Insiya Nazir
-
టారో : 31 జూలై నుంచి 6ఆగస్టు, 2016 వరకు
మేషం (మార్చి 21 - ఏప్రిల్ 19) మీ చిరకాల స్వప్నం నెరవేరుతుంది. జీవితంలో కొత్త కొత్త పరిణామాలు మొదలవు తాయి. ఇంటా బయటా అంతా ఆనందంగా గడిచిపోతుంది. సంతోషానికి భంగం కలిగించే పరిసరాలకు దూరంగా ఉంటారు. చాలాకాలంగా దూరంగా ఉంటున్న స్నేహితుల్లో ఒకరిని కలుసుకుంటారు. రహస్యాలను దాచడం వల్ల సమస్యలను ఎదుర్కొంటారు. కొత్త వెంచర్లలో పెట్టుబడులు పెడతారు. లక్కీ కలర్: నేరేడు వృషభం (ఏప్రిల్ 20 - మే 20) కొత్త దిశలో ముందుకు సాగుతారు. ఆత్మీయులకు భారంగా వీడ్కోలు పలుకుతారు. మనసుకు కష్టంగా అనిపించినా, ఇష్టమైన ప్రదేశాలను వదిలి వెళ్లక తప్పని పరిస్థితులు తలెత్తుతాయి. ఇల్లు మారడం లేదా కార్యాల యాన్ని మార్చడం జరుగుతాయి. అనుకున్న లక్ష్యాలలో కొన్నింటిని సాధించలేకపోయినా, ఆనందంగానే ఉంటారు. లక్కీ కలర్: లేత పసుపు మిథునం (మే 21 - జూన్ 20) ఇదివరకటి ఒత్తిళ్లు, చిరాకులు తగ్గి కొంత ఉపశమనం లభిస్తుంది. ఇంటా, బయటా మార్పులను స్వాగతిస్తారు. పరిస్థితులు క్రమంగా మెరుగుపడతాయి. పని ఒత్తిడి పెరగడం వల్ల తీరిక దొరకడం దాదాపు అసాధ్యంగా ఉంటుంది. ప్రతికూల ఆలోచన లను సానుకూల దృక్పథంతో అధిగమిస్తారు. ఇతరుల మేలు కోసం, లక్ష్య సాధన కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తారు. లక్కీ కలర్: ముదురు నారింజ కర్కాటకం (జూన్ 21 - జూలై 22) గడ్డుకాలం నుంచి గట్టెక్కి ఒడ్డున పడతారు. ఒక దురలవాటును వదులుకుంటారు. పరిస్థితులు మెల్లగా మెరుగుపడతాయి. దూర ప్రయాణాలకు వెళతారు. గట్టి పోటీతోనే ఘన విజయాలు సాధించగలమని అనుభవ పూర్వకంగా తెలుసుకుంటారు. దృక్పథాన్ని మార్చుకుంటారు. ముఖ్యమైన వ్యక్తులను కలుసుకుంటారు. లక్కీ కలర్: లేత నారింజ సింహం (జూలై 23 - ఆగస్ట్ 22) శక్తివంచన లేకుండా కృషి చేసి, వృత్తి ఉద్యోగాల్లో సత్ఫలితాలు సాధిస్తారు. పరిస్థితులు ఎలా ఉన్నా, ప్రశాంతంగా, తృప్తిగా ఉంటారు. రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు మరింత పరిణతితో వ్యవహరించాల్సి ఉంటుంది. ఒక ఆసక్తికరమైన వ్యక్తిని కలుసుకుంటారు. లక్కీ కలర్: పసుపు కన్య (ఆగస్ట్ 23 - సెప్టెంబర్ 22) ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిపేయడంతో కాలాన్ని కొంత వృథా చేసుకుంటారు. సకాలంలోనే అప్రమత్తతతో పరిస్థితిని చక్కదిద్దుకుంటారు. ప్రేమ వ్యవహారాలకు అనుకూలమైన కాలం. ప్రేమించిన వ్యక్తులను కానుకల ద్వారా సంతోషపెడతారు. అనుకున్న పనులన్నీ సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. ధ్యానంలో గడుపుతారు. లక్కీ కలర్: ఊదా తుల (సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22) గతానుభవాల దృష్ట్యా సానుకూల దృక్పథాన్ని అలవరచుకుంటారు. చిరకాల స్వప్నాలను నెరవేర్చుకోవడానికి తగిన అవకాశాలు కలిసొస్తాయి. లక్ష్యసాధనలో నిర్భయంగా ముందంజ వేస్తారు. శ్రమకు తగిన ఫలితాన్ని అందుకుంటారు. రుణాలు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. పిల్లల పట్ల శ్రద్ధ చూపుతారు. లక్కీ కలర్: ఆకుపచ్చ వృశ్చికం (అక్టోబర్ 23 - నవంబర్ 21) కాలం పెట్టే పరీక్షలను ఎదుర్కోవాల్సి వస్తుంది. గడ్డు పరిస్థితులను అధిగమించేందుకు నానా ప్రయత్నాలూ చేస్తారు. ప్రతికూల పరిస్థితులను సానుకూలంగా మలచుకునేందుకు అలుపెరుగని పోరాటం సాగిస్తారు. నిరాశ చెందాల్సిన పనిలేదు. విజయం చేరువలోనే ఉంది. వ్యక్తిగత సమస్యల పరిష్కారం కోసం మిత్రులు మీ సలహా కోరుకుంటారు. సహచరులతో సంప్రదించి నిర్ణయాలు తీసుకుంటారు. లక్కీ కలర్: నలుపు ధనుస్సు (నవంబర్ 22 - డిసెంబర్ 21) అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. స్వయం ప్రతిభతో రాణిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో ఒత్తిళ్లు సతమతం చేస్తాయి. వెన్నునొప్పి, కీళ్ల నొప్పుల వల్ల వైద్యుణ్ని సంప్రదించాల్సి రావచ్చు. పని ఒత్తిడిని అధిగమించడానికి విహార యాత్రలకు వెళతారు. కీలకమైన సమస్యల పరిష్కారానికి పెద్దల సలహా తీసుకుంటారు. లక్కీ కలర్: లేత గోధుమ మకరం (డిసెంబర్ 22 - జనవరి 19) సత్తా చాటుకోవడానికి తగిన అవకాశం అనుకోకుండా కలిసొస్తుంది. ఉత్సాహంగా ముందుకు సాగి ఆలోచనలను ఆచరణలో పెడతారు. పని ప్రదేశంలో సత్వరమే పరిష్కరించాల్సిన సమస్యలు తీరిక లేకుండా చేస్తాయి. ఇతరులకు సలహాలు ఇస్తారు. చిరకాల మిత్రులను కలుసుకుంటారు. సన్నిహితులతో విందు వినోదాల్లో, విహార యాత్రల్లో ఉల్లాసంగా గడుపుతారు. లక్కీ కలర్: ముదురాకుపచ్చ కుంభం (జనవరి 20 - ఫిబ్రవరి 18) ఏళ్ల తరబడి నిరీక్షించిన అవకాశం కలిసొస్తుంది. ఆకాశమే హద్దుగా సృజనాత్మక సామర్థ్యంతో ముందుకు సాగుతారు. గత జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకుంటారు. మెరుగైన భవిష్యత్తుకు కొత్త దారులు తెరుచుకుంటాయి. అన్ని వైపుల నుంచి మద్దతు లభిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో పని ఒత్తిడి పెరిగి తీరిక లేకుండా తలమునకలవుతారు. లక్కీ కలర్: తెలుపు మీనం (ఫిబ్రవరి 19 - మార్చి 20) ప్రేమ వ్యవహారాలు సంతోషభరితంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో అంకితభావంతో పనిచేసి సత్ఫలితాలు సాధిస్తారు. కీలక నిర్ణయాల్లో పాలు పంచుకుంటారు. చిరస్మరణీయమైన విజయాన్ని సాధిస్తారు. కొత్త లక్ష్యాలను ఏర్పరచుకోవడానికి ఇది సానుకూల సమయం. సామాజికంగా పేరు ప్రఖ్యాతులు ఇనుమడిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. లక్కీ కలర్: లేత ఊదా - ఇన్సియా, టారో అనలిస్ట్ -
టారో : 24 జూలై నుంచి 30జూలై, 2016 వరకు
మేషం (మార్చి 21 - ఏప్రిల్ 19) శుభవార్తలు వింటారు. ఉద్యోగులకు పదోన్నతులు లభించవచ్చు. పొరపాట్లు చేయకుండా ఉండటానికి మరింత అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. ప్రేమికులతో ఆనందంగా కాలం గడుపుతారు. ఈ వారం అంతా సానుకూలంగానే గడుస్తుంది. ఆరోగ్యపరంగా తీసుకుంటున్న జాగ్రత్తలు విసుగు కలిగించొచ్చు. అయితే, వాటిని మానుకోవద్దు. లక్కీ కలర్: బ్రౌన్ వృషభం (ఏప్రిల్ 20 - మే 20) అనూహ్యమైన మార్పులు ఉంటాయి. భ్రమలను విడిచిపెట్టి జీవితంలో ఆచరణాత్మకమైన మార్పులకు శ్రీకారం చుడతారు. భావోద్వేగాలు తరచూ మారుతూ ఉండవచ్చు. ఈ విషయమై కొంత అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. మీ ఆలోచనలను పంచుకోగల భాగస్వామి తారసపడతారు. మానసికంగా చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. లక్కీ కలర్: పసుపు మిథునం (మే 21 - జూన్ 20) గ్రహబలం అనుకూలంగా ఉంది. సంపద కలిసొస్తుంది. సంతోషంగా గడుపుతారు. ఇతరుల విమర్శలపై వ్యతిరేకత పెంచుకోకండి. అపోహలకు లోను కాకుండా, ఎదుటివారు చెప్పే మాటలను శ్రద్ధగా ఆలకించండి. ఇంట్లో జరిగే వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. పుష్కలంగా నీరు తాగండి. నీటి ద్వారానే ఈ వారం మీరు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోగలరు. లక్కీ కలర్: నీలం కర్కాటకం (జూన్ 21 - జూలై 22) ఆలోచనల్లో గందరగోళం కారణంగా అవరోధాలు ఎదురవుతాయి. ఆర్థిక పరిజ్ఞానం ఉన్న వ్యక్తి నుంచి సలహా కోరుకుంటారు. మీ బాధ్యతలు పెరుగుతాయి. పనికి, ఆటవిడుపు కార్యక్రమాలకు సమతుల్యత సాధించాల్సి ఉంటుంది. ఆఫీసులో మార్పులు జరిగే సూచనలు ఉన్నాయి. మార్పుల వల్ల మీలోని నైపుణ్యాలు వెలుగులోకి వస్తాయి. లక్కీ కలర్: బ్రౌన్ సింహం (జూలై 23 - ఆగస్ట్ 22) లౌక్యంగా మాట్లాడటం నేర్చుకోవాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. ఇబ్బందికరమైన పరిస్థితులను అధిగమిస్తారు. పనికి సంబంధించిన ఒక కీలక సమాచారం మీ ఆలోచనా సరళిలో పెను మార్పులకు కారణమవుతుంది. ప్రకృతిలో ఏకాంతంగా గడపడం ద్వారా కాస్త ఊరట పొందగలరు. మీ స్వస్థలంలో సామాజిక సేవా కార్యకలాపాల్లో పాల్గొంటారు. లక్కీ కలర్: ఆకుపచ్చ కన్య (ఆగస్ట్ 23 - సెప్టెంబర్ 22) ప్రేమికులకు అనుకూలమైన కాలం. పని ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో మీ ఆలోచనలను తెలివిగా ముందుకు తీసుకుపోవాల్సి ఉంటుంది. శ్రమకు తగిన ఫలితం అందకపోవచ్చు. అయినా క్రమశిక్షణ గల సైనికుడిలా ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ముందుకు సాగి అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. నిరాశా నిస్పృహల నుంచి బయటపడటానికి ఆత్మీయులతో గడుపుతారు. లక్కీ కలర్: నాచురంగు తుల (సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22) కొత్త పథకాలను ఆచరణలోకి తెస్తారు. మేధాశక్తితో అందరినీ ఆకట్టుకుంటారు. గత జ్ఞాపకాలు గుర్తుకు వచ్చి, నిర్వేదానికి గురిచేస్తాయి. సానుకూల దృక్పథంతో నిర్వేదం నుంచి బయటపడటానికి ప్రయత్నిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అందచందాలపైన, అలంకరణలపైన శ్రద్ధ చూపుతారు. మనశ్శాంతి కోసం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. లక్కీ కలర్: పొద్దుతిరుగుడు వృశ్చికం (అక్టోబర్ 23 - నవంబర్ 21) ఆకర్షణ శక్తితో అందరినీ ఇట్టే ఆకట్టుకుంటారు. ప్రేమ వ్యవహారాలకు సానుకూలమైన కాలం. వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. శ్రమకు తగిన గుర్తింపుతో పాటు ప్రోత్సాహకరమైన ఫలితా లను అందుకుంటారు. ఇదివరకు పోగొట్టుకున్న వస్తువులు తిరిగి దొరికే అవకాశాలు ఉన్నాయి. అనుకోకుండా అదృష్టం కలిసొస్తుంది. లక్కీ కలర్: నేరేడు ధనుస్సు (నవంబర్ 22 - డిసెంబర్ 21) ఇంటా బయటా అనుకోని మార్పులు తప్పకపోవచ్చు. కొత్త ఇంట్లోకి మారే అవకా శాలు ఉన్నాయి. మీరు చేరే కొత్త ప్రదేశం చుట్టూ ఆహ్లాదకరమైన ఆకుపచ్చని వాతావరణం ఉంటుంది. ఉద్యోగంలో స్థానచలన సూచనలు ఉన్నాయి. సాటిలేని పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. కీర్తి ప్రతిష్ఠలు ఇనుమడిస్తాయి. సాహసకృత్యాల్లో పాల్గొంటారు. లక్కీ కలర్: లేత గోధుమరంగు మకరం (డిసెంబర్ 22 - జనవరి 19) ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది. అదనపు ఆదాయం లభిస్తుంది. ఆస్తులు కొనుగోలు చేస్తారు. స్వార్థాన్ని విడనాడితే మరింతగా సత్ఫలితాలను సాధించగలరు. ఆరోగ్యానికి, ఆర్థిక లాభాలకు నడుమ సమతుల్యత పాటించాల్సి ఉంటుంది. కుటుంబ వ్యవహారాల్లో ప్రశాంతత నెలకొంటుంది. ప్రేమ వ్యవహారాలు ఉల్లాసభరితంగా సాగుతాయి. లక్కీ కలర్: ముదురు ఆకుపచ్చ కుంభం (జనవరి 20 - ఫిబ్రవరి 18) ఎటూ తేల్చుకోలేని అనిశ్చితిలో, గందరగోళంలో కొట్టుమిట్టాడుతారు. అంతులేని ఆలోచనల పరంపరను అదుపులో ఉంచుకోవడానికి విఫలయత్నాలు చేస్తారు. ధ్యానం వల్ల కొంతవరకు ప్రశాంతత సాధిస్తారు. ప్రేమికులతో విహారయాత్రలకు వెళతారు. విద్యార్థులు అంచనాలకు మించిన సత్ఫలితాలను సాధిస్తారు. కుటుంబ వ్యవహారాలపై శ్రద్ధ తీసుకోవాల్సి వస్తుంది. లక్కీ కలర్: నారింజ మీనం (ఫిబ్రవరి 19 - మార్చి 20) ఖర్చులు అదుపుతప్పే అవకాశాలు ఉన్నాయి. వీటిలో ఎక్కువగా బంధుమిత్రులతో విందువినోదాల కోసం, విలాసాల కోసమే ఖర్చు చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో అనుకోని మార్పులు సంభవిస్తాయి. సృజనాత్మకతతోను, పాలనా సామర్థ్యంతోను ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు. వారం ప్రారంభంలో కొంత నిరాశాజనకంగా ఉన్నా, పరిస్థితులు క్రమంగా మెరుగుపడతాయి. లక్కీ కలర్: వెండిరంగు -
