టారో : 15 మే నుంచి 21మే, 2016 వరకు
మేషం (మార్చి 21 - ఏప్రిల్ 19)
కొత్త అవకాశాలను అందుకుంటారు. విజయాలను సాధిస్తారు. మీ కోరికలన్నీ నెరవేరే సమయం మొదలైంది. అన్ని విధాలా ఆనందంగా గడుపుతారు. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. మీ ప్రయత్నాలన్నీ అనూహ్యమైన సత్ఫలితాలను ఇస్తాయి. మీరు అనుకున్నవన్నీ నెరవేరుతాయి. సంయమనాన్ని కోల్పోకుండా ఉండండి.
లక్కీ కలర్స్: గులాబి, పీచ్, లక్కీ నంబర్: 7
వృషభం (ఏప్రిల్ 20 - మే 20)
గత నెలలో ఎదురైన ఇబ్బందుల నుంచి తేరుకుంటారు. పరిస్థితులు మెరుగుపడతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. కొత్త ప్రాజెక్టుల గురించి ఆలోచిస్తారు. తలపెట్టిన పనుల్లో సత్ఫలితాలను సాధిస్తారు. వృత్తి జీవితాన్ని, వ్యక్తిగత జీవితాన్ని వేర్వేరుగా చూసుకుంటే మెరుగైన ఫలితాలను సాధించగలుగుతారు. ఫిట్‌నెస్‌పై, డైటింగ్‌పై దృష్టిపెట్టడం మంచిది.
లక్కీ కలర్: ఆక్వామెరైన్ బ్లూ, లక్కీ నంబర్: 4
మిథునం (మే 21 - జూన్ 20)
సామాజిక హోదా, పరపతి వల్ల మీ చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నా, మీరు ఆధ్యాత్మికంగా పురోగతి సాధిస్తారు. ఈ వారంలో మీ పని ప్రాధాన్యాలను మార్చుకుంటారు. అందరినీ ఆకట్టుకునే ఉద్దేశంతో వ్యాపారాల్లో కొత్త వ్యూహాలను అనుసరిస్తారు. ఈ వారంలో ఎక్కువగా ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి.
లక్కీ కలర్స్: గులాబి, ఎరుపు, లక్కీ నంబర్: 7
కర్కాటకం (జూన్ 21 - జూలై 22)
ఆకాశంలో ఎగిరే మీ ఊహలకు బ్రేకులు వేయాల్సిన సమయం ఇది. ఆలోచన, ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన సమయం ఇది. విజయాలు వరించే అవకాశాలు ఉన్నాయి. అయితే, జాగ్రత్తతో కూడిన ప్రణాళికతోనే అవి సాధ్యమవుతాయి. ఆస్తులకు సంబంధించిన వ్యవహారాల్లో ఆచి తూచి అడుగేయాలి. ఇతరుల సలహాలను నమ్ముకోవద్దు. ఉద్యోగంలో లేదా పనిప్రదేశంలో మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి.
లక్కీ కలర్: పసుపు, లక్కీ నంబర్: 1
సింహం (జూలై 23 - ఆగస్ట్ 22)
సృజనాత్మక శక్తితో మీరు సాధించే ఫలితాలు అసాధారణంగా ఉంటాయి. అదృష్టం మీ వైపే ఉంటుంది. పరిస్థితులపై అదుపు సాధిస్తారు. మీ సన్నిహితులు మీతో చెప్పాలనుకున్న మాటలను శ్రద్ధగా ఆలకించండి. వారిని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించండి. అపార్థాలను లౌక్యంగా చక్కదిద్దుకోవాల్సి ఉంటుంది. కొత్త వాహనం సమకూరే అవకాశాలు ఉన్నాయి.
లక్కీ కలర్: నలుపు, లక్కీ నంబర్: 8
కన్య (ఆగస్ట్ 23 - సెప్టెంబర్ 22)
ఈ వారంలో మీకు అంతా ప్రేమమయం అన్నట్లుగా ఉంటుంది. పనిచేసే ధోరణిలోనూ మీరు అదే ఉత్సాహాన్ని ప్రదర్శిస్తే మంచిది. మీ కష్టానికి ఫలితాలు దక్కడంలో కాస్త జాప్యం జరిగినా నిరాశ చెందనవసరం లేదు. మీకు దక్కాల్సిన ఫలితాలు త్వరలోనే అందుతాయి. చిన్న చిన్న సమస్యలున్నా చక్కబడతాయి.
