టారో: 26 జూన్ నుంచి 2జూలై, 2016 వరకు
మేషం (మార్చి 21 - ఏప్రిల్ 19)
పనుల్లో తలమునకలుగా గడిపిన మీరు ఈ వారంలో తీరికగా, ప్రశాంతంగా గడుపుతారు. కుటుంబంపై శ్రద్ధ తీసుకుంటారు. కెరీర్‌లో మార్పులు మిమ్మల్ని మరింతగా సేవాదృక్పథం వైపు మళ్లిస్తాయి. బాధ్యతలు స్వీకరించేందుకు సంసిద్ధులవుతారు. పెట్టుబడుల విషయంలో మరికొంతకాలం వేచి చూడాల్సి ఉంటుంది.
లక్కీ కలర్: గులాబి
వృషభం (ఏప్రిల్ 20 - మే 20)
భావోద్వేగాలు, అనుబంధాలు మీ ఆలోచనలను నియంత్రిస్తాయి. పని నుంచి మీ దృష్టిని మళ్లిస్తాయి. ఇతరుల సమస్యల నుంచి దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. పనిలో మరింత గాఢంగా నిమగ్నమవుతారు. డబ్బుకే ప్రాధాన్యమిచ్చే పరిస్థితులు ఉంటాయి. రచన, బోధన వంటి ప్రాజెక్టులకు అనుకూలం
లక్కీ కలర్: ముదురు ఆకుపచ్చ
మిథునం (మే 21 - జూన్ 20)
మీ పనులకు, మీ అంచనాలకు పొంతన కుదరకపోవచ్చు. ఇతరులను మెప్పించే ప్రయత్నాలకు దూరంగా ఉండటం మంచిది. కొరుకుడు పడని మనుషులతో పేచీలు రావచ్చు. పని ఒత్తిడితో అలసట చెందుతారు. సృజనాత్మక, ఆధ్యాత్మిక మార్గాల్లో పురోగతి సాధిస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది.
లక్కీ కలర్: నారింజ
కర్కాటకం (జూన్ 21 - జూలై 22)
వారమంతా ప్రశాంతంగా గడుపుతారు. తలపెట్టిన పనులను సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. నిర్ణయాలు తీసుకునే ముందు క్షుణ్ణంగా పరిశీలించాల్సిన పరిస్థితులు ఉంటాయి. పనుల్లో అనుకోని జాప్యాలు ఎదురవుతాయి. కొత్త భాగస్వాములు కలుసుకోవడం లేదా కొత్త వెంచర్లు ప్రారంభించడం జరగవచ్చు. సృజనాత్మకమైన వెంచర్లు సానుకూలంగా ఉంటాయి.
లక్కీ కలర్: పసుపు
సింహం (జూలై 23 - ఆగస్ట్ 22)
కొత్త ప్రదేశాలకు స్వేచ్ఛగా వెళ్లడానికి సిద్ధంగా ఉంటారు. మీ ఆశలు, ఆశయాలు, కలలు నెరవేరే తరుణం ఆసన్నమైంది. దూర ప్రయాణాలు చేస్తారు. జీవితంలో పురోగతి సాధిస్తారు. వ్యాపారావకాశాలు కలిసొస్తాయి. అయితే, ఈ వారంలో శక్తికి మించిన భారాలను తలకెత్తుకోకపోవడమే మంచిది. ఆత్మీయా నుబంధాల్లో అభద్రతాభావానికి లోనవుతారు.
లక్కీ కలర్: బూడిదరంగు
కన్య (ఆగస్ట్ 23 - సెప్టెంబర్ 22)
ఓపికగా వ్యవహరించడం వల్ల కలిగే లాభాలను అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు. ప్రశాంతంగా, నిదానంగా వ్యవహరించడం వల్ల సత్ఫలితాలను పొందగలుగుతారు. ఈ వారంలో కొన్ని ఉత్కంఠభరితమైన సంఘటనలను ఎదుర్కొంటారు. నిబద్ధత, లక్ష్యశుద్ధితో ఆశించిన లక్ష్యాలను సాధిస్తారు.