టారో : 17 జూలై నుంచి 23జూలై, 2016 వరకు
మేషం (మార్చి 21 - ఏప్రిల్ 19) ప్రేమికులకు ‘అంతా ప్రేమమయం’ అన్నట్లుగా ప్రేమ మైకంలో మునిగి తేలుతారు. వృత్తి ఉద్యోగాల్లో ఇతరులను మీ వాక్చాతుర్యంతో ఒప్పించడం ద్వారా మీరు అనుకున్న విధంగా పనులు జరిగేలా చేసుకుంటారు. ఇదివరకటి మీ ఆలోచనలు ఇప్పుడు సత్ఫలితాలనిస్తాయి. అవివాహితులకు పెళ్లి సంబంధాలు కుదిరే అవకాశాలు ఉన్నాయి. లక్కీ కలర్: గులాబి వృషభం (ఏప్రిల్ 20 - మే 20) ఉత్సాహంతో ఉరకలేస్తారు. పనుల్లో దూకుడు పెంచుతారు. వ్యక్తిగత, వృత్తిగత వ్యవహారాల్లో ప్రాక్టికల్‌గా ఆలోచించాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. వృత్తి ఉద్యోగాల్లో మనసు పెట్టి పనిచేసి ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో ఇబ్బందులను అధిగమించి పరిస్థితులను అనుకూలంగా మలచుకుంటారు. పని ఒత్తిడిలో తీరిక లేకుండా గడుపుతారు. లక్కీ కలర్: మీగడ రంగు మిథునం (మే 21 - జూన్ 20) సూర్యుడిలా స్వయంప్రకాశంతో రాణిస్తారు. మీ వెలుగులో ఇతరులకు దారి చూపుతారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. సంతోషంగా, సంతృప్తిగా గడుపుతారు. ఇతరులకు కోరిన సాయం చేసి, సంతోషం కలిగిస్తారు. సానుకూల దృక్పథంతో చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ప్రేమికులు ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతారు. లక్కీ కలర్: బంగారు రంగు కర్కాటకం (జూన్ 21 - జూలై 22) జీవనశైలిలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటాయి. సూర్యోదయంలోని వెలుతురుకు ముందు చీకటిలా తెలియని భయాలు వెన్నాడుతాయి. అలాగని నిరాశ చెందనవసరం లేదు. ఈ వారంలోనే సానుకూల సంకేతాలు కూడా కనిపిస్తాయి. ఆత్మస్థైర్యంతో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటారు. ప్రణాళికాబద్ధంగా లక్ష్యాలను సాధిస్తారు. ప్రేమలో పడతారు. లక్కీ కలర్: వెండి రంగు సింహం (జూలై 23 - ఆగస్ట్ 22) అభిమానుల వల్ల మీకు ప్రచారం లభిస్తుంది. పేరు ప్రఖ్యాతులు ఇనుమడిస్తాయి. మీతో ఎలాంటి సంబంధం లేని వ్యక్తులు కూడా మీ గురించి వదంతులు మాట్లాడుకుంటారు. నిబ్బరంగా కొత్త సవాళ్లను స్వీకరిస్తారు. మీ ఆకర్షణ శక్తి ఫలితంగా కొత్త ప్రేమ వ్యవహారాలు మొదలవుతాయి. కొత్త వ్యక్తులతో ఏర్పడిన పరిచయాలు దీర్ఘకాలం కొనసాగుతాయి. లక్కీ కలర్: ఎరుపు కన్య (ఆగస్ట్ 23 - సెప్టెంబర్ 22) వృత్తి, ఉద్యోగాల్లో శక్తిమంతమైన వ్యక్తిగా ఎదుగుతారు. కెరీర్లో అద్భుతమైన అవకాశాలను అందిపుచ్చుకుంటారు. వ్యాపారావకాశం ఒకటి ఊరించినట్టే ఊరించి చేయి జారిపోయే అవకాశాలు ఉన్నాయి. చాపల్యాలను అదుపులో ఉంచుకోవలసిన సమయం ఇది. ప్రేమ వ్యవహారాల్లో ఆచి తూచి అడుగు వేయాల్సి ఉంటుంది. లక్కీ కలర్: ముదురు గోధుమరంగు తుల (సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22) మార్పులకు సిద్ధంగా ఉండకపోవడం వల్ల ఇబ్బందుల్లో పడతారు. అనుకోని కొన్ని పరిణామాలు మీ అంచనాల మేరకే జరిగి, ఇతరులను ఆశ్చర్యంలో ముంచెత్తుతాయి. వారాంతంలో మీ ఇంటికి అతిథులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. బంధు మిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఆధ్యాత్మిక చింతన పెంచుకుంటారు. ధ్యానానికి ఎక్కువ సమయం కేటాయిస్తారు. లక్కీ కలర్: నేరేడురంగు వృశ్చికం (అక్టోబర్ 23 - నవంబర్ 21) చిరకాల స్వప్నాన్ని సాకారం చేసుకునే దిశగా ప్రయత్నాలను ముమ్మరం చేస్తారు. పాత లక్ష్యాల కోసం కొత్తగా ప్రయత్నాలు ప్రారంభిస్తారు. ఆత్మవిశ్వాసంతో అనుకున్న పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. సాధించిన విజయాల పట్ల ఎలాంటి గర్వం లేకుండా నిరాడంబరంగా ముందుకు సాగుతారు. అదృష్టం మీ వైపే ఉంటుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. లక్కీ కలర్: నీలం ధనుస్సు (నవంబర్ 22 - డిసెంబర్ 21) సామాన్యంగా సాగుతున్న జీవితంలో అనుకోని మార్పులు చోటు చేసుకుంటాయి. అదృష్టం అన్ని విధాలా కలిసొస్తుంది. సమాజంలో పేరు ప్రతిష్ఠలు పెరుగుతాయి. ప్రణాళికాబద్ధంగా మీరు తలపెట్టిన పనులను ప్రారంభించేలోగానే అనూహ్యమైన సంఘటనలు జరుగుతాయి. సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతారు. లక్కీ కలర్: ఊదా మకరం (డిసెంబర్ 22 - జనవరి 19) శరీరాకృతిపై, అందచందాలపై అతిగా శ్రద్ధ చూపుతారు. ఇతరుల నుంచి మెప్పు ఆశిస్తారు. పొగడ్తల మాయలో పడి ఊహాలోకంలో విహరిస్తారు. ప్రేమికుల మధ్య పొరపొచ్చాలు తలెత్తి విడిపోయే పరిస్థితులు రావచ్చు. ఒంటరిగా ఉంటున్న వారు తగిన జంట కోసం వెదుకులాట సాగిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో అవకాశాలు చాలా పరిమితంగా ఉంటాయి. లక్కీ కలర్: ఎరుపు కుంభం (జనవరి 20 - ఫిబ్రవరి 18) విజయపథంలో దూసుకుపోతారు. వృత్తి ఉద్యోగాల్లో మీ అంకితభావం, ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. శ్రమకు తగిన ఫలితాలను దక్కించుకోగలుగుతారు. దీర్ఘకాలికంగా ఒక రంగంలో సాగిస్తున్న కృషి ఎట్టకేలకు సత్ఫలితాలనిస్తుంది. ఉత్తమమైన పనితీరుతో అధికారుల దృష్టిని ఆకర్షిస్తారు. ఇన్నాళ్లూ నిర్లక్ష్యం చేసిన వాళ్లు మిమ్మల్ని పట్టించుకోవడం ప్రారంభిస్తారు. లక్కీ కలర్: ముదురాకుపచ్చ మీనం (ఫిబ్రవరి 19 - మార్చి 20) సాహసమే నా బాట అన్నట్లుగా ధైర్య సాహసాలతో ముందుకు సాగుతారు. ప్రమాదాలకు చేరువగా వెళతారు. తిరుగులేని సంకల్పబలంతో గొప్ప విజయాలు సాధిస్తారు. పూర్తి వ్యతిరేక మనస్తత్వం గల వ్యక్తితో ప్రేమలో పడతారు. తగిన జాగ్రత్తలతో ఆరోగ్యాన్ని మెరుగుపరచుకుంటారు. సానుకూల దృక్పథంతో సవాళ్లను స్వీకరిస్తారు. సమస్యలను తేలికగా అధిగమిస్తారు. లక్కీ కలర్: లేతనీలం - ఇన్సియా, టారో అనలిస్ట్ -
టారో : 10 జూలై నుంచి 16జూలై, 2016 వరకు
మేషం (మార్చి 21 - ఏప్రిల్ 19) జీవితమే ఒక మిస్టరీ అన్నట్లుగా సాగుతుంది. ఏదీ నిశ్చితంగా ఉండదనే విషయం అర్థమవుతుంది. ఆశ్చర్యకర పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఈ వారంలో జీవిత భాగస్వామితో నిజాయతీగా వ్యవహరించడం మంచిది. రహస్యాలు దాచినట్లయితే, సమస్యలు తలెత్తే అవకాశాలు లేకపోలేదు. వదంతులు కలవరపెడతాయి. వాటిని నమ్మకపోవడమే క్షేమం. లక్కీ కలర్: ఆకాశనీలం వృషభం (ఏప్రిల్ 20 - మే 20) ఎలాంటి పరిస్థితులు ఎదురైనా స్థైర్యం కోల్పోకుండా ఎదుర్కొంటారు. విధి నిర్వహణలో ఒత్తిళ్లు, ఇబ్బందులు తప్పకపోవచ్చు. మీపై అసూయ పెంచుకున్న ఒక సహోద్యోగి మిమ్మల్ని ఇరకాటంలో పెట్టే ప్రయత్నాలు చేస్తారు. ప్రేమ వ్యవహారాల్లో పొరపొచ్చాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. లక్కీ కలర్: లేత పసుపు మిథునం (మే 21 - జూన్ 20) ప్రేమికుల మధ్య స్వేచ్ఛా స్వాతంత్య్రాలకు సంబంధించిన సంఘర్షణలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ప్రేమ వ్యవహారాల్లో భాగస్వాములకు స్వేచ్ఛనివ్వడమే మేలనే విషయాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు. పని ప్రదేశంలో లేదా ఉద్యోగంలో మార్పులు సంభవించవచ్చు. ఈ మార్పుల ఫలితంగా మీరు కెరీర్లో ఒక మెట్టు పైకి ఎదిగే అవకాశాలు ఉంటాయి. లక్కీ కలర్: చాక్లెట్ రంగు కర్కాటకం (జూన్ 21 - జూలై 22) వృత్తి ఉద్యోగాల్లో ఘన విజయాలు సాధిస్తారు. విద్యార్థులు చదువుల్లో రాణిస్తారు. మీ ఘనతకు గుర్తింపుగా సన్మాన సత్కారాలు అందుకుంటారు. బంధు మిత్రులతో ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతారు. అత్యంత ప్రమాదకర పరిస్థితుల నుంచి తప్పించుకుంటారు. మృత్యుముఖం నుంచి తేలికగా బయటపడతారు. లక్కీ కలర్: గులాబి సింహం (జూలై 23 - ఆగస్ట్ 22) ఈ వారం మొత్తం ఒక పండుగలా సందడి సందడిగా గడిచిపోతుంది. బంధు మిత్రులు మీ చుట్టూ చేరడానికి ఆసక్తి చూపుతారు. మంచి చెడులను పట్టించుకోకుండా అన్ని పరిణామాలనూ ఆస్వాదిస్తారు. విహార యాత్రల కోసం దూరప్రయాణాలు చేస్తారు. ఈ వారంలో ఒక ఆసక్తికరమైన మనిషిని కలుసుకుంటారు. లక్కీ కలర్: బూడిద రంగు కన్య (ఆగస్ట్ 23 - సెప్టెంబర్ 22) సంతోషంగా ఉండాలని ఎంతగా అనుకుంటున్నా పరిస్థితులు సంతోషంగా ఉండనివ్వడం లేదనే భావనతో బాధపడతారు. సంతోషంగా ఉండాలా? లేక బాధపడాలా? అనేది మీ చేతుల్లోనే ఉంటుందని తెలుసుకుంటారు. పిల్లలపై దృష్టి సారించాల్సిన పరిస్థితులు తలెత్తవచ్చు. ఉన్నత విద్యావకాశాల కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ వారం సానుకూలంగా ఉంటుంది. లక్కీ కలర్: ఊదా తుల (సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22) స్వయంకృషితో జీవితాన్ని తీర్చిదిద్దుకునే ప్రయత్నాలు ప్రారంభిస్తారు. ప్రతికూల పరిస్థితులను సానుకూలంగా మలచుకుంటారు. అవరోధాలలోనే అవకాశాలను అందిపుచ్చు కుంటారు. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని, సత్ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో చిన్న చిన్న పొరపొచ్చాలు తలెత్తినా, చాకచక్యంగా వాటిని పరిష్కరించుకుంటారు. లక్కీ కలర్: లేత ఊదా వృశ్చికం (అక్టోబర్ 23 - నవంబర్ 21) పనిలోనే సంతోషాన్ని వెతుక్కుంటారు. ప్రతి పనినీ చెదరని ఏకాగ్రతతో సంతోషంగా పూర్తి చేస్తారు. తీరిక వేళల్లో ధ్యానంలో గడుపుతారు. అనుకోకుండా ఒక అపరిచితుని ద్వారా సాయం అందుకుంటారు. అనూహ్యమైన మార్పులు ఎదురవుతాయి. పని విషయంలో చివరి నిమిషంలో తలపెట్టిన మార్పులతో విజయవంతమైన ఫలితాలు సాధిస్తారు. లక్కీ కలర్: ఆకుపచ్చ ధనుస్సు (నవంబర్ 22 - డిసెంబర్ 21) ఈ వారంలో పూర్తిగా అప్రమత్తంగా ఉండాల్సి వస్తుంది. మీ ఆకాంక్షలు, లక్ష్యాల విషయంలో ఒక స్పష్టతకు వస్తారు. ప్రతి నిమిషాన్నీ సంతోషభరితంగా గడిపేందుకు తాపత్రయ పడతారు. ఏదైనా ముఖ్యమైన సదస్సు లేదా సమావేశానికి ఆహ్వానాన్ని అందుకుంటారు. నాయకత్వ పటిమను చాటుకుంటారు. క్రమశిక్షణతో ఫలితాలు సాధిస్తారు. లక్కీ కలర్: ముదురు ఊదా మకరం (డిసెంబర్ 22 - జనవరి 19) జీవితం సుఖదుఃఖాల సమ్మేళనం అని గ్రహిస్తారు. సవాళ్లను ధైర్యంగా స్వీకరిస్తారు. స్వేచ్ఛ కోసం తపిస్తారు. మిమ్మల్ని మీరు తక్కువగా అంచనా వేసుకోవద్దు. ధైర్యంగా ముందంజ వేస్తేనే సత్ఫలితాలను సాధించగలరు. ఇతరులతో ఘర్షణలకు దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. పిల్లల ద్వారా సంతోషం పొందుతారు. లక్కీ కలర్: లేత ఆకుపచ్చ కుంభం (జనవరి 20 - ఫిబ్రవరి 18) విపత్కర పరిస్థితుల్లో మీ ధైర్యసాహసాలను నిరూపించుకుంటారు. మిమ్మల్ని ఎవరూ తక్కువగా అంచనా వేయలేని పరిస్థితులు ఉంటాయి. బంధు మిత్రులకు, సహోద్యోగులకు సహాయం చేయడానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారు. మీ శక్తిసామర్థ్యాలకు తగిన గుర్తింపు పొందుతారు. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా సాగుతాయి. లక్కీ కలర్: లేత నారింజ మీనం (ఫిబ్రవరి 19 - మార్చి 20) ఏదీ ఎంపిక చేసుకోవాలనుకోవద్దు. ఎంపిక చేసుకున్న కొద్దీ మీ అవకాశాలు సన్నగిల్లిపోతాయి. పెట్టుబడుల విషయంలో కొద్ది నెలల కిందట తీసుకున్న నిర్ణయం వల్ల భారీ లాభాలు అందుకుంటారు. తలపెట్టిన ప్రతి పనిలోనూ అదృష్టం కలిసొస్తుంది. మితిమీరిన పనిభారంతో సతమతమవుతారు. ప్రేమ వ్యవహారాల్లో సమతుల్యతను పాటించాల్సి వస్తుంది. లక్కీ కలర్: లేత ఆకుపచ్చ - ఇన్సియా, టారో అనలిస్ట్ -
టారో : 3 జూలై నుంచి 9జూలై, 2016 వరకు
