ముంబై: ఆర్థిక వ్యవస్థ మందగమన ప్రభావం కంపెనీలపై తీవ్రమైన ప్రభావమే చూపుతోంది. ఈ మందగమనం కారణంగా ఈ జూన్ క్వార్టర్‌లో పలు కంపెనీల ఆదాయాలు, లాభా ల వృద్ధి భారీగా తగ్గాయని కేర్ రేటింగ్స్ తాజా నివేదిక పేర్కొంది. మొత్తం 2,976 కంపెనీల ఆర్థిక ఫలితాలను విశ్లేషించి కేర్ రేటింగ్స్ సంస్థ ఈ నివేదికను రూపొందించింది.
ఈ నివేదిక ఏం చెప్పిందంటే..
♦ భారత కంపెనీల నికర అమ్మకాల వృద్ది ఈ ఆర్థిక సంవత్సరం జూన్ క్వార్టర్‌లో 4.6 శాతానికి తగ్గింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో ఇది 13.5 శాతంగా ఉంది.
♦ గత క్యూ1లో 24.6 శాతంగా ఉన్న నికర లాభ వృద్ధి క్యూ1లో 6.6 శాతానికి తగ్గింది.
♦ బలహీనంగా, అంతంతమాత్రంగానే ఉన్న ఈ క్యూ1 ఫలితాలు.. ఆర్థిక వ్యవస్థ, వివిధ రంగాల పరిశ్రమలు మందగమనంలోకి జారిపోయాయని సూచిస్తున్నాయి.
♦ ఇంత తీవ్ర స్థాయి ఇబ్బందుల్లోనూ ఊరటనిచ్చే విషయం ఒకటుంది. సంఘటిత రంగంలోని ఉద్యోగాలపై మందగమన ప్రభావం పెద్దగా లేదు. ఈ రంగ ఉద్యోగుల వ్యయాల వృద్ధి నిలకడగానే కొనసాగుతోంది. కొన్ని రంగాల్లో ఉద్యోగాల వేతనాలు 11 శాతం మేర పెరిగాయి కూడా.
♦ మార్చి క్వార్టర్‌లో వృద్ధి ఐదేళ్ల కనిష్టానికి, 5.8 శాతానికి పడిపోయింది.జూన్ క్వార్టర్‌లో మరింతగా దిగజారే ప్రమాదం ఉంది.
♦ గత క్యూ1లో రెండంకెల వృద్ధి సాధించిన నిర్వహణ లాభ వృద్ధి ఈ క్యూ1లో 4.1 శాతానికి పడిపోయింది. నిర్వహణ లాభ మార్జిన్ మాత్రం నిలకడగా 20 శాతం స్థాయిలో ఉంది.
♦ గత క్యూ1లో 53% వృద్ధి సాధించిన నికర లాభం ఈ క్యూ1లో 12 శాతానికి తగ్గింది.
♦ బ్యాంక్‌లు, ఆర్థిక కంపెనీలు మినహా ఇతర కంపెనీల పన్ను చెల్లింపులు 19% తగ్గింది. గత క్యూ1లో ఇది 52% వృద్ది చెందింది.
Comments
Please login to add a commentAdd a comment