లక్కీ కలర్: నాచురంగు
తుల (సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22)
విశ్రాంతిగా గడపడం ద్వారా శక్తులను కూడదీసుకుంటారు. పని ప్రణాళికలకు సంబంధించి కొన్ని త్యాగాలు చేయక తప్పకపోవచ్చు. ఈ వారంలో కొత్త పనులు ప్రారంభించే ముందు పాతవి పూర్తి చేయడం క్షేమం. ఆత్రపడకుండా వేచి చూసే ధోరణిని అవలంబించండి. పరిస్థితులన్నీ నెమ్మదిగా వాటంతట అవే మెరుగుపడతాయి. సొంత ఆలోచనలకు అనుగుణంగా ముందుకు సాగుతారు.
లక్కీ కలర్: నారింజ
వృశ్చికం (అక్టోబర్ 23 - నవంబర్ 21)
సానుకూలమైన ఆలోచనలతో సత్ఫలితాలను సాధిస్తారు. నేల విడిచి సాము చేయకుండా నిలకడగా వ్యవహరిస్తారు. కుటుంబ వ్యవహారాలకు అధిక ప్రాధాన్యమిస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో మరింత శ్రద్ధ చూపాల్సి వస్తుంది. మీరు పెట్టాలనుకున్న పెట్టుబడుల కోసం అదనపు నిధులు అవసరమవుతాయి. కెరీర్‌లో పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తారు. మీ బృందాన్ని సమర్థంగా ముందుకు నడిపిస్తారు.
లక్కీ కలర్: మట్టిరంగు
ధనుస్సు (నవంబర్ 22 - డిసెంబర్ 21)
పనిలో నిరంతరం తలమునకలయ్యే మీరు ఈ వారంలో విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరాన్ని గుర్తిస్తారు. ఒత్తిడికి దూరంగా సన్నిహితులతో కలసి విహారయాత్రకు వెళతారు. మిత్రుల్లో ఒకరి పట్ల డబ్బు విషయంలో చాలా ఉదారంగా వ్యవహరిస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో పనులు మందకొడిగా సాగుతాయి.
లక్కీ కలర్: చాక్లెట్
మకరం (డిసెంబర్ 22 - జనవరి 19)
ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతారు. వేడుకలు, సంబరాల్లో పాల్గొంటారు. ఒక ప్రత్యేకమైన వేడుకలో పాల్గొనేందుకు ఆహ్వానం అందుకుంటారు. అయితే, వృత్తి ఉద్యోగాల్లో సమస్యలు, సంఘర్షణలు ఎదుర్కొంటారు. ఆర్థిక లాభాలు పొందుతారు. మీ జీవిత భాగస్వామి మీ పట్ల ఇదివరకటి కంటే ఎక్కువగా అనురాగాన్ని ప్రదర్శిస్తారు.
లక్కీ కలర్స్: పొద్దుతిరుగుడు
కుంభం (జనవరి 20 - ఫిబ్రవరి 18)
కెరీర్‌లో పురోగతి బాగుంటుంది. కెరీర్ లక్ష్యాలు ఎలా ఉన్నా, కుటుంబానికి తగిన ప్రాధాన్యం ఇచ్చి, ఇంట్లో సుఖశాంతులు సాధిస్తారు. మీ ఆర్థిక పరిస్థితులు ఈ వారంలో మీ ప్రేమానుబంధాలతో ముడిపడి ఉంటాయి. అన్ని రంగాల్లోనూ నీతి నిజాయతీలతో వ్యవహరించి సత్ఫలితాలు సాధిస్తారు. మీ చిరకాల వాంఛ నెరవేరే అవకాశాలు ఉన్నాయి.
లక్కీ కలర్: బంగారు
మీనం (ఫిబ్రవరి 19 - మార్చి 20)
ఆర్థిక విజయాలు సాధిస్తారు. అనూహ్యమైన, ఆనందకరమైన సమాచారం ఒకటి అందుకుంటారు. సాహసమే ఊపిరి అన్నట్లుగా ధైర్యసాహసాలతో ముందంజ వేస్తారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు జరుగుతాయి. విధి విలాసాన్నీ, కర్మ ఫలితాన్ని ఒకేలా తీసుకుని స్థితప్రజ్ఞ చూపుతారు. ధన వస్తు లాభాల కంటే సాధించిన విజయమే మీకు ఎక్కువ సంతృప్తిని ఇస్తుంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది.
లక్కీ కలర్: తెలుపు
- ఇన్సియా, టారో అనలిస్ట్