మేషం (మార్చి 21 - ఏప్రిల్ 19) ఎన్ని సవాళ్లు, అవరోధాలు ఎదురైనా నిరాశ చెందకుండా ముందుకు సాగుతారు. రోజువారీ జీవితంలో మార్పులు చేసుకోవడం ద్వారా సంతోషంగా గడుపుతారు. సృజనాత్మకమైన ఆలోచనలతో జీవితంలో సుస్థిరత సాధిస్తారు. మనోధైర్యంతో ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటుంటారు. ‘కష్టేఫలి’ సూత్రాన్ని ఆచరణలో పెడతారు. లక్కీ కలర్: బంగారురంగు వృషభం (ఏప్రిల్ 20 - మే 20) ఇంటా బయటా శాంతిసామరస్యాల కోసం తగిన కార్యాచరణను ప్రారంభిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో ప్రతిభావంతులను గుర్తించి, వారి శక్తియుక్తులు మరింతగా రాణించేలా వారికి సహాయ సహకారాలను అందిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో పురోగతి సాధిస్తారు. విద్యార్థులు చదువుల్లో రాణిస్తారు. వ్యక్తిగత జీవితంలో లోపాలను సరిదిద్దుకుంటారు. లక్కీ కలర్: నాచురంగు మిథునం (మే 21 - జూన్ 20) అప్రమత్తత వదులుకోకుండా విజయపథంలో దూసుకుపోతారు. గ్రహబలం అనుకూలంగా ఉంది. ఒకవేళ మీరు పొరపాటు చేసినా, దాని వల్ల కూడా మేలు పొందగలుగుతారు. క్రియాశీలంగా ముందుకు సాగుతారు. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా సాగుతాయి. ఇతరుల నుంచి గౌరవం, ప్రేమాభిమానాలు పొందుతారు. తలపెట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. లక్కీ కలర్: గులాబి కర్కాటకం (జూన్ 21 - జూలై 22) ఎట్టి పరిస్థితుల్లోనూ వెనుకంజ వేయకుండా తలపెట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. సంధించి విడిచిన బాణంలా లక్ష్యం వైపు దూసుకుపోతారు. శ్రమకు తగిన ప్రతిఫలాన్ని అందుకుంటారు. ఆంతరంగికుల్లో ఒకరిని కలుసుకుంటారు. ఈ భేటీ మీ వ్యక్తిగత, ఆధ్యాత్మిక పురోగతికి దోహదపడుతుంది. లక్కీ కలర్: ఊదా సింహం (జూలై 23 - ఆగస్ట్ 22) ఎంచుకున్న ప్రతి అంశాన్నీ శ్రద్ధగా అధ్యయనం చేస్తారు. జ్ఞాన సముపార్జనను దినచర్యగా మార్చుకుంటారు. స్పెక్యులేషన్ ఈ వారంలో ఏమాత్రం అనుకూలంగా ఉండదు. సంప్రదాయ పద్ధతుల్లో పొదుపు చర్యలు చేపట్టడమే క్షేమం. వచ్చిన ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుంటారు. విహారయాత్రల్లో ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతారు. లక్కీ కలర్: లేత ఆకుపచ్చ కన్య (ఆగస్ట్ 23 - సెప్టెంబర్ 22) ఆచి తూచి వ్యవహరించాల్సి ఉంటుంది. పొదుపు చేసుకున్న డబ్బు ఖర్చు చేయాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. పనికి, ఆటవిడుపు కార్యక్రమాలకు నడుమ కచ్చితమైన సమతుల్యతను పాటిస్తారు. పనిలో అద్భుతమైన ఫలితాలను సాధిస్తారు. సహోద్యోగులతో పోటీ పడాల్సి వస్తుంది. వివాదాలు తలకు చుట్టుకోకుండా మీ వంతు ప్రయత్నాలు చేస్తారు. లక్కీ కలర్: తెలుపు తుల (సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22) ఆర్థిక వ్యవహారాల్లో ఆచి తూచి వ్యవహరిస్తారు. గతంలో చవిచూసిన చేదు అనుభవాల వల్ల అభద్రతా భావానికి లోనవు తారు. శ్రద్ధాసక్తులతో పనిచేసి అద్భుతమైన ఫలితాలను సాధిస్తారు. విలాస వస్తువులను సేకరిస్తారు. షాపింగ్ వంటి కార్యక్రమాల్లో బిజీబిజీగా గడుపుతారు. అయితే, ఖర్చును అదుపు తప్పకుండా చూసుకోవాల్సి ఉంటుంది. లక్కీ కలర్: లేత నారింజ వృశ్చికం (అక్టోబర్ 23 - నవంబర్ 21) ఎలాంటి అవాంతరాలనైనా సునాయాసంగా ఎదుర్కొని నిలదొక్కుకుంటారు. స్థిరాస్తులకు సంబంధించిన వ్యాపారాలు అనుకూలిస్తాయి. కుటుంబ వ్యాపారంలో కొనసాగుతున్నట్లయితే మీ పేరు ప్రఖ్యాతులు మరింతగా ఇనుమడిస్తాయి. అయితే, ఆరోగ్యంపై శ్రద్ధ చూపాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది. లక్కీ కలర్: ముదురు నారింజ ధనుస్సు (నవంబర్ 22 - డిసెంబర్ 21) సృజనాత్మక రంగంలో కొత్త అనుబంధం ఒకటి ఏర్పడుతుంది. కావలసినవన్నీ అందుబాటులోనే ఉన్నా, ఆశించిన లక్ష్యాలను సాధించడానికి మరింత కఠినంగా శ్రమించాల్సి వస్తుంది. ప్రతి అవకాశాన్నీ అందిపుచ్చుకుని, వాటి ద్వారా లబ్ధి పొందుతారు. విహార యాత్రల్లో ఉల్లాసంగా పాల్గొంటారు. భాగస్వామ్య వ్యాపారాల్లో చేరడానికి ఇది అనుకూలమైన కాలం. లక్కీ కలర్: ఇటుక రంగు మకరం (డిసెంబర్ 22 - జనవరి 19) పనుల ఒత్తిడిలో ఊపిరి సలపకుండా ఉంటారు. ఒంటరిగా గడపాలని కోరుకుంటారు. అయితే, పరిస్థితుల నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదు. విద్యార్థులు చదువుపై ఏకాగ్రత పెంచుకునేందుకు ప్రయత్నిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో తీవ్రమైన పోటీ ఎదుర్కొంటారు. ఆచి తూచి వ్యవహరించకుంటే ప్రేమికుల మధ్య మనస్పర్థలు తప్పకపోవచ్చు. లక్కీ కలర్: పసుపు కుంభం (జనవరి 20 - ఫిబ్రవరి 18) గ్రహబలం అనుకూలంగా ఉండటంతో అన్ని విధాలా కలిసొచ్చే కాలం. వృత్తి ఉద్యోగాల్లో సృజనాత్మక శక్తితో, ప్రతిభా పాటవాలతో అందరినీ మెప్పిస్తారు. ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది. విలాస వస్తువులను కొనుగోలు చేస్తారు. ఇంట్లోను, కార్యాలయంలోను మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తారు. లక్కీ కలర్: ఆకుపచ్చ మీనం (ఫిబ్రవరి 19 - మార్చి 20) అవరోధాలను అధిగమిస్తారు. ఇతరులపై ఆధారపడకుండా స్వయంకృషితో సంపాదనకు ప్రయత్నిస్తారు. పరిస్థితులు అంత అనుకూలంగా లేకున్నా, ధైర్యం కోల్పోకుండా ముందుకు సాగుతారు. మీపై శ్రద్ధ తీసుకునే ఆత్మీయులు ఒకరు మీకు తగిన సలహాలు ఇచ్చి, సమస్యల నుంచి గట్టెక్కిస్తారు. ఈ వారంలో దురలవాట్లకు దూరంగా ఉంటే క్షేమం. లక్కీ కలర్: నీలం - ఇన్సియా టారో అనలిస్ట్ -
టారో: 26 జూన్ నుంచి 2జూలై, 2016 వరకు
మేషం (మార్చి 21 - ఏప్రిల్ 19) పనుల్లో తలమునకలుగా గడిపిన మీరు ఈ వారంలో తీరికగా, ప్రశాంతంగా గడుపుతారు. కుటుంబంపై శ్రద్ధ తీసుకుంటారు. కెరీర్లో మార్పులు మిమ్మల్ని మరింతగా సేవాదృక్పథం వైపు మళ్లిస్తాయి. బాధ్యతలు స్వీకరించేందుకు సంసిద్ధులవుతారు. పెట్టుబడుల విషయంలో మరికొంతకాలం వేచి చూడాల్సి ఉంటుంది. లక్కీ కలర్: గులాబి వృషభం (ఏప్రిల్ 20 - మే 20) భావోద్వేగాలు, అనుబంధాలు మీ ఆలోచనలను నియంత్రిస్తాయి. పని నుంచి మీ దృష్టిని మళ్లిస్తాయి. ఇతరుల సమస్యల నుంచి దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. పనిలో మరింత గాఢంగా నిమగ్నమవుతారు. డబ్బుకే ప్రాధాన్యమిచ్చే పరిస్థితులు ఉంటాయి. రచన, బోధన వంటి ప్రాజెక్టులకు అనుకూలం లక్కీ కలర్: ముదురు ఆకుపచ్చ మిథునం (మే 21 - జూన్ 20) మీ పనులకు, మీ అంచనాలకు పొంతన కుదరకపోవచ్చు. ఇతరులను మెప్పించే ప్రయత్నాలకు దూరంగా ఉండటం మంచిది. కొరుకుడు పడని మనుషులతో పేచీలు రావచ్చు. పని ఒత్తిడితో అలసట చెందుతారు. సృజనాత్మక, ఆధ్యాత్మిక మార్గాల్లో పురోగతి సాధిస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. లక్కీ కలర్: నారింజ కర్కాటకం (జూన్ 21 - జూలై 22) వారమంతా ప్రశాంతంగా గడుపుతారు. తలపెట్టిన పనులను సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. నిర్ణయాలు తీసుకునే ముందు క్షుణ్ణంగా పరిశీలించాల్సిన పరిస్థితులు ఉంటాయి. పనుల్లో అనుకోని జాప్యాలు ఎదురవుతాయి. కొత్త భాగస్వాములు కలుసుకోవడం లేదా కొత్త వెంచర్లు ప్రారంభించడం జరగవచ్చు. సృజనాత్మకమైన వెంచర్లు సానుకూలంగా ఉంటాయి. లక్కీ కలర్: పసుపు సింహం (జూలై 23 - ఆగస్ట్ 22) కొత్త ప్రదేశాలకు స్వేచ్ఛగా వెళ్లడానికి సిద్ధంగా ఉంటారు. మీ ఆశలు, ఆశయాలు, కలలు నెరవేరే తరుణం ఆసన్నమైంది. దూర ప్రయాణాలు చేస్తారు. జీవితంలో పురోగతి సాధిస్తారు. వ్యాపారావకాశాలు కలిసొస్తాయి. అయితే, ఈ వారంలో శక్తికి మించిన భారాలను తలకెత్తుకోకపోవడమే మంచిది. ఆత్మీయా నుబంధాల్లో అభద్రతాభావానికి లోనవుతారు. లక్కీ కలర్: బూడిదరంగు కన్య (ఆగస్ట్ 23 - సెప్టెంబర్ 22) ఓపికగా వ్యవహరించడం వల్ల కలిగే లాభాలను అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు. ప్రశాంతంగా, నిదానంగా వ్యవహరించడం వల్ల సత్ఫలితాలను పొందగలుగుతారు. ఈ వారంలో కొన్ని ఉత్కంఠభరితమైన సంఘటనలను ఎదుర్కొంటారు. నిబద్ధత, లక్ష్యశుద్ధితో ఆశించిన లక్ష్యాలను సాధిస్తారు. లక్కీ కలర్: నాచురంగు తుల (సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22) విశ్రాంతిగా గడపడం ద్వారా శక్తులను కూడదీసుకుంటారు. పని ప్రణాళికలకు సంబంధించి కొన్ని త్యాగాలు చేయక తప్పకపోవచ్చు. ఈ వారంలో కొత్త పనులు ప్రారంభించే ముందు పాతవి పూర్తి చేయడం క్షేమం. ఆత్రపడకుండా వేచి చూసే ధోరణిని అవలంబించండి. పరిస్థితులన్నీ నెమ్మదిగా వాటంతట అవే మెరుగుపడతాయి. సొంత ఆలోచనలకు అనుగుణంగా ముందుకు సాగుతారు. లక్కీ కలర్: నారింజ వృశ్చికం (అక్టోబర్ 23 - నవంబర్ 21) సానుకూలమైన ఆలోచనలతో సత్ఫలితాలను సాధిస్తారు. నేల విడిచి సాము చేయకుండా నిలకడగా వ్యవహరిస్తారు. కుటుంబ వ్యవహారాలకు అధిక ప్రాధాన్యమిస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో మరింత శ్రద్ధ చూపాల్సి వస్తుంది. మీరు పెట్టాలనుకున్న పెట్టుబడుల కోసం అదనపు నిధులు అవసరమవుతాయి. కెరీర్లో పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తారు. మీ బృందాన్ని సమర్థంగా ముందుకు నడిపిస్తారు. లక్కీ కలర్: మట్టిరంగు ధనుస్సు (నవంబర్ 22 - డిసెంబర్ 21) పనిలో నిరంతరం తలమునకలయ్యే మీరు ఈ వారంలో విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరాన్ని గుర్తిస్తారు. ఒత్తిడికి దూరంగా సన్నిహితులతో కలసి విహారయాత్రకు వెళతారు. మిత్రుల్లో ఒకరి పట్ల డబ్బు విషయంలో చాలా ఉదారంగా వ్యవహరిస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో పనులు మందకొడిగా సాగుతాయి. లక్కీ కలర్: చాక్లెట్ మకరం (డిసెంబర్ 22 - జనవరి 19) ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతారు. వేడుకలు, సంబరాల్లో పాల్గొంటారు. ఒక ప్రత్యేకమైన వేడుకలో పాల్గొనేందుకు ఆహ్వానం అందుకుంటారు. అయితే, వృత్తి ఉద్యోగాల్లో సమస్యలు, సంఘర్షణలు ఎదుర్కొంటారు. ఆర్థిక లాభాలు పొందుతారు. మీ జీవిత భాగస్వామి మీ పట్ల ఇదివరకటి కంటే ఎక్కువగా అనురాగాన్ని ప్రదర్శిస్తారు. లక్కీ కలర్స్: పొద్దుతిరుగుడు కుంభం (జనవరి 20 - ఫిబ్రవరి 18) కెరీర్లో పురోగతి బాగుంటుంది. కెరీర్ లక్ష్యాలు ఎలా ఉన్నా, కుటుంబానికి తగిన ప్రాధాన్యం ఇచ్చి, ఇంట్లో సుఖశాంతులు సాధిస్తారు. మీ ఆర్థిక పరిస్థితులు ఈ వారంలో మీ ప్రేమానుబంధాలతో ముడిపడి ఉంటాయి. అన్ని రంగాల్లోనూ నీతి నిజాయతీలతో వ్యవహరించి సత్ఫలితాలు సాధిస్తారు. మీ చిరకాల వాంఛ నెరవేరే అవకాశాలు ఉన్నాయి. లక్కీ కలర్: బంగారు మీనం (ఫిబ్రవరి 19 - మార్చి 20) ఆర్థిక విజయాలు సాధిస్తారు. అనూహ్యమైన, ఆనందకరమైన సమాచారం ఒకటి అందుకుంటారు. సాహసమే ఊపిరి అన్నట్లుగా ధైర్యసాహసాలతో ముందంజ వేస్తారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు జరుగుతాయి. విధి విలాసాన్నీ, కర్మ ఫలితాన్ని ఒకేలా తీసుకుని స్థితప్రజ్ఞ చూపుతారు. ధన వస్తు లాభాల కంటే సాధించిన విజయమే మీకు ఎక్కువ సంతృప్తిని ఇస్తుంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. లక్కీ కలర్: తెలుపు - ఇన్సియా, టారో అనలిస్ట్ -
టారో: 19 జూన్ నుంచి 25 జూన్, 2016 వరకు
