుదల 105 శాతంగా నమోదైతే... ప్రస్తుత ఆర్థిక సంవవ్సరం (2017–18) సెప్టెంబర్ క్వార్టర్లో ఎన్పీఏలు కేవలం 26.3 శాతంగానే పెరగడాన్ని నిదర్శనంగా కేర్ తన పరిశోధనా నివేదికలో పేర్కొంది. ప్రైవేటులో పెరిగాయి...! ప్రైవేటు రంగ బ్యాంకుల్లో మాత్రం ఎన్పీఏలు పెరిగాయి. ఆర్బీఐ వార్షిక ఆడిట్ల వల్ల ఖాతాల్లో వ్యత్యాసాలను అవి తప్పనిసరిగా చూపించాల్సి రావడం దీనికి కారణమని కేర్ తెలిపింది. ప్రభుత్వరంగ బ్యాంకులను పరిశీలిస్తే పంజాబ్ నేషనల్ బ్యాంకు ఎన్పీఏలు రూ.6,649 కోట్ల నుంచి రూ.3,500 కోట్లకు తగ్గిపోయాయి. కెనరా బ్యాంకు ఎన్పీఏలు అంతకుముందు త్రైమాసికంతో పోలిస్తే సెప్టెంబర్ క్వార్టర్లో రూ.5,511 కోట్ల నుంచి రూ.3,367 కోట్లకు దిగొచ్చాయి. యూనియన్ బ్యాంకు ఎన్పీఏలు అంతకుముందు ఏడాది ఇదే కాలంలో పోల్చి చూస్తే రూ.4,453 కోట్ల నుంచి రూ.2,686 కోట్లకు క్షీణించాయి. మొండి బకాయిలు పెరిగిపోతున్న దృష్ట్యా బ్యాంకులు అనుసరించిన అప్రమత్తత విధానమే దీనికి కారణమై ఉండొచ్చని కేర్ రేటింగ్స్‌కు చెందిన అనలిస్ట్ మదన్ సబ్నావిస్ అభిప్రాయం వ్యక్తం చేశారు. పెరుగుతున్న కేటాయింపులు మరోవైపు మొండి బాకీలకు నిధుల కేటాయింపులు (ప్రొవిజన్స్) పెరిగిన దృష్ట్యా ఎన్పీఏల గుర్తింపు కొనసాగుతున్నట్టు కేర్ రేటింగ్స్ పేర్కొంది. గణాంకాల ప్రకారం ఎన్పీఏలకు కేటాయింపులు పెరుగుతున్నప్పటికీ, అది సెప్టెంబర్ క్వార్టర్లో 13.6 శాతమేనని, గతేడాది ఇదే కాలంలో ఉన్న 13.8 శాతం కేటాయింపుల కంటే తక్కువేనని కేర్ వివరించింది. అయితే, ఇప్పటికీ గత కాలంలో పోలిస్తే ఎన్పీఏల శాతం ఎక్కువగానే ఉన్నట్టు తెలియజేసింది. 2015–16 రెండో క్వార్టర్లో 4.1 శాతం, 2016–17లో 7.6 శాతం కంటే 2017–18లో ఎన్పీఏల రేషియో 8.7 శాతంగా ఉన్నట్టు వెల్లడించింది. దేశీయ బ్యాంకింగ్ రంగం రూ.8 లక్షల కోట్ల ఎన్పీఏల భారాన్ని మోస్తున్న విషయం తెలిసిందే. మరిన్ని కేసులు దివాళా పరిష్కార చట్టం పరిధిలోకి రానుండడంతో డిసెంబర్ క్వార్టర్లో ఎన్పీఏల పెరుగుదల, వాటికి అధిక కేటాయింపుల భారం ఉండొచ్చని కేర్ అంచనా వేసింది. ‘‘చాలా వరకు మధ్య స్థాయి ప్రభుత్వరంగ బ్యాంకుల పరంగా చెడ్డ కాలం ముగిసినట్టేనని మా అంచనా. ఇది బ్యాం కింగ్ రంగానికి ఆశాజనకం. మొండి బకాయిలుగా మారే రుణా లు క్రమంగా తగ్గిపోవడాన్ని చూడొచ్చు’’ అని ఎస్ఎంసీ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ అనలిస్ట్ సిద్ధార్థ్ పురోహిత్ చెప్పారు. -
‘మొండి’ భారం రెట్టింపు...
కేర్ రేటింగ్స్ వెల్లడి ముంబై: బ్యాంక్‌ల మొండి బకాయిలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో దాదాపు రెట్టింపై 8.5 శాతానికి చేరాయని ప్రముఖ రేటింగ్ సంస్థ, కేర్ రేటింగ్స్ తాజా నివేదిక తెలిపింది. ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల మొండి బకాయిలు భారీగా ఉండడమే దీనికి కారణమంటున్న ఈ నివేదికలో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే.., ⇒ గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో 4.6 శాతంగా ఉన్న బ్యాంక్‌ల మొండి బకాయిలు ఈ క్యూ1లో 8.5 శాతానికి పెరిగాయి. ⇒ గత క్యూ1లో 5.3 శాతంగా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల మొండి బకాయిలు ఈ క్యూ1లో 10.4 శాతానికి ఎగిశాయి. మరో ఆరు నెలల పాటు ప్రభుత్వ రంగ బ్యాంక్‌లకు మొండి బకాయిలు, వాటికి కేటాయింపుల సమస్యలు తప్పవు. ఫలితంగా వాటా లాభదాయకత దెబ్బతింటుంది. ⇒ {పైవేట్ బ్యాంక్‌లు కొంత నయంగా ఉన్నాయి. గత క్యూ1లో 2.1%గా ఉన్న ప్రైవేట్ బ్యాంక్‌ల మొండి బకాయిలు ఈ క్యూ1లో 3%కి పెరిగాయి. ⇒ మొండి బకాయిల కారణంగా పలు ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు భారీ నష్టాలను ప్రకటించాయి. ⇒ బకాయిలను గుర్తించి వాటికి కేటాయింపులు జరపడం దీర్ఘకాలంలో మంచి ఫలితాలను ఇచ్చే చర్య. పోటీని తట్టుకోవడానికి తగిన సన్నద్ధతను ఇవ్వడానికి బ్యాంక్‌లకు ఈ చర్య ఉపకరిస్తుంది.