లక్కీ కలర్: లేత ఊదా, లక్కీ నంబర్: 9
తుల (సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22)
జ్ఞానాన్ని పెంపొందించుకోవడంపై దృష్టి సారిస్తారు. పాత జ్ఞాపకాలను మరచి ముందుకు సాగడం మంచిది. ఈ నెలంతా మీకు లాభదాయకంగా ఉంటుంది. మీ పురోగతిపై సింహావలోకనం చేసుకుంటారు. ఒక అడుగు వెనక్కి వేసి, పునరాలోచన చేస్తారు. కొత్త వ్యూహంతో ముందంజ వేస్తారు. ఈ వారంలో ప్రయాణావకాశాలు ఉంటాయి. చిన్న చిన్న సమస్యలు ఉన్నా అవి సమసిపోతాయి.
లక్కీ కలర్: ఖాకీ, లక్కీ నంబర్: 7
వృశ్చికం (అక్టోబర్ 23 - నవంబర్ 21)
ఆకర్షణీయమైన మీ మాటలతో ఇతరులను ఇట్టే ఆకట్టుకుంటారు. ఈ వారం మరింత రొమాంటిక్‌గా ఉంటుంది. పనిలో కూడా ఉత్సాహంగా ముందుకు సాగుతారు. మీరు పొగొట్టుకున్నవి ఈ వారంలో తిరిగి మీ వద్దకు చేరుతాయి. మార్పు గురించి ఆలోచించాల్సిన తరుణం ఆసన్నమైంది. అనవసర భయాలను విడిచిపెట్టండి. అవి మీ పురోగతికి అవరోధంగా నిలుస్తాయి.
లక్కీ కలర్: ఆరెంజ్, లక్కీ నంబర్: 5
ధనుస్సు (నవంబర్ 22 - డిసెంబర్ 21)
ఈ వారంలో చాలా మార్పులను చూస్తారు. కొత్త ఇంట్లోకి లేదా ఆఫీసులోకి మారే అవకాశాలు ఉన్నాయి. మీరు చేరే కొత్త ప్రదేశంలో చుట్టూ పచ్చదనం ఉంటుంది. అవివాహితులకు తగిన జీవిత భాగస్వామి దొరికే అవకాశాలు ఉన్నాయి. పనిలో ఉత్సాహాన్ని చూపుతారు. పట్టిందల్లా బంగారంలా ఉంటుంది.
లక్కీ కలర్: గులాబి, లక్కీ నంబర్: 2
మకరం (డిసెంబర్ 22 - జనవరి 19)
ఈ వారమంతా మీకు లాభదాయకంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో పురోగతి సాధిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. మాటలతో ఎలాంటి వారినైనా ఇట్టే ఆకట్టుకుంటారు. ఆరోగ్యం, ఆనందం, సంపద... వీటన్నింటి మధ్య సమతుల్యతను పాటించాల్సిన అవసరం ఉందని గ్రహించండి.
లక్కీ కలర్: పసుపు, లక్కీ నంబర్: 1
కుంభం (జనవరి 20 - ఫిబ్రవరి 18)
అంతా అనిశ్చితిగా, గందరగోళంగా ఉంటారు. గందరగోళంలో ఉన్న మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. మార్పు అనివార్యమని గ్రహించండి. విద్యార్థులు అద్భుతమైన ఫలితాలను సాధిస్తారు. ప్రతి నిమిషం మరింత మెరుగ్గా ఉండటాన్ని నేర్చుకోవాల్సి ఉంటుంది. మనసుకు నచ్చిన వ్యక్తితో ఆహ్లాదంగా గడిపే అవకాశాలు ఉన్నాయి.
లక్కీ కలర్: తెలుపు, లక్కీ నంబర్: 6
మీనం (ఫిబ్రవరి 19 - మార్చి 20)
ఈ వారంలో విపరీతంగా డబ్బు ఖర్చయ్యే అవకాశాలు ఉన్నాయి. మిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. మీ పనిలో మార్పులకు శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఏర్పడుతుంది. మీ సృజనాత్మకతను, నైపుణ్యాలను గరిష్ట స్థాయిలో ఉపయోగించాల్సి ఉంటుంది. వారం ప్రారంభం నిరాశాజనకంగా అనిపించినా, బుధవారం తర్వాత ఉత్సాహం పుంజుకుంటారు. తల్లిదండ్రులకు కాస్త సమయాన్ని కేటాయించాల్సి ఉంటుంది.
లక్కీ కలర్: ఇటుక రంగు, లక్కీ నంబర్: 8
- ఇన్సియా నజీర్, టారో అనలిస్ట్