మేషం (మార్చి 21 - ఏప్రిల్ 19) వారం మొత్తం విజయవంతంగా సాగుతుంది. మహిళా వ్యాపారవేత్తలకు, సొంత వృత్తుల్లో ఉన్నవారికి కొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. అకస్మాత్తుగా ప్రేమలో పడే అవకాశాలు ఉన్నాయి. ప్రేమ మైకంలో కలల్లో తేలిపోతారు. ఎలాంటి దిశానిర్దేశం లేకుండా సాగుతున్నామని భావిస్తారు. అయితే, గ్రహబలం వల్ల సురక్షితంగానే ఉంటారు. లక్కీ కలర్: పసుపు వృషభం (ఏప్రిల్ 20 - మే 20) జీవితం సుసంపన్నంగా సాగుతుంది. గతానికి చెందిన గాయాలను మరచిపోయి ముందుకు సాగుతారు. అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. స్థైర్యం కోల్పోయి కలవరపడవద్దు. మానసికంగా చికాకులు ఎదురైనా, ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది. మిత్రులతో మాట్లాడటం ద్వారా సాంత్వన పొందుతారు. వారి సలహాలు స్వీకరిస్తారు. లక్కీ కలర్: ఆకుపచ్చ మిథునం (మే 21 - జూన్ 20) కుటుంబంలో సుఖసంతోషాలు నెలకొంటాయి. ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతారు. ఇంతవరకు మీరు చేసిన కఠోర పరిశ్రమకు తగిన ఫలితాలను అందుకుంటారు. ఇల్లు మారే అవకాశాలు ఉన్నాయి. కెరీర్‌పరంగా సుస్థిరతను సాధిస్తారు. జీవితం సుస్థిరంగా, సురక్షితంగా, లాభదాయకంగా సాగుతుంది. లక్కీ కలర్: లేత ఊదా కర్కాటకం (జూన్ 21 - జూలై 22) వృత్తి ఉద్యోగాల్లో ఇది గడ్డుకాలమే అని చెప్పవచ్చు. ఇంటా బయటా ఒత్తిళ్లు తప్పవు. అడుగడుగునా సవాళ్లు ఎదురవుతాయి. మీ పనితీరుపై పదే పదే ఎదురయ్యే ప్రశ్నలు చిరాకుపెడతాయి. అవివాహితులు వివాహానికి సంబంధించి కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. అనిశ్చితి నుంచి బయటపడటానికి చొరవ తీసుకుని ధైర్యంగా ముందంజ వేస్తారు. లక్కీ కలర్: నీలం సింహం (జూలై 23 - ఆగస్ట్ 22) వ్యాపార భాగస్వాముల మధ్య బంధం బలపడుతుంది. ప్రేమికుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. లక్ష్య సాధన కోసం కఠోరంగా పరిశ్రమిస్తారు. ఆశించిన విజయాలు సాధిస్తారు. కొత్త వెంచర్లు ప్రారంభిస్తాయి. అదనపు బాధ్యతలను స్వీకరించడానికి సిద్ధంగా ఉండాల్సిన కాలం ఇది. ఇంట్లో జరిగే వేడుకల్లో పాల్గొంటారు. లక్కీ కలర్: లేత గులాబి కన్య (ఆగస్ట్ 23 - సెప్టెంబర్ 22) ఈ వారంలో మీకు లక్ష్మీకటాక్షం పుష్కలంగా ఉంటుంది. కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. కొత్త ఇంటి కొనుగోలుకు ఒప్పందాలు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే, ఆశించిన లక్ష్యాలు సాధించడానికి మరింతగా శ్రమించాల్సి వస్తుంది. ప్రేమికులు ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతారు. అదృష్టం కలిసొస్తుంది. లక్కీ కలర్: కెంపు ఎరుపు తుల (సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22) అనుబంధాల విషయంలో ఈ వారం పట్టువిడుపులు ప్రదర్శిస్తేనే మంచిది. పరుగులు తీసే కాలంతో పోటీ పడి పనులు పూర్తి చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. మొండితనం వల్ల మీ ఎదుగుదలకే అవరోధం కలుగుతుందని గ్రహించి ముందుకు సాగండి. త్వరలోనే అదృష్టం కలిసొచ్చే కాలం ప్రారంభం కానుంది. ఇంట్లోని పనికిరాని వస్తువులను వదుల్చుకుంటారు. లక్కీ కలర్: ఊదా వృశ్చికం (అక్టోబర్ 23 - నవంబర్ 21) అన్ని విషయాల్లోనూ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. వారం మొత్తం సుసంపన్నంగా సాగుతుంది. గ్రహబలం పూర్తి అనుకూలంగా ఉంటుంది. చిరకాలంగా పూర్తి చేయకుండా మరుగునపడ్డ పనులను ఎట్టకేలకు పూర్తి చేస్తారు. శ్రమకు తగిన గుర్తింపు దక్కుతుంది. ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలు ఉంటాయి. విద్యార్థులు మంచి ఫలితాలను సాధిస్తారు. లక్కీ కలర్: పొద్దుతిరుగుడు పసుపు ధనుస్సు (నవంబర్ 22 - డిసెంబర్ 21) ఈ వారంలో దుబారా ఖర్చులను అదుపు చేసుకుంటేనే మంచిది. దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను అందుకోవడానికి బడ్జెట్‌కు కట్టుబడి ఆచి తూచి ఖర్చు చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. శక్తివంచన లేకుండా లక్ష్య సాధన కోసం కృషి చేస్తారు. ఒత్తిడులు ఎదురైనా, కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతారు. లక్కీ కలర్: బూడిదరంగు మకరం (డిసెంబర్ 22 - జనవరి 19) వృత్తి, ఉద్యోగాల్లో అనూహ్యమైన మార్పులు ఉంటాయి. ఉద్యోగంలో ఉన్నతి లేదా మార్పు జరిగే అవకాశాలు ఉంటాయి. బదిలీలు జరగవచ్చు. ఈ వారంలో వివాదాలకు దూరంగా ఉండటమే క్షేమం. ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి బయటపడటానికి ప్రయాస పడాల్సి వస్తుంది. కల్మషం లేని మీ వ్యక్తిత్వమే మీకు శ్రీరామరక్ష. లక్కీ కలర్: తెలుపు కుంభం (జనవరి 20 - ఫిబ్రవరి 18) గ్రహబలం పూర్తి అనుకూలంగా ఉంటుంది. గొప్ప అవకాశాలు మీ తలుపు తడతాయి. విద్యార్థులు అనుకున్న కోర్సుల్లో చేరుతారు. కెరీర్ ప్రారంభదశలో ఉన్న ఉద్యోగులు తమ పనితీరుతో సత్ఫలితాలు సాధిస్తారు. అదనపు బాధ్యతలు స్వీకరించి నాయకత్వ పాత్ర పోషించే అవకాశం దొరుకుతుంది. పని ఒత్తిడి పెరిగినా, ఉత్సాహభరితంగా గడుపుతారు. లక్కీ కలర్: నాచురంగు మీనం (ఫిబ్రవరి 19 - మార్చి 20) కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ప్రేమికుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. సరదా షికార్లు, షాపింగ్‌లతో ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతారు. చిరకాలంగా కొనాలనుకుంటున్న వాహనం, నగలు వంటివి కొనుగోలు చేస్తారు. ఇంటా బయటా ఆనందంగా గడుపుతారు. శ్రమకు తగిన ఫలితాన్ని దక్కించుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో కీర్తిప్రతిష్టలు ఇనుమడిస్తాయి. కొత్త ఆశలు చిగురిస్తాయి. లక్కీ కలర్: లేత గులాబి -
టారో : 12 జూన్ నుంచి 18జూన్, 2016 వరకు
మేషం (మార్చి 21 - ఏప్రిల్ 19) ఎలాంటి సమస్యలు ఎదురైనా, ఆశను విడనాడకండి. పని ఒత్తిడి నుంచి కాస్త విరామం తీసుకోండి. కాలమే అన్ని గాయాలనూ మాన్పుతుంది. పనులు వాటంతట అవే పూర్తవుతాయి. ప్రేమ వ్యవహారాల్లో నిజాయతీగా వ్యవహరించండి. ఇచ్చిన మాటను నిలబెట్టుకోండి. మీ నిబద్ధతే ఈ వారం మిమ్మల్ని విజయపథంలో నడిపిస్తుంది. లక్కీ కలర్స్: నీలం, ఊదా వృషభం (ఏప్రిల్ 20 - మే 20) మిత్రులెవరో, శత్రువులెవరో తెలుసుకోగలుగుతారు. సన్నిహితుల్లో ఒకరు మిమ్మల్ని వ్యతిరేకించవచ్చు. అయితే, మీరు ప్రేమించిన వారితో మీ బంధం బలపడుతుంది. అనుకోని సంఘటనలు జరిగినా, సీరియస్‌గా పట్టించుకోకండి. ఆర్థిక ఇబ్బందులు ఎదురు కావచ్చు. లక్కీ కలర్స్: ఆకుపచ్చ, పసుపు మిథునం (మే 21 - జూన్ 20) మొండిబకాయిలు వసూలవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో పేరు ప్రఖ్యాతులు ఇనుమడిస్తాయి. ఇంటా బయటా పని ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ వ్యవహారాలు మిమ్మల్ని బిజీగా ఉంచుతాయి. కొత్త ఇల్లు కట్టడం లేదా ఇంటి పునర్నిర్మాణం చేయడం వంటి పనులు చేపడతారు. ఆత్మీయులతో ప్రేమానుబంధాలు బలపడతాయి. అవివాహితులకు వివాహానికి అనుకూలమైన కాలం. లక్కీ కలర్: నీలం కర్కాటకం (జూన్ 21 - జూలై 22) అన్ని రంగాల్లోనూ పూర్తి అనుకూలమైన కాలం. మంచి అవకాశాలు మీ తలుపు తడతాయి. కొత్త జీవితానికి నాందీ ప్రస్తావన జరుగుతుంది. గతాన్ని మరచి ముందుకు సాగుతారు. ఆటవిడుపుగా కాలం గడుపుతారు. చిన్న చిన్న సరదాలు తీర్చుకునేందుకు తగిన తీరిక దొరుకుతుంది. విద్యార్థులకు, పరిశోధకులకు అనుకూలంగా ఉంటుంది. అవివాహితులకు వివాహం జరిగే అవకాశాలు ఉన్నాయి. లక్కీ కలర్: లేత నారింజ సింహం (జూలై 23 - ఆగస్ట్ 22) చక్కని మాటతీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఒప్పందాలకు అనుకూలమైన కాలం. ప్రముఖులను కలుసుకుంటారు. ఇతరుల అభిప్రాయాలను మనస్ఫూర్తిగా స్వీకరించి, మీదైన వివేకంతో ముందుకు సాగుతారు. కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన సందర్భాల్లో సవాళ్లు ఎదురవుతాయి. సృజనాత్మకమైన పనుల్లో నిమగ్నమవుతారు. లక్కీ కలర్స్: తెలుపు, మీగడరంగు కన్య (ఆగస్ట్ 23 - సెప్టెంబర్ 22) సంపద సమకూరుతుంది. ఉద్యోగపరంగా సానుకూలమైన మార్పులు జరుగుతాయి. మీరు కలలు కన్న ఉన్నత స్థానానికి చేరుకుంటారు. కొత్త అనుబంధం బలపడుతుంది. మీ నైపుణ్యాలను మెరుగుపరచుకోవడం ద్వారా సత్ఫలితాలను సాధిస్తారు. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలకు సమయం వెచ్చిస్తారు. వ్యాయామంపై దృష్టి సారించాల్సి ఉంటుంది. లక్కీ కలర్: ముదురు ఆకుపచ్చ తుల (సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22) మరింత అవగాహన పెంచుకుంటారు. విషయాలను కూలంకషంగా అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తారు. ఈ వారంలో ధ్యానానికి సమయం కేటాయించడం మంచిది. చాలారోజులుగా ఇబ్బంది పెడుతున్న సమస్యలు తొలగిపోతాయి. మీ కుటుంబ సభ్యుల కోసం మరింత కాలాన్ని వెచ్చించాల్సి ఉంటుంది. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. లక్కీ కలర్స్: ఎరుపు, నలుపు వృశ్చికం (అక్టోబర్ 23 - నవంబర్ 21) కుటుంబ సభ్యులతోను, బంధుమిత్రులతోను ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతారు. సమస్యలకు పరిష్కారం మీ ఆలోచనల్లోనే స్ఫురిస్తుంది. ఇచ్చి పుచ్చుకునే ధోరణితో ఇంటా బయటా సమతుల్యతను సాధిస్తారు. ఖర్చులను అదుపు చేసుకుంటారు. మీ ప్రయత్నాలన్నింటిలోనూ కుటుంబ సభ్యుల నుంచి, బంధుమిత్రుల నుంచి తగిన సహాయ సహకారాలు అందుతాయి. లక్కీ కలర్: గోధుమరంగు ధనుస్సు (నవంబర్ 22 - డిసెంబర్ 21) ఆత్మీయానుబంధాలలో తలెత్తిన సమస్యలను పరిష్కరించుకుంటారు. ప్రేమ వ్యవహారాల్లో చొరవ తీసుకుని ముందంజ వేస్తారు. డోలాయమానంగా ఉన్న పరిస్థితులు ఒక కొలిక్కి వస్తాయి. ఆధ్యాత్మిక జీవితంలో పురోగతి సాధిస్తారు. కెరీర్ పరంగా మంచి అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. విశ్రాంతి కోసం విహార యాత్రలకు వెళతారు. లక్కీ కలర్: ఊదా మకరం (డిసెంబర్ 22 - జనవరి 19) జీవితంలో మెరుగైన మార్పులు సంభవిస్తాయి. కోరుకున్నవి క్రమంగా అందుబాటులోకి వస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో పురోగతి సాధిస్తారు. కెరీర్ పరంగా పలుకుబడి గల వ్యక్తులను కలుసుకుంటారు.బంధువుల అనారోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ప్రేమాను బంధాలలో పొరపొచ్చాలు తలెత్తవచ్చు. లక్కీ కలర్: నీలం కుంభం (జనవరి 20 - ఫిబ్రవరి 18) సమస్యల సుడిగుండం నుంచి బయటపడతారు. ఆచితూచి ఒక అడుగు వెనక్కు వేసి, కొంత విరామం తీసుకుంటారు. మరీ అలసట చెందేంతగా పనులను నెత్తిన వేసుకోవద్దు. ఆరోగ్యంపై జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. తీరికవేళల్లో ఆరుబయట గడపడం ద్వారా నూతనోత్సాహం పొందుతారు. ప్రేమలో పడతారు. తొందరపడకుండా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. లక్కీ కలర్: గులాబి మీనం (ఫిబ్రవరి 19 - మార్చి 20) మీ జీవితంలో ముఖ్యమైన దశను విజయవంతంగా ముగిస్తారు. అర్థవంతమైన పనులు సాధించాలని తపన పడతారు. మంచితనంతో అందరినీ ఆకట్టుకుంటారు. ఇతరుల్లో స్ఫూర్తి కలిగిస్తారు. చెక్కుచెదరని మీ సానుకూల దృక్పథమే మిమ్మల్ని విజయ పథంలో నడిపిస్తుంది. కుటుంబ సభ్యులతో సంబంధాలు బలపడతాయి. శ్రమకు తగిన ప్రతిఫలితాలను అందుకుంటారు. ఆస్తులు కొనుగోలు చేస్తారు. లక్కీ కలర్: ఆకుపచ్చ - ఇన్సియా, టారో అనలిస్ట్ -
వారఫలాలు : 5 జూన్ నుంచి 11జూన్, 2016 వరకు
మేషం (మార్చి 21 - ఏప్రిల్ 19) పుష్కలంగా సంపద కలిసొచ్చే కాలం. శుభవార్తలు వింటారు. ఉద్యోగులకు పదోన్నతులు లభించవచ్చు. పొరపాట్లు చేయకుండా ఉండటానికి అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. ప్రేమికులతో ఆనందంగా కాలం గడుపుతారు. అంతా సానుకూలంగా గడుస్తుంది. ఆరోగ్యపరంగా తీసుకుంటున్న జాగ్రత్తలు విసుగు కలిగించినా, వాటిని మానుకోవద్దు. లక్కీ కలర్: బ్రౌన్ వృషభం (ఏప్రిల్ 20 - మే 20) అనూహ్యమైన మార్పులు ఉంటాయి. భయాలను, భ్రమలను విడిచిపెట్టడం ద్వారా జీవితంలో ఆచరణాత్మకమైన మార్పులకు శ్రీకారం చుడతారు. భావోద్వేగాలు తరచూ మారుతూ ఉండవచ్చు. ఈ విషయమై కొంత అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. మీ ఆలోచనలను పంచుకోగల భాగస్వామి తారసపడతారు. లక్కీ కలర్: పసుపు మిథునం (మే 21 - జూన్ 20) శుభ సంకేతాలు అందుతాయి. వాటి ఆధారంగా ముందుకు సాగడం ద్వారా సంపదను, సంతోషాన్ని పొందగలరు. ఇతరుల విమర్శలపై వ్యతిరేకత పెంచుకోకండి. అపోహలకు లోను కాకుండా, ఎదుటివారు చెప్పే మాటలను శ్రద్ధగా ఆలకించండి. ఇంట్లో జరిగే వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. లక్కీ కలర్: నీలం కర్కాటకం (జూన్ 21 - జూలై 22) ఆలోచనల్లో గందరగోళం కారణంగా అవరోధాలు ఎదురవుతాయి. ఆర్థిక పరిజ్ఞానం ఉన్న వ్యక్తి నుంచి సలహా కోరుకుంటారు. మీ బాధ్యతలు పెరుగుతాయి. పనికి, ఆటవిడుపు కార్యక్రమాలకు సమతుల్యత సాధించాల్సి ఉంటుంది. తద్వారా మాత్రమే ఆశించిన లక్ష్యాలను సాధించగలరు. ఆఫీసులో మార్పులు జరిగే సూచనలు ఉన్నాయి. మార్పుల వల్ల మీలోని నైపుణ్యాలు వెలుగులోకి వస్తాయి. లక్కీ కలర్: బ్రౌన్ సింహం (జూలై 23 - ఆగస్ట్ 22) జీవనశైలిపై మీ అభిప్రాయాలను మార్చుకోవాల్సిన పరిస్థితులు తలెత్తుతాయి. కాస్త లౌక్యంగా మాట్లాడటం నేర్చుకోవాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. పనికి సంబంధించిన ఒక కీలక సమాచారం మీ ఆలోచనా సరళిలో పెను మార్పులకు కారణమవుతుంది. మీ స్వస్థలంలో సామాజిక సేవా కార్యకలాపాల్లో పాల్గొంటారు. లక్కీ కలర్: ఆకుపచ్చ కన్య (ఆగస్ట్ 23 - సెప్టెంబర్ 22) అధ్యయనం కోసం మీరు వెచ్చించిన కాలం వృథా పోదు. పైగా సత్ఫలితాలను ఇస్తుంది. జ్ఞాన సంపదతోనే మీరు మీ కలలను నెరవేర్చుకుంటారు. ఒక ముఖ్యమైన సందేశాన్ని అందుకుంటారు. ఈ వారంలో మీరు దూర ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. మీ పిల్లలు సాధించిన విజయాలు మీకు గర్వకారణంగా నిలుస్తాయి. లక్కీ కలర్: గులాబి తుల (సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22) కాలం ప్రవాహంలా ముందుకు సాగుతుంది. ఏదీ ప్రణాళికాబద్ధంగా సాగదు. ఏ రోజు పని ఆ రోజుకు ముగించుకుంటారు. సన్నిహితులతో వాదులాటలు జరిగే అవకాశాలు ఉన్నాయి. నలుగురూ చేరే చోట సామాజిక, రాజకీయ వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఒకరి ద్వారా సమస్యల పరిష్కారానికి చేసే ప్రయత్నాలు మిమ్మల్ని బలహీనంగా మారుస్తాయి. లక్కీ కలర్: లేత గోధుమరంగు వృశ్చికం (అక్టోబర్ 23 - నవంబర్ 21) పెట్టుబడులకు అనుకూలమైన కాలం. ఆర్థికంగా కొత్త అవకాశాలు కలిసొస్తాయి. సృజనాత్మకమైన ఆలోచనలతో మంచి అవకాశాలను అందిపుచ్చుకుంటారు. అన్ని రంగాల్లోనూ గొప్ప ఫలితాలను సాధిస్తారు. చేపట్టిన ప్రతి పనిలోనూ ఘన విజయాలు సాధిస్తారు. అయితే, మీపై అసూయాపరుల చెడు దృష్టి సోకకుండా ఉండటానికి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. లక్కీ కలర్: ఊదా ధనుస్సు (నవంబర్ 22 - డిసెంబర్ 21) సానుకూలమైన మార్పులు సంతోషం కలిగిస్తాయి. ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతారు. కొత్త కొత్త సవాళ్లకు సంసిద్ధంగా ఉంటారు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. కెరీర్లో మీకు అనుకూలమైన మార్పులు జరుగుతాయి. ఉద్యోగ జీవితంలో గట్టి పోటీ ఎదురయ్యే పరిస్థితులు ఉన్నాయి. అయితే, గ్రహబలం వల్ల అవరోధాలను అధిగమిస్తారు. లక్కీ కలర్: నారింజ మకరం (డిసెంబర్ 22 - జనవరి 19) కఠిన పరిశ్రమకు తగిన ఫలితాలను అందుకుంటారు. ఇబ్బందికరమైన పరిస్థితులను చాకచక్యంగా అధిగమిస్తారు. మీ ఆరోగ్యం పట్ల ఒక మహిళ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ఈ వారంలో అనవసరపు ఖర్చులకు దూరంగా ఉంటేనే మంచిది. జీవిత భాగస్వామితో కలసి నిర్ధారించుకున్న ప్రణాళికల్లో మార్పులు చేయవద్దు. మనస్పర్థలు తలెత్తే సూచనలు ఉన్నాయి. లక్కీ కలర్: లేతనీలం కుంభం (జనవరి 20 - ఫిబ్రవరి 18) పరస్పర విరుద్ధమైన అంశాలు మిమ్మల్ని చెరోవైపు లాగుతుంటాయి. వారం ప్రారంభంలో ఎటూ తేల్చుకోలేని డోలాయమాన స్థితిలో పడతారు. నెమ్మదిగా పరిస్థితిని అదుపులోకి తెచ్చుకుంటారు. కొత్త ఆస్తుల కొనుగోలుకు పూర్తి సానుకూలమైన కాలం. కుటుంబంలోని పెద్దలతో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. లక్కీ కలర్: బూడిదరంగు మీనం (ఫిబ్రవరి 19 - మార్చి 20) అడుగడుగునా సవాళ్లు ఎదురవుతాయి. గట్టి ప్రయత్నంతో వాటన్నింటినీ అధిగమిస్తారు. ఒక సామాజిక కార్యక్రమానికి నాయకత్వం వహించే అవకాశం లభిస్తుంది. మీ పరిజ్ఞానంతో, అనుభవంతో శరవేగంగా పనులు పూర్తి చేస్తారు. ప్రేమ వ్యవహారాలు నిస్తేజంగా అనిపిస్తాయి. ఈ పరిస్థితి చక్కదిద్దడానికి మీ వంతు ప్రయత్నాలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. లక్కీ కలర్: నారింజ - ఇన్సియా,టారో అనలిస్ట్ -
టారో : 29 మే నుంచి 4 జూన్, 2016 వరకు
మేషం (మార్చి 21 - ఏప్రిల్ 19) దేనికైనా వెనుకంజ వేయడానికి, తాత్సారం చేయడానికి ఇది తగిన సమయం కాదు. పాత బంధాలను వదులుకుంటారు. ఏకాంతమే మీ బాధలన్నింటినీ నయం చేస్తుంది. సమస్యలు చుట్టుముట్టిన వెంటనే వాటి పరిష్కారానికి నడుం బిగించకండి. కొంత కాలం మౌనంగా గమనిస్తూ ఉంటే, అన్నీ సర్దుకుంటాయి. లక్కీ కలర్: ఊదా వృషభం (ఏప్రిల్ 20 - మే 20) ఈ వారం మీలో ఉత్సాహం ఉరకలు వేస్తుంది. అద్భుతమైన శక్తితో పనులు పూర్తి చేస్తారు. ఉరకలు వేసే ఉత్సాహంలోని హెచ్చుతగ్గులు మీ అనుభవంలోకి వస్తాయి. ఉత్సాహం ఉధృతి నిమ్మళించాక మీరు చాలా సహజంగా తయారవుతారు. ఇంట్లో సంతోషంగా గడుపుతారు. ప్రకృతిలోని చెట్లలా, పిట్టల్లా మీ సహజ స్థితిని మనసారా అనుభూతిస్తారు. అత్యంత సహజంగా మిమ్మల్ని మీరు అభివ్యక్తీకరించుకుంటారు. లక్కీ కలర్: ఎరుపు మిథునం (మే 21 - జూన్ 20) కాలం నెమ్మదిగా నడుస్తున్నట్లుగా ఉంటుంది.. ఈ వారంలో మీ ఊహలకు రెక్కలొస్తాయి. ఇంద్రియాల బాహ్యంతర సంచలనాలను, ఇంద్రియాల ద్వారా కాల చలనాన్ని స్పష్టంగా అనుభూతి చెందుతారు. మీ ఎదుట ఒక కొత్త ప్రపంచం ఆవిష్కృతమవుతుంది. అనుకున్న పనుల్లో చాలావరకు సునాయాసంగా నెరవేరుతాయి. లక్కీ కలర్: గులాబి కర్కాటకం (జూన్ 21 - జూలై 22) కార్యాచరణలోకి దిగే ముందు ఎదురుచూపులోని తీపి బాధను మనసారా అనుభవించే పరిస్థితులు ఎదురవుతాయి. అన్ని శంకలూ తొలగిపోయి, జీవితంలో అత్యవసరమైనదిగా మీరు భావించే అంశంపై వ్యామోహం పెరుగుతుంది. ప్రతి కొత్త అడుగులోనూ జీవన ప్రయాణం మరింత గాఢతరమవుతూ వస్తుంది.. ఎదురుచూపులు చూసే కాలం పెరుగుతుంది. లక్కీ కలర్: ముదురు ఊదా సింహం (జూలై 23 - ఆగస్ట్ 22) రిస్కు తీసుకోవలసిన సమయం ఇది. ప్రేమను ఆస్వాదించాలంటే రిస్కు తీసుకోక తప్పదు. అయితే, సూర్యుడి ప్రభావం వల్ల అట్టే ఆత్రపడరు. మిమ్మల్ని ఉద్వేగభరితుల్ని చేసే అంశాల వైపు సాగించే ప్రయాణంలో ఆచి తూచి అడుగులు వేయాల్సి ఉంటుంది. ఈ వారంలో మీ జీవితం ప్రతిక్షణం ఉద్విగ్నభరితంగా సాగుతుంది. లక్కీ కలర్: నారింజ కన్య (ఆగస్ట్ 23 - సెప్టెంబర్ 22) సూర్యుడి ప్రభావం వల్ల మీ దారి ఎలాంటి అవరోధాలూ లేకుండా ఉంటుంది. చాలా సహజంగా, తాపీగా ముందుకు సాగుతారు. జీవితంలోని ప్రతి అంశం పరిణామం దిశగా, విస్తరణ దిశగా సంసిద్ధంగా ఉంటాయి. భయం, దిగులు విడనాడి, ధైర్యంగా ముందుకు సాగండి. . మీరు సేదదీరుతూ గడిపినా, ఈ వారంలో పనులు వాటంతట అవే ముందుకు సాగుతాయి. లక్కీ కలర్: పసుపు తుల (సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22) మబ్బుల్లో తేలియాడే మీ ఆలోచనలను పరిస్థితులు నేలకు దించుతాయి. మిమ్మల్ని అప్రమత్తంగా, క్రియాశీలంగా ఉండేలా చేస్తాయి. ఈ వారంలో చేపట్టిన ప్రతి పనిలోనూ మీరు క్రియాశీలంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ప్రతిరోజూ ధ్యానంలో గడపడం ద్వారా మీ జీవితాన్ని మరింత అందంగా మలచుకునేందుకు ప్రయత్నించండి. లక్కీ కలర్: బూడిదరంగు వృశ్చికం (అక్టోబర్ 23 - నవంబర్ 21) ఆవేశంలో అదుపు తప్పే అలవాటు మీకు ఉండొచ్చు. అయితే, గ్రహబలం మిమ్మల్ని స్థిరంగా, బలోపేతంగా ఉంచుతుంది. మీరు తలచుకుంటే, ఏ క్షణంలోనైనా మీ జీవితాన్ని మీ అదుపులోకి తెచ్చుకునే స్థితిలో ఉంటారు. అయితే, ఎలాంటి అపోహలకు లోనుకాకుండా జాగ్రత్త పడాల్సి ఉంటుంది. అంతఃసంఘర్షణలో అలజడి రేపే ఆలోచనలను అదుపులో పెట్టుకోవాల్సి ఉంటుంది. లక్కీ కలర్: తెలుపు ధనుస్సు (నవంబర్ 22 - డిసెంబర్ 21) ఇంతకాలం ఊపిరి సలపనివ్వకుండా ఒత్తిడికి గురిచేసిన ఇబ్బందుల నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది. పరిస్థితులకు ఎదురీదుతున్న మీరు శక్తులను కూడదీసుకుంటారు. ఇప్పటి వరకు జీవితంలో నేర్చుకున్న పాఠాలను ఆచరణలో పెడతారు. మనస్సాక్షికి అనుగుణంగా నడుచుకుంటారు. సంతోషభరితంగా గడుపుతారు. లక్కీ కలర్: మీగడ రంగు మకరం (డిసెంబర్ 22 - జనవరి 19) మీరు సంతోషాన్ని, సంతృప్తిని వేటిలో పొందగలరో వాటన్నింటినీ ఆస్వాదించేందుకు అనువైన సమయం. మీ భుజస్కంధాలపై ఉన్న బాధ్యతల బరువు కొంతవరకు సడలుతుంది. ప్రతి దానికీ బాధ్యత తీసుకునే అలవాటును మానుకోండి. ఆనందానుభూతులు మిమ్మల్ని ఊరిస్తాయి. అయితే, వీటి కారణంగా మీ ఆధ్యాత్మిక ప్రయాణానికి ఎలాంటి అవరోధం ఏర్పడదని తెలుసుకుంటారు. లక్కీ కలర్: లేత ఊదా కుంభం (జనవరి 20 - ఫిబ్రవరి 18) తక్షణ పరిస్థితుల అవసరాలకు అనుగుణంగా మీరు స్పందించే తీరును బట్టే మీకు లభించే ఆనందం ఆధారపడి ఉంటుంది. ఒడిదుడుకులు ఎదురైనా, పట్టువీడని ప్రయత్నంతో ఆశించిన ఫలితాలను సాధిస్తారు. జీవితంలో వెలుగు చీకట్ల నడుమ సమతుల్యత సాధించాలనుకుంటారు. అలాగే స్త్రీ పురుషుల మధ్య సమన్వయం సాధించాలనుకునే ప్రయత్నంలో సఫలీకృతులవుతారు. లక్కీ కలర్: బంగారురంగు మీనం (ఫిబ్రవరి 19 - మార్చి 20) మీలోని శక్తి సామర్థ్యాలను అనుభవంలోకి తెచ్చుకుంటారు. అవకాశాలను అందిపుచ్చుకుంటారు. మీ అంతరాత్మ ప్రబోధానుసారం ముందుకు సాగండి. మీలో పెల్లుబికే వాంఛలను మీ మేధాశక్తితో అణచివేసే ప్రయత్నాలు చేయకండి. ఈ వారం మీ జీవితం మిరుమిట్లుగొలిపే వెలుగులతో ఆనందభరితంగా సాగుతుంది. లక్కీ కలర్: గోధుమరంగు - ఇన్సియా నజీర్, టారో అనలిస్ట్ -
టారో : 22 మే నుంచి 28మే, 2016 వరకు
మేషం (మార్చి 21 - ఏప్రిల్ 19) జీవితంలో కొత్త ప్రయాణం ప్రారంభిస్తారు. మానసికంగా ఒంటరితనాన్ని ఫీలవుతారు. విద్యార్థులకు కొత్త కోర్సుల్లో చేరే అవకాశాలు ఉన్నాయి. ప్రేమికుల నుంచి అందే కానుకలు సంతోషాన్ని కలిగిస్తాయి. ఆరోగ్యపరంగా కళ్లు తిరగడం, మగతగా అనిపించడం వంటి సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఊదారంగు పండ్లు తినడం వల్ల ఫలితం ఉంటుంది. లక్కీ కలర్: ఇండిగో వృషభం (ఏప్రిల్ 20 - మే 20) అహంకార ధోరణి వల్ల అపోహలకు లోనై కుటుంబంలో సంబంధాలను పాడు చేసుకోకండి. మిమ్మల్ని ముందుకు నడిపించే గురువు తారసపడతారు. శుభవార్తలు వింటారు. మీతో ప్రేమానుబంధాన్ని కోరుకుంటున్న వ్యక్తిని కలుసుకుంటారు. పెట్టుబడుల వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. కంటి సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. లక్కీ కలర్: లెమన్ యెల్లో మిథునం (మే 21 - జూన్ 20) ఇది మీకు సుసంపన్నమైన వారం. పెట్టుబడులకు అనుకూలం. కొత్త మిత్రులు తారసపడే అవకాశాలు ఉన్నాయి. సమస్యలు ఎదురైనా పట్టించుకోవాల్సిన పని లేదు. వాటిని మీ సంతోషానికి అవరోధం కానివ్వకండి. సానుకూల ఆలోచనలతో ముందుకు సాగండి. సాధారణ ఆరోగ్యం వారమంతా బాగానే ఉంటుంది. అయితే, చర్మ సంబంధిత సమస్యలు ఇబ్బందిపెట్టే అవకాశాలు ఉన్నాయి. లక్కీ కలర్: తెలుపు కర్కాటకం (జూన్ 21 - జూలై 22) జీవితం సాఫీగా సాగుతుంది. మీ కుటుంబంలోకి కొత్త శిశువు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆర్థికంగా కూడా అద్భుతంగా ఉంటుంది. ఇదివరకటి కోరికలు ఈ వారంలో నెరవేరే అవకాశాలు ఉన్నాయి. అయితే, ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. ముఖ్యంగా ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం. జీర్ణాశయ సమస్యలు బాధపెట్టే అవకాశాలు ఉన్నాయి. లక్కీ కలర్: లేత నారింజ సింహం (జూలై 23 - ఆగస్ట్ 22) మందకొడిగా సాగిన పనులు వేగం పుంజుకుంటాయి. ఈ వారంలో చాలాచాలా మార్పులు సంభవించే అవకాశాలు ఉన్నాయి. జీవితంలో సాహసభరితమైన కొత్త ప్రయాణం మొదలుపెట్టే అవకాశాలు ఉన్నాయి. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. జీర్ణాశయ సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. లక్కీ కలర్: బ్రౌన్ కన్య (ఆగస్ట్ 23 - సెప్టెంబర్ 22) జీవితం సుఖదుఃఖాల సమ్మేళనంలా సాగుతుంది. చెడు వెంటనే మంచి అనుభవంలోకి వస్తుంది. ముఖ్యమైన వాటిపైనే దృష్టి పెట్టండి. మీరు ఈ వారంలో కొత్త పని చేపట్టాలనే నిర్ణయం తీసుకుంటారు. ధైర్యంగా ముందుకు సాగండి. మీ ఇల్లు లేదా ఆఫీసులో పునర్నిర్మాణ కార్యక్రమాలు జరగవచ్చు. చాలాకాలంగా కొనసాగుతున్న అనుబంధానికి ఈ వారంలో ఫుల్స్టాప్ పడవచ్చు. లక్కీ కలర్: పసుపు తుల (సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22) మంచికాలం మొదలవుతోంది. శక్తివంచన లేకుండా పనిచేసి మంచి ఫలితాలను సాధించగలరు. కొత్త వాహనం కొనే అవకాశాలు లేకుంటే ఎక్కడికైనా అందమైన ప్రాంతానికి విహార యాత్ర కోసం టికెట్లు కొనే అవకాశాలు ఉన్నాయి. సానుకూలమైన మనుషుల మధ్యనే కాలం గడపండి. ఆశావహ దృక్పథంతో ముందుకు సాగండి. ఈ వారంలో మీ జీవితం ఏడురంగుల హరివిల్లులా ఉంటుంది. లక్కీ కలర్: నారింజ వృశ్చికం (అక్టోబర్ 23 - నవంబర్ 21) ఈ వారంలో మీ ఇంటి నిర్మాణం పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆశనిరాశల మధ్య ఊగిసలాడుతున్న మీకు ఈ వారంలో జీవితానికి వెలుగునిచ్చే ఆశాదీపం కనిపిస్తుంది. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, కెరీర్‌పరంగా అన్నీ సంతృప్తికరంగా ఉంటాయి. ప్రేమించే వారితో సంబంధాలు దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. ఆ పరిస్థితిని చక్కదిద్దుకునే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. లక్కీ కలర్: నీలం ధనుస్సు (నవంబర్ 22 - డిసెంబర్ 21) మీ కలలను సాకారం చేసుకునే దిశగా ముందుకు సాగుతారు. దెబ్బతిన్న సంబంధాలను పునరుద్ధరించుకునే ప్రయత్నాలు విజయవంతమవుతాయి. కొత్త ఆశలు చిగురిస్తాయి. బంధు మిత్రుల నుంచి కానుకలు అందుకునే అవకాశాలు ఉన్నాయి. మీ సామాజిక జీవితం మరింత సందడిగా, ఆనందభరితంగా సాగుతుంది. ఈ వారంలో మీ కీర్తిప్రతిష్టలు ఇనుమడిస్తాయి. లక్కీ కలర్: గులాబి మకరం (డిసెంబర్ 22 - జనవరి 19) వ్యవసాయదారులకు, ముఖ్యంగా ఆహారపంటలు పండించేవారికి ఇది అద్భుతమైన వారం. వ్యాపార భాగస్వామి ఒకరి నుంచి అద్భుతమైన సలహాలు, ఆర్థిక సాయం అందుతాయి. మరింత అధికారం దక్కే అవకాశాలు ఉన్నాయి. అంతరాత్మ ప్రబోధం మేరకు వివేకంతో ముందుకు సాగుతారు. ప్రేమికులు ఆనందంగా గడుపుతారు. అనూహ్యమైన కానుకలను అందుకుంటారు. లక్కీ కలర్: ఆకుపచ్చ కుంభం (జనవరి 20 - ఫిబ్రవరి 18) వారం అంతా చాలా రిస్కీగా ఉంటుంది. మీరు చేస్తున్న పనికి సమాంతరంగా మరో పని కూడా చేపట్టి ముందుకు సాగాల్సి ఉంటుంది. నిద్రలేని రాత్రులు గడిపే అవకాశాలు ఉన్నాయి. ఈ పరిస్థితులు మీ ప్రేమానుబంధాలపై కూడా ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. నైరుతి దిశ ప్రయాణాలు అనుకూలిస్తాయి. లక్కీ కలర్: లేత పసుపు మీనం (ఫిబ్రవరి 19 - మార్చి 20) వేడుకలు, సంబరాలతో ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు. కుటుంబంలో జరిగే పెళ్లి వేడుకలో బిజీగా ఉంటారు. ప్రేమికులు కోరుకున్న వారి ప్రేమను దక్కించుకుంటారు. పెళ్లికి సిద్ధంగా ఉన్నవారు తగిన జీవిత భాగస్వామిని పొందగలరు. కొలీగ్స్ నుంచి చక్కని సహాయ సహకారాలు అందుతాయి. వారి సాయంతో ఆశించిన లక్ష్యాలను సునాయాసంగా సాధిస్తారు. లక్కీ కలర్: లేత నీలం - ఇన్సియా నజీర్, టారో అనలిస్ట్ -
టారో : 15 మే నుంచి 21మే, 2016 వరకు
మేషం (మార్చి 21 - ఏప్రిల్ 19) కొత్త అవకాశాలను అందుకుంటారు. విజయాలను సాధిస్తారు. మీ కోరికలన్నీ నెరవేరే సమయం మొదలైంది. అన్ని విధాలా ఆనందంగా గడుపుతారు. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. మీ ప్రయత్నాలన్నీ అనూహ్యమైన సత్ఫలితాలను ఇస్తాయి. మీరు అనుకున్నవన్నీ నెరవేరుతాయి. సంయమనాన్ని కోల్పోకుండా ఉండండి. లక్కీ కలర్స్: గులాబి, పీచ్, లక్కీ నంబర్: 7 వృషభం (ఏప్రిల్ 20 - మే 20) గత నెలలో ఎదురైన ఇబ్బందుల నుంచి తేరుకుంటారు. పరిస్థితులు మెరుగుపడతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. కొత్త ప్రాజెక్టుల గురించి ఆలోచిస్తారు. తలపెట్టిన పనుల్లో సత్ఫలితాలను సాధిస్తారు. వృత్తి జీవితాన్ని, వ్యక్తిగత జీవితాన్ని వేర్వేరుగా చూసుకుంటే మెరుగైన ఫలితాలను సాధించగలుగుతారు. ఫిట్‌నెస్‌పై, డైటింగ్‌పై దృష్టిపెట్టడం మంచిది. లక్కీ కలర్: ఆక్వామెరైన్ బ్లూ, లక్కీ నంబర్: 4 మిథునం (మే 21 - జూన్ 20) సామాజిక హోదా, పరపతి వల్ల మీ చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నా, మీరు ఆధ్యాత్మికంగా పురోగతి సాధిస్తారు. ఈ వారంలో మీ పని ప్రాధాన్యాలను మార్చుకుంటారు. అందరినీ ఆకట్టుకునే ఉద్దేశంతో వ్యాపారాల్లో కొత్త వ్యూహాలను అనుసరిస్తారు. ఈ వారంలో ఎక్కువగా ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. లక్కీ కలర్స్: గులాబి, ఎరుపు, లక్కీ నంబర్: 7 కర్కాటకం (జూన్ 21 - జూలై 22) ఆకాశంలో ఎగిరే మీ ఊహలకు బ్రేకులు వేయాల్సిన సమయం ఇది. ఆలోచన, ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన సమయం ఇది. విజయాలు వరించే అవకాశాలు ఉన్నాయి. అయితే, జాగ్రత్తతో కూడిన ప్రణాళికతోనే అవి సాధ్యమవుతాయి. ఆస్తులకు సంబంధించిన వ్యవహారాల్లో ఆచి తూచి అడుగేయాలి. ఇతరుల సలహాలను నమ్ముకోవద్దు. ఉద్యోగంలో లేదా పనిప్రదేశంలో మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి. లక్కీ కలర్: పసుపు, లక్కీ నంబర్: 1 సింహం (జూలై 23 - ఆగస్ట్ 22) సృజనాత్మక శక్తితో మీరు సాధించే ఫలితాలు అసాధారణంగా ఉంటాయి. అదృష్టం మీ వైపే ఉంటుంది. పరిస్థితులపై అదుపు సాధిస్తారు. మీ సన్నిహితులు మీతో చెప్పాలనుకున్న మాటలను శ్రద్ధగా ఆలకించండి. వారిని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించండి. అపార్థాలను లౌక్యంగా చక్కదిద్దుకోవాల్సి ఉంటుంది. కొత్త వాహనం సమకూరే అవకాశాలు ఉన్నాయి. లక్కీ కలర్: నలుపు, లక్కీ నంబర్: 8 కన్య (ఆగస్ట్ 23 - సెప్టెంబర్ 22) ఈ వారంలో మీకు అంతా ప్రేమమయం అన్నట్లుగా ఉంటుంది. పనిచేసే ధోరణిలోనూ మీరు అదే ఉత్సాహాన్ని ప్రదర్శిస్తే మంచిది. మీ కష్టానికి ఫలితాలు దక్కడంలో కాస్త జాప్యం జరిగినా నిరాశ చెందనవసరం లేదు. మీకు దక్కాల్సిన ఫలితాలు త్వరలోనే అందుతాయి. చిన్న చిన్న సమస్యలున్నా చక్కబడతాయి. లక్కీ కలర్: లేత ఊదా, లక్కీ నంబర్: 9 తుల (సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22) జ్ఞానాన్ని పెంపొందించుకోవడంపై దృష్టి సారిస్తారు. పాత జ్ఞాపకాలను మరచి ముందుకు సాగడం మంచిది. ఈ నెలంతా మీకు లాభదాయకంగా ఉంటుంది. మీ పురోగతిపై సింహావలోకనం చేసుకుంటారు. ఒక అడుగు వెనక్కి వేసి, పునరాలోచన చేస్తారు. కొత్త వ్యూహంతో ముందంజ వేస్తారు. ఈ వారంలో ప్రయాణావకాశాలు ఉంటాయి. చిన్న చిన్న సమస్యలు ఉన్నా అవి సమసిపోతాయి. లక్కీ కలర్: ఖాకీ, లక్కీ నంబర్: 7 వృశ్చికం (అక్టోబర్ 23 - నవంబర్ 21) ఆకర్షణీయమైన మీ మాటలతో ఇతరులను ఇట్టే ఆకట్టుకుంటారు. ఈ వారం మరింత రొమాంటిక్‌గా ఉంటుంది. పనిలో కూడా ఉత్సాహంగా ముందుకు సాగుతారు. మీరు పొగొట్టుకున్నవి ఈ వారంలో తిరిగి మీ వద్దకు చేరుతాయి. మార్పు గురించి ఆలోచించాల్సిన తరుణం ఆసన్నమైంది. అనవసర భయాలను విడిచిపెట్టండి. అవి మీ పురోగతికి అవరోధంగా నిలుస్తాయి. లక్కీ కలర్: ఆరెంజ్, లక్కీ నంబర్: 5 ధనుస్సు (నవంబర్ 22 - డిసెంబర్ 21) ఈ వారంలో చాలా మార్పులను చూస్తారు. కొత్త ఇంట్లోకి లేదా ఆఫీసులోకి మారే అవకాశాలు ఉన్నాయి. మీరు చేరే కొత్త ప్రదేశంలో చుట్టూ పచ్చదనం ఉంటుంది. అవివాహితులకు తగిన జీవిత భాగస్వామి దొరికే అవకాశాలు ఉన్నాయి. పనిలో ఉత్సాహాన్ని చూపుతారు. పట్టిందల్లా బంగారంలా ఉంటుంది. లక్కీ కలర్: గులాబి, లక్కీ నంబర్: 2 మకరం (డిసెంబర్ 22 - జనవరి 19) ఈ వారమంతా మీకు లాభదాయకంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో పురోగతి సాధిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. మాటలతో ఎలాంటి వారినైనా ఇట్టే ఆకట్టుకుంటారు. ఆరోగ్యం, ఆనందం, సంపద... వీటన్నింటి మధ్య సమతుల్యతను పాటించాల్సిన అవసరం ఉందని గ్రహించండి. లక్కీ కలర్: పసుపు, లక్కీ నంబర్: 1 కుంభం (జనవరి 20 - ఫిబ్రవరి 18) అంతా అనిశ్చితిగా, గందరగోళంగా ఉంటారు. గందరగోళంలో ఉన్న మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. మార్పు అనివార్యమని గ్రహించండి. విద్యార్థులు అద్భుతమైన ఫలితాలను సాధిస్తారు. ప్రతి నిమిషం మరింత మెరుగ్గా ఉండటాన్ని నేర్చుకోవాల్సి ఉంటుంది. మనసుకు నచ్చిన వ్యక్తితో ఆహ్లాదంగా గడిపే అవకాశాలు ఉన్నాయి. లక్కీ కలర్: తెలుపు, లక్కీ నంబర్: 6 మీనం (ఫిబ్రవరి 19 - మార్చి 20) ఈ వారంలో విపరీతంగా డబ్బు ఖర్చయ్యే అవకాశాలు ఉన్నాయి. మిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. మీ పనిలో మార్పులకు శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఏర్పడుతుంది. మీ సృజనాత్మకతను, నైపుణ్యాలను గరిష్ట స్థాయిలో ఉపయోగించాల్సి ఉంటుంది. వారం ప్రారంభం నిరాశాజనకంగా అనిపించినా, బుధవారం తర్వాత ఉత్సాహం పుంజుకుంటారు. తల్లిదండ్రులకు కాస్త సమయాన్ని కేటాయించాల్సి ఉంటుంది. లక్కీ కలర్: ఇటుక రంగు, లక్కీ నంబర్: 8 - ఇన్సియా నజీర్, టారో అనలిస్ట్ -
టారో : 1 మే నుంచి 7మే, 2016 వరకు
మేషం (మార్చి 21 - ఏప్రిల్ 19) ఉన్నత విద్యావకాశాలు వస్తాయి. చెప్పలేనన్ని పనులతో బిజీబిజీగా ఉంటారు. విషయాలను జాగ్రత్తగా గమనించండి. తర్వాతే నిర్ణయాలను తీసుకోండి. శుభవార్తలు వింటారు. పెళ్లి ప్రపోజల్స్ వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులు మరొకరితో కలిసి కొత్త ప్రాజెక్ట్ చేపడతారు. కంప్యూటర్ రంగంలో ఉన్నవారికి విజయాలు, లాభాలు వస్తాయి. కలసివచ్చే రంగు: ఆకుపచ్చ వృషభం (ఏప్రిల్ 20 - మే 20) కెరీర్ ఊపందుకుంటుంది. అవకాశాలు మిమ్మల్ని చుట్టుముడతాయి. ఆరోగ్యం బాగుంటుంది. సంపద పెరుగుతుంది. సంతోషంగా గడుపుతారు. విజయాలు దరికి చేరుతాయి. ప్రేమ వ్యవహారాలు సంతోషాన్ని పంచుతాయి. బంధువులను కలుస్తారు. దగ్గర్లో ఉన్న ఓ ప్రాంతాన్ని సందర్శిస్తారు. కలసివచ్చే రంగు: పసుపు, ఆకుపచ్చ మిథునం (మే 21 - జూన్ 20) కలలు నిజమవుతాయి. ఎప్పట్నుంచో చూడాలనుకుంటున్న ప్రదేశానికి విహార యాత్రకు వెళ్తారు. ఓ ప్రత్యేక వ్యక్తిని కలుసు కుంటారు. పనితో తీరిక లేకుండా గడుపుతారు. ఊహించని గొప్ప అవకాశం వెతుక్కుంటూ వస్తుంది. దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి తగిన ప్రణాళికతో ముందుకు సాగడం అవసరం. అప్పుడే మీరు సక్సెస్ అవుతారు. ఆధ్మాత్మికంగా గడుపుతారు. గత కాలపు చేదును మర్చిపోవడానికి ప్రయత్నించండి. కలసివచ్చే రంగు: పర్పుల్ కర్కాటకం (జూన్ 21 - జూలై 22) డబ్బు, ఇతరత్రా సదుపాయాలు కోరుకున్న వెంటనే దొరకవు. కలలు నిజమవ్వాలంటే వాటిని నెరవేర్చుకునే విధానం పక్కాగా ఉండాలన్న విషయం గ్రహించండి. చిన్న చిన్న అవకాశాలను కూడా వదిలిపెట్టకండి. ఇది మీ ఆలోచనలకు పదును పెట్టాల్సిన సమయం. మీ కుటుంబం మీకు అన్ని విషయాల్లో అండగా ఉంటుంది. ప్రేమికుల మధ్య మనస్పర్థలు వ చ్చే అవకాశం ఉంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. కలసివచ్చే రంగు: తెలుపు, బేబీ పింక్ సింహం (జూలై 23 - ఆగస్ట్ 22) ఈ వారం కాస్త విసుగ్గా గడుస్తుంది. ఆరోగ్యం కూడా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. పలు విషయాల్లో ఊహించని మార్పులు ఎదురవుతాయి. స్నేహితుల మధ్య మనస్పర్థలు వచ్చే అవకాశం ఉంది. పనులు నెమ్మదిగా సాగుతాయి. ఇంట్లోను, పని చేసేచోట క్రిస్టల్స్‌ని ఉంచుకుంటే శుభం జరుగుతుంది. దుష్టశక్తులు తొలగిపోతాయి. కలసివచ్చే రంగు: ముదురు రంగులన్నీ కన్య (ఆగస్ట్ 23 - సెప్టెంబర్ 22) మీ శక్తియుక్తుల్ని వినియోగించే విధానాన్ని నేర్చుకోండి. ఇగోని పక్కన పెట్టండి. ఈ వారం మీ జీవితం ‘ఎస్’ అన్న అక్షరంతో మొదలయ్యే పేరు గల వ్యక్తి ద్వారా శుభవార్త అందుతుంది. ఆహారం, వ్యాయామం విషయంలో శ్రద్ధ పెట్టండి. ఆగ్నేయం మూలన ఎర్రటి క్యాండిల్స్‌ను ఉంచుకుంటే కలసి వస్తుంది. కలసివచ్చే రంగు: పసుపు తుల (సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22) సంతోషాన్ని పొందడానికి, అనుకున్నది సాధించడానికి కొన్ని కట్టుబాట్లను ఛేదించాల్సి వస్తుంది. ప్రేమలో పరాజయం మిమ్మల్ని కాస్త బాధిస్తుంది. అయితే ఓ కొత్త ప్రారంభం వైపుగా అది మిమ్మల్ని నడిపిస్తుంది. ఓ మంచి, నమ్మదగిన వ్యక్తి మీ జీవితంలోకి వస్తారు. వారితో మీకు బలమైన బంధం ఏర్పడుతుంది. నవ్వు దేనినైనా సాధించే శక్తినిస్తుంది. దాన్ని వదలకండి. ఆరోగ్యపరంగా చూసుకుంటే కొద్దిగా కీళ్లనొప్పులు వచ్చే అవకాశం ఉంది. కలసివచ్చే రంగు: కాషాయరంగు వృశ్చికం (అక్టోబర్ 23 - నవంబర్ 21) అన్ని అవరోధాలనూ అధిగమిస్తారు. అయినవాళ్లతో కాస్త ఎక్కువసేపు గడపడానికి ప్రయత్నించండి. లేదంటే కొన్ని బంధాలు బల హీనపడే అవకాశం ఉంది. ఆర్థిక సంబంధిత విషయాల్లో మీ పద్ధతి మీకు అత్యంత సన్ని హితమైన ఒక వ్యక్తిని మీకు దూరం చే సే అవ కాశం ఉంది. ఉద్యోగులు లక్ష్యాలు అందు కుంటారు. అదనపు ఆదాయం పొందుతారు. ఇతరుల ప్రభావం మీపై లేకుండా చూసుకోండి. కలసివచ్చే రంగు: వయొలెట్ ధనుస్సు (నవంబర్ 22 - డిసెంబర్ 21) పూర్వీకుల నుంచి ఆస్తి సంక్రమించే అవకాశం ఉంది. మీరు పనిచేసే చోట ఓ యంగ్ అండ్ డైనమిక్ వ్యక్తి ద్వారా మీకో మంచి వార్త తెలుస్తుంది. అది మిమ్మల్ని విజయం వైపుగా నడిపిస్తుంది. ఆదాయం రెట్టింపవుతుంది. వ్యక్తిగత జీవితంలో కొంత అశాంతి ఏర్పడు తుంది. ఆర్థిక విషయాల్లో ఎవరైనా నిపుణుల సలహా తీసుకోవడం ఎంతైనా అవసరం. కలసివచ్చే రంగు: లేత నీలం మకరం (డిసెంబర్ 22 - జనవరి 19) వ్యాపారాన్ని విస్తరిస్తారు. లాభాలు పొందు తారు. అయితే దానికోసం చాలా కష్టాలు పడాల్సి వస్తుంది. కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. వాటిని చట్టపరంగా కాకుండా తెలివితేటలతో పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి. కాలం మీలో కొన్ని మార్పుల్ని తీసుకొస్తుంది. మీరో కొత్త వ్యక్తిలా మారతారు. కలసివచ్చే రంగు: బ్రౌన్ కుంభం (జనవరి 20 - ఫిబ్రవరి 18) కొన్ని విసుగులు, ఇబ్బందులు వస్తాయి. ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉండండి. ముఖ్యంగా ఆఫీసులో రాజకీయాలు మిమ్మల్ని కలత పెడ తాయి. కానీ కాస్త బ్యాలెన్స్డ్గా వ్యవహరిస్తే ఆ పరిణామాలు మిమ్మల్ని స్ట్రాంగ్‌గా తయారు చేస్తాయి. కాస్త తెలివిగా వ్యవహరిస్తే అన్నీ మీకు తగినట్టుగా మారిపోతాయి. ఏదైనా మంచి హాబీపై దృష్టి పెట్టండి. మిమ్మల్ని మీరు అర్థం చేసుకోడానికి సమయం వెచ్చించండి. ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. కలసివచ్చే రంగు: ముదురు పసుపు మీనం (ఫిబ్రవరి 19 - మార్చి 20) మానసిక ప్రశాంతత పొందుతారు. విధి నిర్వహణలో లక్ష్యాలు సాధించడానికి ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. గతంలోని విజయాల కారణంగా ఇప్పుడు మీకు ఇతరులతో పోటీ ఎక్కువవుతుంది. ఆర్థిక స్థితి బాగా మెరుగు పడుతుంది. అతిగా ఖర్చులు చేయకండి. ముఖ్యమైన వాటిపై ఖర్చు చేయడానికి కూడా ఇది తగిన సమయం కాదు. 4వ తేదీ తర్వాత మీకొక సర్ప్రైజ్ లభించే అవకాశం ఉంది. కలసివచ్చే రంగు: బంగారువర్ణం - ఇన్సియా నజీర్, టారో అనలిస్ట్ -
టారో : 24 ఏప్రిల్ నుంచి 30ఏప్రిల్, 2016 వరకు
మేషం (మార్చి 21 - ఏప్రిల్ 19) ఈ వారం చక్కగా విహారయాత్ర చేస్తారు. దాంతో చాలా ఉత్సాహం వస్తుంది. పలు రకాల సవాళ్లు ఎదురవుతాయి. వాటిని ఎదుర్కొన డానికి కాస్తంత ధైర్యం, శక్తి అవసరమవుతాయి. అయితే మీ ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ఎందులోనూ ఓడిపోనివ్వదు. వ్యక్తిగత జీవితంలో అభిప్రాయ భేదాల వల్ల కొన్ని సమస్యలు ఏర్పడవచ్చు. కలసివచ్చే రంగు: ఎమరాల్డ్ గ్రీన్ వృషభం (ఏప్రిల్ 20 - మే 20) ఈ వారం అన్నీ మీ ఊహలకు విరుద్ధంగానే జరుగుతాయి. అయితే అంతా మంచే జరుగుతుంది. మీ వ్యక్తిత్వం మిమ్మల్ని గెలిపిస్తుంది. ఇతరులకు స్ఫూర్తి కలిగిస్తుంది. ఊహించని విధంగా ఓ స్నేహితుడికి మీ సహాయం అవసరమవుతుంది. వృత్తి సంబంధిత విషయాల్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటుతో కాక ఆలోచించి నిర్ణయం తీసుకోండి. కలసివచ్చే రంగు: నీలం మిథునం (మే 21 - జూన్ 20) ఇది మీకు ఎప్పటికీ గుర్తుండిపోయే కాలం. విజయాలు మీ ఒడిలో వాలతాయి. అయితే అదంతా మీ శ్రమకు ఫలితమే అయ్యుంటుంది. మీలో అద్భుతమైన ఆకర్షణ ఉంది. అయితే దానికంటే కూడా నిబద్ధత, క్రమశిక్షణ మిమ్మల్ని గెలుపుబాట పట్టిస్తాయి. మీ దృష్టి ఎంతసేపూ పని మీదే ఉంటుంది. అది మిమ్మల్ని ఎందులోనూ వెనుకబడనివ్వదు. కలసివచ్చే రంగు: కాషాయం కర్కాటకం (జూన్ 21 - జూలై 22) పని చేసేచోట ఓ అద్భుతమైన అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. అది మిమ్మల్ని అందనంత ఎత్తుకు తీసుకెళ్తుంది. మనసు పెట్టి చేస్తే మీరు దేనినైనా సాధించగలరు అన్న విషయం నిరూపణ అవుతుంది. ఇంతవరకూ పడిన కష్టానికి తగిన ఫలితం దక్కుతుంది. ప్రేమ వ్యవహారాల్లో మునిగి తేలతారు. మీరు ప్రేమించేవ్యక్తితో ప్రపంచం మరిచి గడుపుతారు. కలసివచ్చే రంగు: సీ గ్రీన్ సింహం (జూలై 23 - ఆగస్ట్ 22) మీకు కనుక ఏదైనా లక్ష్యం ఉంటే... దాన్ని సాధించేందుకు ఇది అనువైన కాలం. కాబట్టి ఆ దిశగా అడుగులు వేయండి. విజయం తప్పక లభిస్తుంది. మీ ప్రతిభ వెలుగులోనికి వస్తుంది. అయితే ఏ విషయంలోనూ బద్ధకించకండి. ఆధ్యాత్మిక ఆలోచనలు సైతం చుట్టుముడ తాయి. ప్రేమ సఫలమవుతుంది. తద్వారా మీ జీవితంలోకి కొత్త ఆనందం వస్తుంది. కలసివచ్చే రంగు: పసుపు కన్య (ఆగస్ట్ 23 - సెప్టెంబర్ 22) ఎంతో కాలంగా మీ జీవితంలో నెలకొన్న ఉన్న కొన్ని కన్ఫ్యూజన్లు తొలగుతాయి. సమస్య లన్నిటికీ పరిష్కారాలు కనిపిస్తాయి. అసాధ్యం అనుకున్న పనులు సాధ్యమయ్యే మార్గాలు తెరచుకుంటాయి. కాస్త కష్టపెట్టినప్పటికీ విలువలు, నియమాలు, షరతులు అనేవి ఎప్పుడూ మంచి ఫలితాలనే ఇస్తాయన్న నిజం తెలుసుకుంటారు. ఓ వ్యక్తితో మీకు ఏర్పడిన బంధం మరింత బలపడుతుంది. కలసివచ్చే రంగు: నిమ్మ పసుపు తుల (సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22) పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతున్నారా? మీకు తగిన వ్యక్తిని ఎంచుకోవడానికి, ఓ ఇంటివారు కావడానికి ఇది సరైన సమయం. ఉద్యోగులు విజయాలు సాధిస్తారు. మీలో ఎదుటివారిని ఆకర్షించే శక్తి, చుట్టూ ఉన్న పరిస్థితుల్ని మార్చివేసే శక్తి ఉన్నాయి. అవి మీకు ఎంతో ఉపయోగపడతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టండి. ఆహార నియమాలు పాటించండి. కలసివచ్చే రంగు: తెలుపు వృశ్చికం (అక్టోబర్ 23 - నవంబర్ 21) ఆరోగ్య సమస్యలు తీరి ఊరట పొందుతారు. మీ పరిశీలన్నా శక్తి ఓ వ్యక్తిని సమస్యల నుంచి బయటపడేసేలా చేస్తుంది. కొత్తగా చేపట్టే ప్రాజెక్టులు, కొత్తగా మీ జీవితంలోకి వచ్చే వ్యక్తులు మీ జీవితంలో పెద్ద పాత్రను పోషిస్తారు. ఉద్యోగం, బాంధవ్యం ఏదైనా మీకు సంతోషాన్నే కలిగిస్తుంది. మీలో ఉన్న భయాలను, శంకలను పక్కన పెట్టేయండి. ఏం చేసినా ధైర్యంగా చేయండి. కలసివచ్చే రంగు: ముదురు ఎరుపు ధనుస్సు (నవంబర్ 22 - డిసెంబర్ 21) మీ మనసు ఒకదాని మీద నుంచి ఒకదాని మీదకు మళ్లుతుంది. అది ఒకే సమయంలో ఎక్కువ పనులు చేపట్టినా తప్పులు లేకుండా చేయగలిగే మీ ప్రతిభను వెలుగులోకి తెస్తుంది. విధి నిర్వహణలో ఒక్క సారిగా ఉన్నత స్థాయికి చేరుకుంటారు. వ్యక్తిత్వాల్లోని భేదాల కారణంగా మీరు ప్రేమించే వ్యక్తి మీకు తగినవారు కాదని తెలుస్తుంది. కలసివచ్చే రంగు: క్రీమ్ మకరం (డిసెంబర్ 22 - జనవరి 19) రిలాక్సేషన్ కోరుకుంటారు. మీకు ఇష్టమైన వ్యక్తులతో ఏకాంతంగా గడపాలని కోరుకుం టారు. పని విషయానికి వస్తే కొత్త కొత్త ప్రపోజల్స్ వెతుక్కుంటూ వస్తాయి. సహోద్యో గులతో ఎక్కువ సమయం గడపాల్సిన అవసరం ఏర్పడుతుంది. అయినా మీరు వాటి నుంచి బయటపడి ప్రశాంతంగా గడిపేందుకు ప్రయత్నిస్తారు. ఎంతోమందిని కలిసి కష్టసుఖాలు పంచుకుంటారు. కలసివచ్చే రంగు: కాషాయం కుంభం (జనవరి 20 - ఫిబ్రవరి 18) మీ వరకూ జీవితం అనేది ఓ అందమైన ప్రయాణం. దానివల్ల ఒక్కోసారి లైఫ్‌లో డ్రామా ఎక్కువైనట్టు అనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో విపరీతమైన భావోద్వేగాలకు లోనవుతారు. అయితే నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం అలా ఉండకండి. ఎవరినీ నమ్మకండి. ప్రకృతి, పుస్తకాల వంటి పట్ల ఉన్నట్టుండి ఆసక్తి పెరుగు తుంది. కాస్త రొమాంటిక్‌గా కూడా గడుపుతారు. కలసివచ్చే రంగు: వయొలెట్ మీనం (ఫిబ్రవరి 19 - మార్చి 20) ఎంతోకాలంగా తీరకుండా ఉన్న ఓ కోరిక ఇప్పుడు తీరిపోతుంది. ప్రేమ విషయంలో మీ ఆలోచనలు కాస్త అస్తవ్యస్తంగా అయ్యే అవకాశం ఉంది. మీరు ప్రేమించే వ్యక్తి పట్ల మీకున్న గాఢమైన నమ్మకాలు, ఫీలింగ్స్ కొన్ని ఇబ్బం దులు రేకెత్తించవచ్చు. ఉద్యోగులు విధి నిర్వహణలో ఎదురయ్యే ఆటంకాలను తేలిగ్గా అధిగమిస్తారు. మీకంటే చిన్నవాళ్లల్లో స్ఫూర్తిని రగిలించే ప్రయత్నంలో సఫలీకృతులవుతారు. కలసివచ్చే రంగు: లేత నీలం ఇన్సియా నజీర్, టారో అనలిస్ట్ -
టారో : 17 ఏప్రిల్ నుంచి 23ఏప్రిల్, 2016 వరకు
మేషం (మార్చి 21 - ఏప్రిల్ 19) ఈవారం మీకు అన్ని విధాలా కలిసి వస్తుంది. ఎంతో సంతోషంగా ఉంటారు. సరదాగా గడుపుతారు. కుటుంబ సంబంధాల విషయంలో, అనుబంధాల విషయంలో మీకు మరింత ఆనందం లభిస్తుంది. ఇంటా బయటా అందరూ మిమ్మల్ని ఎంతగానో గౌరవిస్తారు. మీరు కోరుకున్నవన్నీ మీకు దక్కుతాయి. కలసివచ్చే రంగు: వెండి రంగు వృషభం (ఏప్రిల్ 20 - మే 20) నిర్ణయాలు తీసుకోవడంలో ఒక రకమైన కన్ఫ్యూజన్కు లోనవుతారు. దానివల్ల టెన్షన్లు చాలా ఎక్కువవుతాయి. పనిచేసే చోట మీకు అద్భుతమైన అవకాశాలు వస్తాయి. టీమ్ వర్కతో మంచి విజయాలు సాధిస్తారు. ఈవారం కాస్త రొమాంటిక్‌గా గడుపుతారు. క్యాండిల్ లైట్ డిన్నర్లు చేస్తారు. కలసివచ్చే రంగు: పీచ్ మిథునం (మే 21 - జూన్ 20) ఊహించని ప్రయాణాలు చేస్తారు. వ్యాపారాలు చేయాలనుకునే మహిళలకు ఇది తగిన సమయం. మీ ఉత్సాహమే మిమ్మల్ని లక్ష్యాలను అందుకునేలా చేస్తుంది. కొత్త అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. అనుకోకుండా మీ జీవితంలోకి వచ్చిన ఓ వ్యక్తితో అకస్మాత్తుగా ప్రేమలో పడతారు. అది మిమ్మల్ని పెళ్లి వరకూ నడిపిస్తుంది. కలసివచ్చే రంగు: లేత వంకాయరంగు కర్కాటకం (జూన్ 21 - జూలై 22) ఈవారం మీరు చెప్పలేనంత సంతోషంగా ఉంటారు. మీ కృషి మీకోసం సంతోష ద్వారాలను తెరుస్తుంది. ఉద్యోగంలో మరింత బాగా నిలదొక్కుకుంటారు. త్వరలో మీరు ఇల్లు మారే అవకాశం ఉంది. భద్రతాపరమైన విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాలు చేస్తారు. ముత్యాలు ధరిస్తే మంచి జరుగుతుంది. కలసివచ్చే రంగు: హాఫ్ వైట్ సింహం (జూలై 23 - ఆగస్ట్ 22) ఈ వారం మహిళలకు బాగా కలసి వస్తుంది. ఆత్మవిశ్వాసం, తెగువ ఉన్నత స్థాయికి తీసుకెళ్తాయి. అవరోధాలను అధిగమిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో నిర్లిప్తత ఏర్పడుతుంది. బంధాలు మరింత బలపర్చుకోవడంపై కాస్త దృష్టి పెట్టండి. 20వ నంబర్ మీకు అదృష్టాన్ని, సంపదను తెచ్చిపెడుతుంది. కలసివచ్చే రంగు: ఆలివ్ గ్రీన్ కన్య (ఆగస్ట్ 23 - సెప్టెంబర్ 22) వ్యాపారాల్లో భాగస్వాముల మధ్య, వ్యక్తిగత జీవితంలో భార్యాభర్తల మధ్య ఉన్న అనుబంధం మరింత బలపడుతుంది. లక్ష్యాలను అందుకోవడానికి మీరు పడే కష్టం సఫలమవుతుంది. మరో కొత్త ప్రాజెక్టును చేపట్టే అవకాశం కూడా ఉంది. ఆఫీసును మరో ప్రదేశానికి మారిస్తే మరింత కలసి రావొచ్చు. కలసివచ్చే రంగు: గులాబి తుల (సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22) ఈవారం లక్ష్మీదేవి తన దీవెనలు మీమీద కుమ్మరిస్తుంది. సరదాగా షాపింగ్ చేస్తారు. కొత్త వాహనం కొంటారు. కొత్త ఇంటికోసం ప్లాన్ చేసే అవకాశం కూడా ఉంది. మరిన్ని విజయాల కోసం మరింత కష్టపడండి. మిమ్మల్ని ప్రేమించేవారి కోసం కూడా తగినంత సమయం కేటాయించండి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. యోగా చేయండి. కలసివచ్చే రంగు: పసుపు వృశ్చికం (అక్టోబర్ 23 - నవంబర్ 21) మీ స్థిరత్వం, నిజాయతీ మిమ్మల్ని కోరుకున్న తీరాలవైపు నడిపిస్తాయి. ఎంతో సంతోషాన్ని తెచ్చిపెడతాయి. అయితే నిర్ణయాలు తీసుకోవడంలోను, పని చేయడంలోను జాప్యం చేయవద్దు. ప్రతి క్షణాన్నీ సందర్భాన్నీ ఆస్వాదించడం అలవర్చుకోండి. 21వ నంబర్ మీకు అదృష్టాన్ని తెచ్చి పెడుతుంది. కలసివచ్చే రంగు: వంకాయరంగు ధనుస్సు (నవంబర్ 22 - డిసెంబర్ 21) సంపద చేకూరుతుంది. భద్రత ఏర్పడుతుంది. సంతోషం సమకూరుతుంది. ఎప్పటి నుంచో పూర్తి కాకుండా ఉన్న ఒక ప్రాజెక్ట్ పూర్తయిపోతుంది. ఉద్యోగులకు ప్రమోషన్లు వస్తాయి. జీతం పెరుగుతుంది. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. 1వ నంబరు అదృష్టాన్ని తెస్తుంది. కలసివచ్చే రంగు: బంగారువర్ణం మకరం (డిసెంబర్ 22 - జనవరి 19) ఖర్చుల్ని నియంత్రించుకోండి. ఆర్థికపరమైన అంశాల్లో ఓ ప్రణాళికతో సాగిపోండి. రేపటి గురించి చింతించకుండా ఇవాళ్టిని ఎంజాయ్ చేయడం అలవర్చుకోండి. కోపం చేటు తెచ్చే అవకాశం ఉంది కాబట్టి తగ్గించుకోండి. మీ మంచితనమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. 19 మీ లక్కీ నంబర్. కలసివచ్చే రంగు: బ్రౌన్ కుంభం (జనవరి 20 - ఫిబ్రవరి 18) ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ పెట్టడం అవసరం. కుటుంబ సభ్యులతో వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది. ఓ వ్యక్తి కారణంగా అనవసర ఇబ్బందులకు గురవుతారు. మీరు కనుక ఎవరికైనా ఏదైనా రుణపడి ఉంటే వెంటనే తీర్చేయండి. లేదంటే అవమానాలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. ఏడు క్రిస్టల్స్ ఉన్న బ్రేస్లెట్ ధరిస్తే దోషాలు తొలగిపోతాయి. కలసివచ్చే రంగు: తెలుపు మీనం (ఫిబ్రవరి 19 - మార్చి 20) మీ ప్రేమ వ్యవహారాలు సఫలమవుతాయి. కొందరు విశేష వ్యక్తులను అనుకోకుండా కలుసుకుంటారు. వివాహితులు తమ జీవిత భాగస్వామి ప్రోత్సాహంతో దూసుకుపోతారు. కుటుంబంలో ఎవరైనా అనారోగ్యంతో ఉంటే కాస్త శ్రద్ధగా చూడండి. దోషాలు తొలగిపోవడానికి వెండిని ధరించండి. 4వ నంబర్‌కు ప్రాధాన్యతనివ్వండి. కలసివచ్చే రంగు: వెండి రంగు ఇన్సియా నజీర్, టారో అనలిస్ట్ -
టారో : 10 ఏప్రిల్ నుంచి 16ఏప్రిల్, 2016 వరకు
మేషం (మార్చి 21 - ఏప్రిల్ 19) ఈవారం మీరు మీకు దగ్గర అయిన వాళ్లందరితో సంతోషంగా, సరదాగా గడుపుతారు. భావోద్వేగాలకు లోనయ్యే పరిస్థితులు ఏర్పడుతాయి. ప్రేమ వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు వద్దు. పెట్టుబడులు పెట్టడానికి ఇది తగిన సమయం. నమ్మకంతో అడుగేస్తే మీరు ఏమైనా సాధించగలరన్న విషయాన్ని అర్థం చేసుకోండి. కలసివచ్చే రంగు: ఎమరాల్డ్ గ్రీన్ వృషభం (ఏప్రిల్ 20 - మే 20) ఈ వారమంతా ఆనందమే. ఎటువంటి అవరోధాలూ ఇబ్బందులూ మీవైపు తొంగి చూడవు. సంతోషం, సంపద అన్నీ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. కుటుంబంతో కలిసి విహారానికి వెళ్తారు. ఇంటి నిర్మాణంలో కొన్ని ముఖ్యమైన మార్పులు చేయిస్తారు. మీరు కష్టపడి చేసేకొద్దీ మంచి ఫలితాలు, లాభాలు మీకు కలుగుతాయి. కలసివచ్చే రంగు: ముదురు ఎరుపు మిథునం (మే 21 - జూన్ 20) ఈవారం మీకు అంతా శుభమే. మీ శక్తియుక్తులు, మీ చలాకీతనం మిమ్మల్ని లైమ్‌లైట్‌లోకి తీసుకొస్తాయి. మీ పనికి ప్రశంసలు లభిస్తాయి. మీ పైవాళ్లు మీ విషయంలో తృప్తి చెందుతారు. విజయంతో పాటే సంపద కూడా చేకూరుతుంది. మంచైనా చెడైనా మీరు చేసే ప్రతి పనికీ పూర్తి బాధ్యత మీరే తీసుకోండి. ఆశావహ దృక్పథాన్ని వీడకండి. కలసివచ్చే రంగు: నీలం కర్కాటకం (జూన్ 21 - జూలై 22) ఒక ముఖ్యమైన విషయంలో కలిగే ఇబ్బంది మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ముఖ్యంగా బాంధవ్యాల విషయంలో తలెత్తే ఇబ్బందులు చికాకు పెడతాయి. మీరెంతో ప్రేమించే వ్యక్తి మీకు దూరం కావడం మిమ్మల్ని మానసికంగా కుంగదీస్తుంది. ఆ బాధ మీ పని మీద, కెరీర్ మీద కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంది. పరిస్థితుల్ని చక్కబెట్టడం మీవల్ల కాకపోవచ్చు. కాలానికే వదిలేయండి. కలసివచ్చే రంగు: తెలుపు సింహం (జూలై 23 - ఆగస్ట్ 22) ఉద్యోగ విషయంలో మార్పులు సంభవించవచ్చు. పని చేసేచోట మిమ్మల్ని చూసి అసూయపడే వ్యక్తి ఎవరైనా ఉంటే... వారి విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. పెట్టుబడులు పెట్టవద్దు. మరింత పాజిటివ్ దృక్పథంతో పనిచేస్తే వ్యాపారాలు వృద్ధి చెందే అవకాశం ఉంది. వాతావరణ మార్పులు మీ ప్రయాణాలకు ఆటంకం కలిగించవచ్చు. కలసివచ్చే రంగు: కాషాయం కన్య (ఆగస్ట్ 23 - సెప్టెంబర్ 22) మీ జీవన విధానంలో కొత్త మార్పులు వస్తాయి. కొత్త ఆభరణాలు, సౌందర్య సాధనాలు కొనుగోలు చేస్తారు. మీలో మీరు కొత్త మార్పును తీసుకొచ్చి అందరినీ ఆశ్చర్యపరుస్తారు. కొన్ని ఆసక్తికర సందర్భాలు మీకు ఎదురవుతాయి. నిర్ణయాలు తీసుకునే క్రమంలో కన్ఫ్యూజన్కి గురైతే మీ మనసు చెప్పేది తు.చ.తప్పకుండా ఆచరించండి. కలసివచ్చే రంగు: పసుపు తుల (సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22) అందమైన భవిష్యత్తుకు తలుపులు తెరచుకోనున్నాయి. విజయాలు పొందుతారు. సంతోషంగా ఉంటారు. భయాలను అధిగమించి గెలుపు బాటలో సాగిపోతారు. మీ కలలు నిజం చేసుకోవడానికి మీరు నిజాయతీగా చేసే ప్రయత్నాలు మంచి ఫలితాలనిస్తాయి. మీలో కొత్త ఉత్సాహం నిండుతుంది. కుటుంబంతో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించండి. కలసివచ్చే రంగు: సిల్వర్ గ్రే వృశ్చికం (అక్టోబర్ 23 - నవంబర్ 21) ఈ వారమంతా రొమాంటిక్‌గా ఉంటుంది. కలల ప్రపంచంలో తేలియాడతారు. మీ అభిరుచులకు తగిన వ్యక్తిని కలుసుకుంటారు. ఇతరులు కొన్ని విషయాల కోసం మీ మీద ఆధారపడతారు. వారికి మీరు చేసే సాయం మిమ్మల్ని ప్రత్యేకంగా నిలబెడుతుంది. ఆఫీసులో పని ఒత్తిడి పెరగవచ్చు. ఇంటి ఆగ్నేయ మూలలో క్రిస్టల్స్ ఉంచుకుంటే అదృష్టం కలసి వస్తుంది. కలసివచ్చే రంగు: సిమెంటు రంగు, నీలం ధనుస్సు (నవంబర్ 22 - డిసెంబర్ 21) ఇంతవరకూ మీరు పెట్టుకున్న నియమాలు, మీ మనసులో బలంగా నాటుకుపోయిన నమ్మకాల్లో మార్పులు చేసుకోవాల్సిన పరిస్థితి రావచ్చు. కొత్త విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తి పెరుగుతుంది. ఆ జిజ్ఞాస మీకు చాలా ఉపయోగపడుతుంది. బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తారు. మీ మనసుకు నచ్చే వ్యక్తి అతి త్వరలో మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు. కలసివచ్చే రంగు: లేత వంకాయరంగు మకరం (డిసెంబర్ 22 - జనవరి 19) కొన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సి రావచ్చు, సిద్ధంగా ఉండండి. మిమ్మల్ని వ్యతిరేకించేవాళ్లు మీ దారికి అడ్డుపడాలని ప్రయత్నించవచ్చు. కానీ గెలుపు మీదే అవుతుంది. మీ కష్టంతో పాటు, మీ కుటుంబ సహాయ సహకారాలు, ప్రోత్సాహం మిమ్మల్ని విజయాలకు చేరువ చేస్తాయి. కొన్ని ఊహించని అద్భుతాలు కూడా సృష్టిస్తారు. కలసివచ్చే రంగు: బంగారువర్ణం కుంభం (జనవరి 20 - ఫిబ్రవరి 18) ఆర్థిక పరమైన ఇబ్బందులు తలెత్తుతాయి. అప్రమత్తంగా, తెలివిగా వ్యవహరించండి. ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. మీరేమిటో అలానే ఉండండి. ఎవరి కోసమూ మారకండి. ఆధ్యాత్మిక అంశాలు మీకు మనశ్శాంతిని, ధైర్యాన్ని ఇస్తాయి. ఓ చిన్న ఫౌంటెయిన్ లాంటిదేమైనా ఇంట్లో ఏర్పాటు చేస్తే కెరీర్ బాగుంటుంది. సంపద పెరుగుతుంది. కలసివచ్చే రంగు: ఇటుక ఎరుపు మీనం (ఫిబ్రవరి 19 - మార్చి 20) నిజాయతీ, హుందాతనం, మంచితనం అనే మూడు లక్షణాల మీద మీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. మీ నుంచి ఇతరులు స్ఫూర్తి పొందుతారు. కాబట్టి మీరెప్పుడూ మీ మాటలు, చేతలు ఆదర్శవంతంగా ఉండేలా మలచుకోండి. ఎదుటివాళ్లు చెప్పేది శ్రద్ధగా వినండి. కొన్ని ముఖ్యమైన సమాచారాలు మీకు తెలుస్తాయి. మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం మీకు అందుతుంది. కలసివచ్చే రంగు: వెండి రంగు - ఇన్సియా నజీర్, టారో అనలిస్ట్